విజయనగరం

నూతన విద్యావిధానం విద్యారంగానికి చేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), డిసెంబర్ 11: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యావిధానాలు ప్రభుత్వ రంగ విద్యకు చేటు కలిగించే విధంగా ఉన్నాయని, వీటిని తిప్పి కొట్టేందుకు ఐక్యపోరాటాలకు సిద్ధం కావాలని ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎంవి ఎస్ శర్మ పిలుపు నిచ్చారు. ఎపి ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య 42వ రాష్ట్ర మహాసభలు ఆదివారం విజయనగరం పట్టణంలో ఘనంగా ప్రారంభయ్యాయి. రెండు రోజలు జరిగే సమావేశాల్లో విద్యారంగంలో ఎదురవుతున్న సవాళ్లు, ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించి పూర్తిస్ధాయిలో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గురజాడ కళావేదిక ప్రాంగణంలో యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ప్రధాన వక్తగా ఎమ్మెల్సీ శర్మ మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విద్యావిధానంలోని ముసాయిదాలో అనేక అంశాలు విద్యారంగానికి చేటు కలిగించేవి ఉన్నాని చెప్పారు. కనీస విద్యకు ప్రమాదకరంగా, మాతృభాషలో కనీస విద్య కొనసాగించడానికి అవకాశం లేకుండా కేవలం కొద్దిమందికే పరిమితమైన సంస్కృతంలో విద్యను అభ్యసించాలనే ఆలోచన వెనుక కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ విద్యను బలోపేతం చేయకుండా పాఠశాలలు మూసివేత, ఉపాధ్యాయుల పోస్టులు 19వేల వరకు ఉన్నవి భర్తీ చేయకుండా నాణ్యమైన విద్య అందించడం ఎలా సాధ్యమో ముఖ్యమంత్రిచంద్రబాబు చెప్పాలని ప్రశ్నించారు. ఫిన్లండ్ తరహా విద్యావిధానం అమలు చేస్తామని చెబుతున్న విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అక్కడ 12వ తరగతి వరకు ఉచిత విద్య అందించే చర్యలుంటే ఇక్కడ ఎందుకు ప్రవేశపెట్టడం లేదని నిలదీశారు. డిజిటల్ క్లాస్‌రూం విద్యావిధానంలో ఉపాధ్యాయుడుకు, విద్యార్ధికి మధ్య ప్రత్యక్ష సంబంధాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తంచేశారు. సిపిఎస్ విధానం రద్దుకోసం సంఘటిత పోరాటలకు సిద్దం కావాల్సి సమయం ఆసన్నమైందని చెప్పారు. నూతన విద్యావిధానం వలన మానవ వనరుల నాశనం అవుతాయని, నాణ్యమైన విద్యార్థులు కార్పొరేట్లకు, వెనుకబడిన వారిని స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో వృత్తి పనులకు పరిమితం చేసే ప్రమాదాన్ని ఉపాధ్యాయ లోకం పసిగట్టాలని వివరించారు. ఉపాద్యాయ ఎమ్మెల్సీ బొడ్డునాగేశ్వరరావు మాట్లాడుతూ సమాజ అభివృద్ధి సంపూర్ణ విద్యపైనే ఆధారపడి ఉందని స్పష్టంచేశారు. విద్యారంగం సవాళ్లను, సమస్యలను, పరిష్కారాలను శాసనమండలి సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చామని చెప్పారు. కామన్ స్కూలు విధానం, కంప్యూటర్ టీచర్లు లేకుండా డిజిటల్ క్లాసులు నిర్వహణ ఏవిధంగా చేయగలరని విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకు వెళ్లామని అన్నారు. నూతన విద్యావిధానం ద్వారా మతోన్మాద విధానాన్ని విద్యావ్యవస్ధలోకి ప్రవేశ పెట్టే చర్యలకు కేంద్రం ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. అక్షరాశ్యత పెరగాలంటే కనీస విద్యకు ప్రాధాన్యత నిచ్చి, పాఠశాలలు మూసివేత, ఉపాధ్యాయులు పోస్టు భర్తీ అంశాలపై ప్రభుత్వం దృష్టిసారించాలని మాజీ ఎంపి డివిజి శంకరరావు సూచించారు. శోధన సంస్ధల వ్యవస్ధాపకుడు పిడి కామేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని కోరారు. విద్యారంగ పరిరక్షణకు యూనియన్ పరంగా, ప్యాప్టో ద్వారా ఐక్య పోరాటాలద్వారా చేస్తున్న కృషిని రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు వెంకటేశ్వరరావు, బాబురెడ్డి వివరించారు. విద్యాశాఖ మంత్రి ఇచ్చిన హామీలు అమలుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక అధ్యక్షుడు అజయ్ శర్మ మాట్లాడుతూ సమస్యలపై పోరాటాలు చేపట్టాలని, అదేసమయంలో విద్యావ్యవస్ధను నిర్వీర్యం చేసేందుకు జరగుతున్న కుట్రలను ఎదుర్కొనేందుకు సంఘటిత పోరాటాలకు తోడు బాధిత వర్గాలను కలిపి ప్రభుత్వాలపై ఓత్తిడి తీసుకురావాలన్నారు.
రాష్ట్ర మహాసభల సందర్భంగా పట్టణంలోని జెడ్పీ కార్యాలయం నుండి బహిరంగ సభావేదిక గురజాడ కళాక్షేత్రం వరకు 13 జిల్లాల నుండి తరలివచ్చిన ఉపాధ్యాయులు, కార్యవర్గ సభ్యులు, మహిళా ఉపాధ్యాయులు ర్యాలీలో పాల్గొన్నారు. ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలపై ర్యాలీలో నినాదాలు చేశారు. ఈసందర్భంగా ఈవిద్యాసంవత్సరంలో 10వతరగతి విద్యార్ధులకు ఉపయుక్తంగా ఉండే మోడల్ టెస్ట్ పేపర్లను యూనియన్ తరపున ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర సహ అధ్యక్షురాలు విజయగౌరి, రాష్ట్ర కార్యదర్శి రాము, జిల్లా అధ్యక్ష ప్రధానకార్యదర్శులు శ్రీనివాసరావు, శేషగిరి సభ్యులు పాల్గొన్నారు.

