విజయనగరం

విజయనగరం పట్టణాభివృద్ధికి ‘మాస్టర్ ప్లాన్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, నవంబర్ 29: విజయనగరం పట్టణాభివృద్ధికి వుడా మాస్టర్ ప్లాన్ రూపొందించింది. విఎంఆర్‌డిఎ(విశాఖపట్నం మెట్రోపాలిటిన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ) మాస్టర్ ప్లాన్ ద్వారా భవిష్యత్‌లో విజయనగరం రూపురేఖలు మారిపోనున్నాయి. మంగళవారం విఎంఆర్‌డిఎ వైస్ చైర్మన్ టి.బాబురావునాయుడు ఆధ్వర్యంలో మాస్టర్‌ప్లాన్‌కు సంబంధించి అధికారులకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం విఎంఆర్‌డిఎ పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలు ఉన్నాయన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 52,93,369 మంది జనాభా ఉందన్నారు. నాలుగు జిల్లాల్లో పట్టణాభివృద్ధికి మాస్టర్ ప్రణాళికలు రూపొందించేందుకు వుడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం కెనడాకు చెందిన లీ-అసోసియేట్స్ సౌత్ ఆసియా ప్రైవేట్ లిమిటెడ్‌ను నియమించినట్టు చెప్పారు. ఈ సంస్ధ వచ్చే రెండేళ్లకు మాస్టర్ ప్లాన్ రూపొందించనుందన్నారు. 2036 నాటికి వుడా పరిధిలో విజయనగరం పూర్తి పట్టణాభివృద్ధి చెందుతుందన్నారు. కాగా, వుడా పరిధిలోకి జిల్లాలోని 16 మండలాల పరిధిలోని 521 గ్రామాలను తీసుకురానున్నట్టు ఆయన వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ వుడా మాస్టర్ ప్రణాళికలు రూపొందించేందుకు జిల్లాలోని విజయనగరం మున్సిపాలిటీ, నెల్లిమర్ల నగర పంచాయతీ, 16 మండలాల పరిధిలోని 521 గ్రామాల్లో ప్రభుత్వ, వ్యవసాయ సంబంధ భూముల వివరాలను వుడాకు అందజేయాలన్నారు. విఎంఆర్‌డిఎ పట్టణాభివృద్ధికి సంబంధించి ప్రధానంగా నీటి సరఫరా, సీనరేజి, డ్రైనేజీ, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, కమ్యూనిటీ హాలుకు ముఖ్య ప్రాధాన్యతఇస్తారన్నారు. ఇందుకు తహశీల్దార్లు, ఎంపిడిఒలు, అధికారులు సహకరించాలన్నారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విజయనగరం పరిధిలోని భౌగోళిక స్వరూపం, భూముల సర్వే, ట్రాఫిక్ సర్వే, వౌలిక సదుపాయాల మ్యాపింగ్, పురావస్తు, సంస్కృతిక ఆస్తుల పరిరక్షణ అభివృద్ధి, డ్రాఫ్ట్ నోటిఫికేషన్లు, డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ అంశాలపై వివిధ శాఖల అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, జిల్లా జెసి లఠ్కర్, జెడ్పీ సిఇఒ రాజకుమారి, ఆర్డీవో శ్రీనివాసమూర్తి, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, వ్యవసాయశాఖ జెడి లీలావతి, డిఇఒ అరుణకుమారి పాల్గొన్నారు.

