విజయనగరం

ఎస్సీల సంక్షేమానికి ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, డిసెంబర్ 19: షెడ్యుల్ కులాల సంక్షేమానికి ప్రభుత్వం వివిధ పథకాల కింద కేటాయించిన నిధులు వారి అభివృద్ధికే ఖర్చు చేయాలని కలెక్టర్ ఎంఎం నాయక్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఎస్సీ సంక్షేమ పథకాలు సకాలంలో పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లాలో షెడ్యుల్ కులాల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాల ప్రగతి, వచ్చే అర్థిక సంవత్సరానికి కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై చర్చించేందుకు సంబంధిత శాఖల అధికారులతో ఆయన శనివారం కలెక్టరేట్ మీటింగ్‌హాల్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బడుగువర్గాల సంక్షేమం కోసం రాష్టష్రభ్రుత్వం భారీగా నిధులు కేటాయిస్తోందని, ఈనిధులను సకాలంలో వినియోగించి ఎస్సీల సంక్షేమానికి కృషిచేయాలని అన్నారు. జిల్లాలో వ్యక్తిగత, కుటుంబ సంక్షేమ పథకాల మంజూరుకు అర్హులైన ఎస్సీ లబ్ధిదారులను గుర్తించాలని, ఎస్సీలు నివసించే ప్రాంతాల సామాజిక అభివృద్ధికోసం ఆయా ప్రాంతాలను సందర్శించి సమగ్ర పరిశీలన జరిపి నివేదికలు రూపొందించాలని తెలిపారు. రోడ్లు, రక్షిత మంచినీటి పథకాలు, ఇళ్ల నిర్మాణం తదితర వౌళికవసతులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. అదేవిధంగా అంతర్గత, లింకు రోడ్లు, విద్యుత్ సౌకర్యాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న సంక్షేమ వసతిగృహాల నిర్వహణపై అధికారులు ప్రత్యేకశ్రద్ద చూపాలని, తరచుగా వసతిగృహాలను తనిఖీ చేస్తు అక్కడి విద్యార్థులకు మెను సక్రమంగా అందించడం, వసతిగృహాలలోని సమస్యలను పరిశీలించాలని చెప్పారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ హరిప్రసాద్, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ రాజు, జిల్లా ముఖ్యప్రణాళిక అధికారి విజయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీని
అణగదొక్కేందుకు కుట్ర
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, డిసెంబర్ 19: కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా అణగదొక్కేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కుట్రలు చేస్తున్నారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు యడ్ల ఆదిరాజు ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక వ్యవహారంలో తమిళనాడుకు చెందిన సుబ్రహ్మణ్యస్వామి కోర్టులో కేసు వేయటం వెనక ప్రధానమంత్రి ప్రమేయం ఉందని ఆరోపించారు. పిసిసి పిలుపు మేరకు శనివారం గంటస్థంభం వద్ద జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిరాజు మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ పత్రిక వ్యవహారంలో సోనియాగాంధీ కుటుంబంపై అప్రజాస్వామ్య వైఖరితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సుబ్రహ్మణ్య స్వామిని అడ్డుపెట్టుకుని సోనియా, రాహుల్‌గాంధీలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక లాభాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం ఏర్పాటుచేసింది కాదని, దేశ ప్రజల ఆకాంక్షకు ప్రతీక అని చెప్పారు. కేంద్రప్రభుత్వం విధానాలతో బిజెపిపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను, కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆదరణను గమనించి కేంద్రప్రభుత్వం తప్పుడు ఆలోచనతో వ్యవహరిస్తోందని విమర్శించారు. బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని అన్నారు. దేశం కోసం నాటి ప్రధానమంత్రుల నెహ్రు, ఇందిరాగాంది, రాజీవ్ గాంధీ తమ ప్రాణాలను అర్పించారని, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ శ్రమిస్తున్నారని అన్నారు. సోనియా కుటుంబంపై కక్ష సాధింపు చర్యలు మానకుంటే కేంద్ర ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు భానుమూర్తి గోవిందరావు, జగన్మోహన్‌రావు, అప్పారావు, జగ్గారావుయాదవ్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.