కంట్రిబ్యూటరీ పింఛన్ విధానం రద్దుకు పోరాటం
* జిల్లా కమిటీ నిర్ణయం
విజయనగరం(టౌన్), డిసెంబర్ 11: కంట్రిబ్యూటరీ పింఛన్ విధానం రద్దుచేసే వరకు ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని సిపిఎస్ ఉద్యోగుల జిల్లా సంఘం నూతన కమిటీ నిర్ణయించింది. ఆదివారం పట్టణంలోని రెవెన్యూకల్యాణ మండపంలో జరిగిన జిల్లా కమిటీ నూతన కార్యవర్గ సమావేశంలో 2004 తరువాత ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారికి ఎటువంటి భద్రతలేని సిపిఎస్ విధానాన్ని పూర్తిగా రద్దుచేసి పాత పింఛన్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని జిల్లా సమావేశం డిమాండ్ చేసింది. జిల్లాల కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. జిల్లా అధ్యక్షునిగా గంటా శ్రీనివాసరావు, ప్రధానకార్యదర్శిగా సుంకరి భానుమూర్తి, జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన ఎల్ యుగంధర్‌ను రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, జిల్లా కమిటీ కోశాధికారిగా చందకసూర్యారావు,గౌరవాధ్యక్షులుగా పద్మవిభూషణ్, అసోసియేట్ అధ్యక్షునిగా శివకుమార్,మహిళాకమిటీ అధ్యక్షురాలిగా రాజ్యలక్ష్మి, అదనపుకార్యదర్శిగా సంతోష్‌కుమార్, ఉపాధ్యక్షునిగా పైడిపునాయుడు,గంగునాయుడు, లక్ష్మణరావు,రమేష్, తిరుపతిరావు సీతన్న, వెంకటరమణ ఎన్నికయ్యారు.

నేటి నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు
దేహదారుఢ్య పరీక్షలు
* ఆన్‌లైన్ విధానంలో ఎంపిక
* సిసి కెమెరాలు, సెన్సార్లు ఏర్పాటు
* అభ్యర్థులకు 12 నుంచి 21 తేదీ వరకు ఎంపికలు