వెబ్‌ల్యాండ్‌లో భూముల వివరాలు పొందుపరచాలి
* ఎఫ్‌ఎంబి రికార్డుల డిజిటలైజేషన్ వేగవంతం
* ఇ-క్రాప్‌లో పంట వివరాలు
* సిసిఎల్‌ఎ ప్రభుత్వ ప్రత్యేక
కార్యదర్శి అనీల్‌చంద్ర పునేఠా
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, నవంబర్ 29: రాష్ట్రంలో భూముల వివరాలను వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయాలని సిసిఎల్‌ఎ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అనీల్ చంద్ర పునీఠా ఆదేశించారు. మంగళవారం వివిధ జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలతో వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రెవెన్యూకు సంబంధించి ప్రజాసాధికార సర్వే, ఎఫ్‌ఎంబి రికార్డుల డిజిటలైజేషన్, ఆర్వోఆర్, మీ-సేవ, మీ-కోసం, వెబ్‌ల్యాండ్, ఇ-క్రాప్, ఇ-పట్టాదారు పాసుపుస్తకాలు, డాటెడ్ ల్యాండ్ అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎఫ్‌ఎంబి రికార్డుల డిజిటలైజేషన్‌ను వేగవంతం చేయాలన్నారు. ప్రభుత్వ భూములు, ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. మీ -కోసం, మీ-సేవ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలన్నారు. ప్రజాసాధికార సర్వేను గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో 78 శాతం ప్రజాసాధికార సర్వే పూర్తి చేశామని జిల్లా జాయింట్ కలెక్టర్ లఠ్కర్ చెప్పారు. రెవెన్యూకు సంబంధించి 90 శాతం ఫైళ్లను పరిష్కరించామన్నారు. మీ-కోసం దరఖాస్తులను 98 శాతం పరిష్కరించినట్టు చెప్పారు. ఈ సమావేశంలో డిఆర్వో జితేంద్ర, కెఆర్‌సిసి డిప్యూటీ కలెక్టర్ శ్రీలత, సర్వేశాఖ ఎడి బిఎల్ నారాయణ పాల్గొన్నారు.

మహిళా అభ్యున్నతికే ప్రభుత్వ పథకాలు
* మంత్రి మృణాళిని
గరివిడి, నవంబర్ 29: రాష్ట్రంలో మహిళలు, రైతుల అభ్యున్నతే ధ్యేయంగా తెలుగు దేశం ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి డాక్టర్ కిమిడి మృణాళిని అన్నారు. మంగళవారం మండలంలోని నడిపేన పేట, దేవాడ, తోండ్రంగి గ్రామాలలో జరిగిన జనచైతన్య యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ప్రగతి సాధించినప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందని, ఈ దిశగా ప్రభుత్వ కార్యక్రమాలలో మహిళలను ముఖ్యమంత్రి చంద్రబాబు భాగస్వాములను చేస్తున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాలలో వౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కోట్లాది రూపాయలను కేటాయిస్తుందన్నారు. ప్రజా సమస్యలను దశలవారిగా పరిష్కరించి అన్ని గ్రామాలను తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బలగం కృష్ణమూర్తి, ఎంపిపి పైల సింహాచలం, మాజీ ఎంపిపి పైల బలరామ్, వైస్ ఎంపిపి వెంకటరావు పాల్గొన్నారు.

