విజయనగరం

ఐక్యంగా రాజకీయ అధికారం సాధిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, డిసెంబర్ 26: బిసిలు ఐక్యంగా మెలగి రాజకీయ అధికారం సాధిద్దామని బిసి సంక్షేమం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేతన శంకరరావు అన్నారు. సోమవారం స్థానిక ఎన్‌జిఓ హోమ్‌లో గజపతినగరం నియోజకవర్గ స్థాయి బిసి సంక్షేమ సాధికార సదస్సు నియోజకవర్గ అధ్యక్షుడు దేవర ఈశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా శంకరరావు మాట్లాడుతూ బిసి కులాల మధ్య ఐక్యత లోపించడంతో వారిని రాజకీయంగా, సామాజికంగా అణగదొక్కుతున్నారని అన్నారు. కాపులను బిసిల్లో చేర్చితే ఇప్పటికే బిసిల్లో ఉన్న ఉత్తరాంధ్రలోని తూర్పు కాపులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. జనాభాలో 45 నుండి 50 శాతంగా ఉన్న బిసి కులాల వారికి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్టీ ఆర్ హయాంలో తప్ప ఏ రాజకీయ పార్టీ, నాయకుడు బిసిలకు చేసిందేమీ లేదన్నారు. కాపులకు, బిసిలకు మధ్య వైరం పెట్టి కుమ్ములాటలు జరిగే విధంగా ప్రభుత్వం చూస్తుందన్నారు. బిసి సబ్‌ప్లాన్ కింద కేటాయించిన నిధులు అన్నింటిని బిసిలకే పూర్తిగా ఖర్చు చేయాలన్నారు. బిసిలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు అట్రాసిటీ చట్టం వెంటనే తీసుకురావాలని చెప్పారు. బిసిల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. కొన్ని రాజకీయ ఒత్తిడులు కారణంగా 1990లో విపి సింగ్ కేంద్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలలో వెనుకబడిన తరగతులకు 27శాతం రిజర్వేషన్ కల్పించక తప్పలేదన్నారు. 2001 వరకు బిసి జాబితాలో ఉన్న 93 కులాల వారీ జనాభా మల్టీపర్పస్ హౌస్ హోల్డ్ సర్వే ప్రకారం 43.16 శాతం కాగా, తదుపరి 2007లో కొత్తగా 30 కులాలను చేర్చడం వలన బిసి కులాల జాబితా 120కి, 15తరగతుల ముస్లింలను కూడా కలిపితే 135కి పెరిగిందన్నారు. పెరిగిన బిసి జాబితాకి తగినట్లు బిసి కోటా పెంచక తప్పదని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ముద్దాడ మధు, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కిషోర్‌కుమార్, విశాఖ జిల్లా అధ్యక్షుడు సుబ్బారావు, కార్యదర్శి దొగ్గ దేవుడు నాయుడు, బూడి వెంకటరావు, సామంతుల పైడిరాజు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం
* సిపిఐ జిల్లా కార్యదర్శి కామేశ్వరరావు
విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 26: ప్రజా సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటాలు చేస్తున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి పి.కామేశ్వరరావుతెలిపారు. సిపిఐ 91వ వార్షికోత్సవ దినోత్సవం సోమవారం ఇక్కడ అమర్‌భవన్‌లో జరిగింది. సిపిఐ జెండాను ఆవిష్కరించి జరిగిన సమావేశంలో కామేశ్వరరావు మాట్లాడుతూ 90 ఏళ్ల నుంచి భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజల పక్షాన ఉద్యమాలు చేపడుతుందని చెప్పారు. జిల్లాలో ప్రజా ఉద్యమాలను నిర్వహించడంలో చురుకైన పాత్ర నిర్వహిస్తున్నామని, గ్రామస్థాయిలో ప్రజల సహకారంతో ప్రజాసమస్యల పరిష్కారానికి విశేషంగా కృషి చేస్తున్నామని చెప్పారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలు చేసేందుకు సిపిఐ కార్యకర్తలు ప్రజలను సమీకరిస్తారన్నారు. కార్పొరేట్‌శక్తులు, బడా పారిశ్రామికవేత్తలకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సంపూర్ణ సహకారం అందిస్తున్నాయని, ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు వి.కృష్ణంరాజు, ఆల్తి అప్పలనాయుడు, ఎస్.రామచంద్రరావు, బుగత సూరిబాబు, బుగత అశోక్, ఒమ్మి రమణ, ఆల్తి చినమారయ్య పాల్గొన్నారు.