విజయనగరం, డిసెంబర్ 11: పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం అభ్యర్థులకు సోమవారం నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 5 గంటల నుంచి అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు అనంతరం పరుగుపందెం నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ ఎల్‌కెవి రంగారావు చెప్పారు. ఆదివారం కానిస్టేబుల్ ఎంపికకు పోలీసు అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపిక విధానం, అభ్యర్థుల అర్హతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. గతనెల 6వతేదీన బొబ్బిలి, విజయనగరం కేంద్రాల్లో రాత పరీక్షలో అర్హత సాధించిన 7885 మంది పురుషులు, 1332 మంది మహిళలకు శారీరక, దేహధారుఢ్య పరీక్షలు ఉంటాయన్నారు. అభ్యర్థులు ఏరోజు పరీక్షలకు హాజరుకావాల్సింది హాల్‌టిక్కెట్‌లో పొందుపరిచామన్నారు. అభ్యర్థులు తమ విద్యార్హతలు, ఇతర రిజర్వేషన్ల ఒరిజినల్ సర్ట్ఫికెట్లను తమతో తీసుకురావాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు హాల్‌టిక్కెట్ల కోసం పోలీసు వెబ్‌సైట్ ‘రిక్రూట్‌మెంట్.ఎపిపోలీస్.జిఒవి.ఇన్’ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.
దేహదారుఢ్య పరీక్షలను రెండు దశలలో నిర్వహిస్తామన్నారు. మొదటగా అభ్యర్థుల చాతి, ఎత్తు, బరువు, 1600 మీటర్ల పరుగు పందెం నిర్వహిస్తామన్నారు. ఇందులో అభ్యర్థులు శారీరక కొలతలతోపాటు 1600 మీటర్ల పరుగుపందెంలో అర్హత సాధించాలన్నారు. ఇందులో అర్హత సాధించిన వారికి రెండు, మూడు గంటల విరామం అనంతరం వంద మీటర్లు లాంగ్‌జంప్ పోటీలు ఉంటాయన్నారు. కాగా, కానిస్టేబుల్, వార్డర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మిగిలిన రెండు ఈవెంట్లలో ఏదేని ఒక ఈవెంట్‌లో అర్హత సాధించాలన్నారు. బ్యాచ్‌కు 30 మంది చొప్పున పరుగుపందెం ఉంటుందన్నారు. ఎంపిక విధానం వద్ద ప్రతి చోట సిసి కెమెరాలు, సెన్సార్లు ఏర్పాటు చేయడంతో పారదర్శకంగా ఎంపిక ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు. దాదాపు 50 కంప్యూటర్లు ఏర్పాటు చేయనున్నారు. సిబ్బందితో పనిలేకుండా పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో ఎంపిక చేయనున్నారు. ఎంపికకు వచ్చిన అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా 12 టెంట్‌లు ఏర్పాటుచేశారు. అంబులెన్స్, వైద్యులను ఏర్పాటు చేశారు.

ప్రభుత్వానికి అండగా నిలుస్తాం!

విజయనగరం, డిసెంబర్ 11: భారతదేశానికి సేవలు అందించిన మాజీ సైనికోద్యోగులు నేడు సమాజ సేవకు సిద్ధం అవుతున్నారు. ఆదివారం ఇక్కడ మాజీ సైనికోద్యోగుల భవన్‌లో విలేఖరుల సమావేశంలో సైనిక సంక్షేమ సంఘం ప్రతినిధి సత్యనారాయణ రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో 7 లక్షల మంది మాజీ సైనికోద్యోగులు ఉన్నారన్నారు. వీరంతా సమాజ సేవకు నడుం బిగిస్తే ప్రజల్లో చైతన్యం తీసుకురాగలమన్నారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు దేవర ఈశ్వరరావు మాట్లాడుతూ నీతి, నిజాయితీలతో విధులు నిర్వహించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛ భారత్, ఇతర పథకాలకు తమవంతు సహకారం అందిస్తామన్నారు. ప్రభుత్వం కూడా తమకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికోద్యొగులు బి.వెంకటరావు, వైకుంఠరావు, రాజారావు పాల్గొన్నారు.