కాంట్రాక్టు లెక్చరర్లను
శాశ్వత ఉద్యోగులుగా గుర్తించండి
* సమాన పనికి సమాన వేతనం అమలుచేయాలి
* రాజకీయ పార్టీల నేతల సంఘీభావం
విజయనగరం(టౌన్), నవంబర్ 29: గత 16 సంవత్సరాలుగా ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు విధానంలో విద్యార్థ్ధులకు విద్యాబోధన చేస్తున్న కాంట్రాక్టులెక్చరర్లను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టు లెక్చరర్ల జెఎసి ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. కాంట్రాక్టు లెక్చరర్లు చేపట్టిన పోరాటానికి వైకాపా జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధానకార్యదర్శి అజయ్‌శర్మ, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆదిరాజు, ఎఐటియుసి రాష్ట్ర నాయకుడు వి.కృష్ణంరాజు మద్దతుగా పాల్గొన్నారు. ఈసందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు వారికి ఇచ్చిన వాగ్దానాన్ని అమలుచేయకుండా విద్యార్థులకు పాఠాలు బోధించే లెక్చరర్లను రోడ్డుమీదకు వచ్చేలా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రానున్న శాసనసభా సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించే విధంగా ప్రతిక్షనేత జగన్ దృష్టికి తీసుకువెళతామన్నారు. డిసిసి అధ్యక్షుడు ఆదిరాజు మాట్లాడుతూ కాంట్రాక్టు లెక్చరర్లను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించే విషయంలో ప్రభుత్వం కాకమ్మకబుర్లు చెప్పడం తగదని హెచ్చరించారు. మంత్రుల కమిటీ వేసి కాలయాపన చేయకుండా న్యాయమైన డిమాండ్లను వెంటనే ఆమలుచేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలుచేసే వరకు అండగా ఉంటామని మద్దతు పలికారు. ఉత్తరాంధ్ర అభివృద్దివేదిక ప్రధానకార్యదర్శి అజయ్‌శర్మ మాట్లాడుతూ సమానపనికి సమాన వేతనం అమలు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలులో తాత్సారం చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. కాంట్రాక్టు లెక్చరర్లను ప్రభుత్వం శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎఐటియుసి రాష్ట్ర నాయకుడు కృష్ణంరాజు మాట్లాడుతూ కాంట్రాక్టు లెక్చరర్ల నాణ్యమైన డిమాండ్లను తీర్చడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. జెఎసి నాయకుడు దొరబాబు మాట్లాడుతూ కాంట్రాక్టు లెక్చరర్లు గత 16 ఏళ్లుగా సేవలు అందిస్తుంటే కేవలం నెలకు 18వేల రూపాయలు వేతనం అందుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. శాశ్వత లెక్చరర్లకు తమకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. పదవ పిఆర్‌సి అమలుచేసి డిసెంబర్ 2వతేదీలోగా నిర్ణయం తీసుకోకపోతే సమ్మె తప్పదని హెచ్చరించారు. మంత్రుల కమిటీ సిఫార్సులను అమలుచేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పలు రాష్ట్రప్రభుత్వాలు కాంట్రాక్టు లెక్చరర్లను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాయని చెప్పారు. శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని నినాదాలు చేశారు. ఈకార్యక్రమంలో జెఎసి నాయకులు రౌతు గోపీ, సూర్యనారాయణ, అప్పలనాయుడు, వీరాచారి, చంటిబాబు,అప్పలసూరి పాల్గొన్నారు.

పేదల కాలనీల్లో కనీస సౌకర్యాలు కల్పించండి
* సిపిఎం ఆధ్వర్యంలో పేదల అందోళన
విజయనగరం(టౌన్), నవంబర్ 29: పట్టణంలో పేదలు నివసిస్తున్న కాలనీలకు కనీస సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ యంత్రాంగం ఇచ్చిన హామీ అమలుచేసే వరకు పోరాటం కొనసాగుతుందని సిపిఎం డివిజన్ కమిటీ కార్యదర్శి రెడ్డి శంకరరావు స్పష్టం చేశారు. మంగళవారం పేదల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముట్టడి చేపట్టారు. ఈసందర్భంగా రెడ్డి శంకరరావు మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పేదలు నివసిస్తున్న రామకృష్ణనగర్, కామాక్షినగర్, ఎల్ బిజి నగర్‌లకు కరెంట్ సౌకర్యం కల్పించేందుకు మున్సిపల్ అధికారులు ఇస్తామని చెప్పిన ఎన్‌ఒసిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని కోరుతూ పేదలు అందచేసిన దరఖాస్తులపై వెంటనే దర్యాప్తు చేసి మంజూరు చేయాలని కోరారు. కాలనీలలో సిసి రహదారులు, మంచినీరు, విద్యుత్ సౌకర్యం కల్పించి పేదల సమస్యలను పరిష్కరించాలని కొంతకాలంగా కోరుతుంటే కనీసం పట్టించులేదని ధ్వజమెత్తారు. నల్లచెరువు, అశోక్‌నగర్‌లో రహదారుల వెడల్పు కారణంగా ఇళ్లు కోల్పోయే వారికి ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో పార్టీ నాయకులు రమణమ్మ, జీవా, ఆనంద్, బి.రమణ పేదలు పాల్గొన్నారు.