ప్రజల భాగస్వామ్యంతో పాఠశాలల అభివృద్ధి
* ఎంఎంసిలకు ముగిసిన శిక్షణ

విజయనగరం, డిసెంబర్ 11: ప్రజల భాగస్వామ్యంతోనే పాఠశాలలు అభివృద్ధి చెందుతాయని సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి ఎస్.లక్ష్మణరావు అన్నారు. గత రెండు రోజులుగా కస్పా పాఠశాల ఆవరణలోని వనరుల కేంద్రంలో ఏర్పాటుచేసిన శిక్షణ ముగింపులో పలువురు వక్తలు మాట్లాడారు. పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం, ఇతర పథకాలు విజయవంతానికి నిర్వహించేందుకు పాఠశాల యాజమాన్య కమిటీలు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. పాఠశాలల ప్రగతికి, విద్యాహక్కు చట్టం అమలుకోసం, బాలల హక్కుల పరిరక్షణ కోసమే ప్రభుత్వం పాఠశాల యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేసిందన్నారు. ఈ కమిటీలో ఒక్కో తరగతి నుంచి ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులు కలిపి మొత్తం 15 మంది సభ్యులు ఉంటారన్నారు. ప్రాథమికొన్నత పాఠశాలలో (1-8) 24 మంది, ఉన్నత పాఠశాలలో (6-8) 9 మంది సభ్యులు ఉంటారన్నారు. వీరితోపాటు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా హెచ్‌ఎం, పాఠశాల ఉపాధ్యాయుడు, కౌన్సిలర్, ఎఎన్‌ఎం, వార్డు మహిళ, అంగన్‌వాడీ వర్కర్ ఉంటారని తెలిపారు. కో-ఆప్షన్ సభ్యులుగా ఎన్‌జిఒ లేదా విద్యావేత్త, సర్పంచ్ లేదా మున్సిపల్ చైర్మన్ వ్యవహరిస్తారన్నారు. ఈ కమిటీ సభ్యులు పాఠశాల పనితీరును అజమాయిషీ చేయడం, పాఠశాల అభివృద్ధి ప్రణాళికలు తయారుచేయడం, ప్రణాళికలోని పనులు అనుకున్న విధంగా జరిగేటట్టు చూడటం చేయాలన్నారు. ఇందుకు ఉన్న కమిటీలే మూడు ఉపకమిటీలుగా ఏర్పడి ఆ బాధ్యతలను పంచుకోవాలన్నారు. ఒక కమిటీ పాఠశాల పరిపాలన, అజమాయిషీ, రెండో కమిటీ అకడమిక్ మానిటరింగ్ విభాగం, మూడో కమిటీ పాఠశాల పరిశుభ్రత, ఆరోగ్యం, మధ్యాహ్న భోజన పథకం అమలు వంటివి చేపట్టాలన్నారు. పాఠశాలలో విద్యాహక్కు చట్టం అమలు బాధ్యత పాఠశాల యాజమాన్య కమిటీలదేనని స్పష్టం చేశారు. పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశాలు నిర్వహించాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులపై ఉంటుందన్నారు. ఈ సందర్భంగా సర్వశిక్ష అభియాన్ చేపట్టే కార్యక్రమాలపై పాఠశాల యాజమాన్య కమిటీలకు అవగాహన కల్పించారు. పాఠశాలల ఏర్పాటు, ఉపాధ్యాయుల నియామకం, వసతుల కల్పన, నాణ్యమైన విద్య, కంప్యూటర్ ఆధారిత విద్య, శిక్షణ కార్యక్రమాలు చేపట్టడం, పాఠశాల సంసిద్ధత చేపట్టడం కార్యక్రమాలపై పాఠశాల యాజమాన్య కమిటీలకు మాస్రా సంస్థ కన్సల్టెంట్ అక్షయ్ ఆధ్వర్యంలో రిసోర్స్ పర్సన్లు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైడిఒ నెట్‌వర్క్ ప్రతినిధి సిహెచ్ కృష్ణతోపాటు పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