పెద్దనోట్ల రద్దుతో ప్రజల అవస్ధలు
* ముఖ్యమంత్రికి పట్టని ప్రజల ఇబ్బందులు
* వైకాపా జిల్లా అధ్యక్షుడు కోలగట్ల
విజయనగరం (్ఫర్టు), నవంబర్ 29: పెద్దనోట్ల రద్దుతో గత 20 రోజులుగా సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు తమకేమి పట్టనట్లుగా వ్యవహరించడం విచారకరమని వైకాపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. గడపగడపకూ వైకాపాలో భాగంగా మంగళవారం పట్టణంలో 38వ వార్డులో పర్యటించారు. బూర్లపేట జంక్షన్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించి, ప్రభుత్వవైఫల్యాలపై పార్టీ రాష్ట్ర నాయకత్వం రూపొందించిన ప్రశ్నావళిని ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి గాలికి వదిలేశారని తెలిపారు. రెండున్నరేళ్ల టిడిపి పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని చెప్పారు. అటువంటి సంక్షేమ పథకాలను అమలు చేయకపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడుతోందన్నారు. 2019 ఎన్నికలలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌ను ఎలాగైనా ముఖ్యమంత్రిని చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలిపారు. తెలుగుదేశం పాలనపై ప్రజలు విసుగు చెందుతున్నారని, రానున్న ఎన్నికలలో ఆ పార్టీకి గట్టి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆశపువేణు, 38వ వార్డు అధ్యక్షుడు ఆడారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

రోడ్డు నిర్మాణానికి నిరసన ప్రదర్శన
విజయనగరం (్ఫర్టు), నవంబర్ 29: పట్టణంలో కొత్త ఆగ్రహారం నీళ్లట్యాంక్ నుంచి గాజులరేగ బ్రిడ్జి వరకూ ఉన్న రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో స్థానికులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ మాట్లాడుతూ రోడ్డు నిర్మాణాన్ని పూర్తిచేయాలని ఎన్నిసార్లు కోరినా మున్సిపల్ పాలకవర్గం పట్టించుకోవడం లేదన్నారు. రోడ్డు అధ్వాన్నంగా ఉండటంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ రహదారిని ఆనుకుని విద్యాసంస్థలు ఉన్నాయని, రాకపోకలు సాగించలేక ప్రతినిత్యం విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారని చెప్పారు. రోడ్డు నిర్మాణం కోసం కేటాయించిన నిధులు ఏమయ్యాయో అర్థం కావడం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను స్మార్ట్ సిటీలుగా మార్చుతామని, ప్రతి మున్సిపాలిటీలో ఉన్న అపరిశుభ్రత సమస్యను పరిష్కరించి మున్సిపల్ వార్డులను ఆకర్షణీయమైన వార్డులుగా తయారు చేస్తామని టిడిపి పాలకులు చేసిన ప్రకనటలు వాస్తవంగా కార్యరూపం దాల్చడం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బుగత సూరిబాబు, బాయి రమణమ్మ పాల్గొన్నారు.

నగదు రహిత లావాదేవీలు జరపాలి
* జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్
నెల్లిమర్ల, నవంబర్ 29: ప్రతి ఒక్కరూ నగదు రహిత లావాదేవీలు జరపాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ సూచించారు. మంగళవారం మండలంలోని గరికిపేట గ్రామంలో ఎపిజివిబి నెల్లిమర్ల శాఖ ఖాతాదారులకు రూపే కార్డులను పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వివేక్ మాట్లాడుతూ డిసెంబర్ ఒకటి నుండి ప్రతి ఒక్కరు తమ ఆర్థిక కార్యకలాపాలను నగదు రహితంగా జరపాలన్నారు. బ్యాంకు అధికారులు అందజేస్తున్న రూపే కార్డులను వినియోగించి రేషన