నేడు ఈద్ మిలాదు నబీ పండుగ
విజయనగరం (పూల్‌బాగ్), డిసెంబర్ 11: ముస్లింలు వేడుకగా జరుపుకొనే ఈద్ మిలాదు నబీ పండుగకు ఇమామ్‌లు సన్నాహాలు చేస్తున్నారు. మహ్మద్ ప్రవక్త 1489 జయంతి సందర్భంగా సోమవారం ఈ పండుగను జరుపుకొనేందుకు సన్నాహాలు చేసుకున్నారు. ఈ పండుగను పురస్కరించుకొని వేకువ జామునుంచి దైవప్రార్ధనలు చేసిన అనంతరం పవిత్ర గ్రంథమైన దివ్య ఖురాన్‌ను పఠించి నమాజు చేస్తారు. ఈ సందర్భంగా ముస్లింలు ధర్మం, న్యాయం, నీతినిజాయితీగా ప్రజలందరూ సర్వమతాలకు శాంతి సద్భావన కలగాలని అల్లాను ప్రార్థిస్తారు. ఈయన కాలం నుంచి ఖురాన్ గ్రంథంలోని అంశాలను మంచిని, ప్రేమను సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు ఉద్భోదించేవారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం 8 గంటలకు ఆబాద్ వీధి ఉర్ధూ పాఠశాల నుంచి ర్యాలీగా బయలుదేరి అంబటి సత్రం, మూడులాంతర్లు, గంటస్తంభం, ఎన్‌సిఎస్ థియేటర్, నాయుడు ఫంక్షన్ హాల్ మీదుగా కలెక్టరేట్ ఆఫీసు, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్, ఆర్టీసీ కాంప్లెక్స్, కోట జంక్షన్, జామియా మసీదు వరకు కొనసాగుతుంది. మసీదు ఇమామ్‌లు, కమిటీ పెద్దలు, సీరత్ కమిటీ పెద్దలు పాల్గొంటారు. ఈ సందర్భంగా మాజీ వక్ఫ్‌బోర్డు అధ్యక్షుడు ఎ.కరీం మాట్లాడుతూ భారతదేశ పురోభివృద్ధికి అన్ని మతాల సమైక్యతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలి
* రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ డిమాండ్
విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 11: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్ డిమాండ్ చేశారు. రైతు రక్షణ యాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జరిగిన సభలో ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న అస్తవ్యస్త, రైతాంగ వ్యతిరేక విధానాలవల్ల వ్యవసాయరంగం సంక్షోభంలో పడిందన్నారు. ఫలితంగా రాష్ట్రంలో 91శాతం రైతులు అప్పుల పాలవుతున్నారని తెలిపారు. సమగ్ర వ్యవసాయ విధానాన్ని రూపొందించకపోవడం వల్ల ఈ రంగం కోలుకోలేని సమస్యలను ఎదుర్కొంటుందన్నారు. అధికారంలోకి వస్తే డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలు గాలిలో కలిసిపోయాయని ఎద్దేవా చేశారు. రైతులు, కౌలురైతులకు, గ్రామీణ పేదలకు బ్యాంకు రుణాలు అందని ద్రాక్షగా మారాయని ఆరోపించారు. అందువల్ల 60ఏల్లు దాటిన రైతులు, గ్రామీణ పేదలకు నెలకు పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా రైతు ఆదాయ కమిషన్ ఏర్పాటుచేసి రైతులందరికీ ఐదు లక్షల రూపాయల వరకు బీమా సౌకర్యం కల్పించి ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలన్నారు. ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేసి రైతులకు ఇళ్లు, విద్య, వైద్యం సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. వాతావరణ సమస్యలను పరిష్కరించి పర్యావరణ పరిరక్షణకు, కరవు నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి పి.గంగాభవాని, జిల్లా కన్వీనర్ ఎం.మణికుమార్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్, నియోజకవర్గ కార్యదర్శి బుగత సూరిబాబు పాల్గొన్నారు.

సమాన పనికి సమాన వేతనం అమలుచేయాలి
* సిటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.గఫూర్
విజయనగరం(టౌన్), డిసెంబర్ 11: ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నికల్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే ఎం.ఎ.గఫూర్ డిమాండ్ చేసారు. కాంట్రాక్టు లెక్చరర్లు చేపట్టిన సమ్మె ఆదివారం పదవ రోజుకి చేరింది. ఈ శిబిరాన్ని సందర్శించిన సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్ లెక్చరర్ల సమ్మెకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసులను క్రమబద్ధీకరించాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాల్సిన ప్రభుత్వం జాప్యం చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం వెంటనే కాంట్రాక్టు లెక్చరర్ల నాయకత్వంతో చర్చలు జరిపి డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ లెక్చరర్ల సంఘం గౌరవ అధ్యక్షులు గౌరీ ప్రసాద్, తల్లిదండ్రుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మధు, సత్యనారాయణలు కాంట్రాక్టు లెక్చరర్ల పోరాటానికి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో జెఎసి నాయకులు దొరబాబు, సూర్యనారాయణ, మధుసూధనరావు, అప్పారావు, చంటిబాబు, మాధురి, సత్యనారాయణ, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే
ఆందోళన ఉద్ధృతం
* ఎఐటియుసి జిల్లా అధ్యక్షుడు కృష్ణంరాజు హెచ్చరిక
విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 12: మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని ఎఐటియుసి జిల్లా అధ్యక్షుడు వి.కృష్ణంరాజు హెచ్చరించారు. ఆదివారం ఇక్కడ అమర్‌భవన్‌లో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయవల్సిందేనని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం సమాన పనికి సమానవేతనం అమలు చేయడానికి ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తుందో అర్థం కావడం లేదన్నారు. మున్సిపల్ కార్మికులు ప్రధానంగా ఏడు సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. కార్మికుల సమస్యలపట్ల చిన్నచూపు చూస్తున్న పాలకవర్గం తీరు మారకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు. గతంలో విజయనగరం మున్సిపాలిటీలో జరిగిన సమ్మెలో పాల్గొన్న ముగ్గురు కార్మికులను తొలగించారని, వారిని ఇప్పటికీ విధులలోకి తీసుకోలేదని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న ఏడు ప్రధాన సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 5 నుంచి 20వతేదీ వరకు గుంటూరులో జరిగే నిరాహారదీక్షలో జిల్లా నుంచి 20 మంది మున్సిపల్ కార్మికులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా నిరాహారదీక్ష వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎస్.రంగరాజు పాల్గొన్నారు.