విజయనగరం

జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఐదుగురు ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, డిసెంబర్ 19: జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఐదుగురు క్రీడాకారులు వెళుతున్నారని లయన్స్ జిల్లా ఫాస్టు గవర్నర్ డాక్టర్ బి ఎస్ ఆర్ మూర్తి తెలిపారు. శనివారం స్థానిక ఆదిశేషుమూర్తి గ్రంథాలయంలో సీనియర్ వెయిట్ లిఫ్టర్స్‌ను సన్మానం చేయడంతో పాటు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన ట్రాక్‌సూట్స్ అందజేసారు. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో డాక్టర్ మూర్తి మాట్లాడుతూ క్రీడాకారులు ఆటలతో పాటు చదువులోను రాణిస్తే ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు అని చెప్పారు. జాతీయ స్థాయి పోటీల్లోను జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ నెల 24 నుండి 29 వరకు పంజాబ్‌లోని పాటియాలో జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు బి ఉష, వెంకటలక్ష్మి, కె గౌరినాయుడు, ఎన్ శ్రీను, ఎం రామకృష్ణలు వెళుతున్నారని చెప్పారు. ఈసందర్భంగా జిల్లా వెయిట్ లిఫ్టింగ్ కోచ్‌లు చల్లారాము, అట్టాడ లక్ష్మునాయుడులను అభినందించారు. కోడి శ్రీరామమూర్తి శిష్యుడు పెద్దింటి లక్ష్మినారాయణతోపాటు వెయిట్ లిఫ్టర్స్‌లో జాతీయ స్థాయిలో పేరు సంపాదించిన సీనియర్ క్రీడాకారులు పతివాడ వెంకటప్పడు, ఎం సూరప్పాడలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ బెల్లాన నాగనరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
రాష్టస్థ్రాయి పోటీలలో విద్యార్థుల ప్రతిభ
గరివిడి, డిసెంబర్ 19: రాజీవ్‌గాంధీ ఖేల్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కర్నూల్‌లో జరిగిన రాష్టస్థ్రాయి గ్రామీణ క్రీడాపోటీలకు స్థానిక కొండపాలెం ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థి రోహిత్‌కుమారి సింగ్ ఎంపిక అయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. ఈనెల 22నుంచి జరగనున్న క్రీడాపోటీల్లో పాల్గొంటారని చెప్పారు. ఇటీవల ప్రకాశం జిల్లా సింగరాయి కొండలో జరిగిన అండర్ -17 స్కూల్ గేమ్స్ బాలికల విభాగం వాలీబాల్ పోటీల్లో ఇదే పాఠశాలకు చెందిన విద్యార్థి రామలక్ష్మి నెల్లూరు జిల్లాలో జరిగిన సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో రవి పాల్గొని ప్రతిభ చూపారని చెప్పారు. ఈసందర్భంగా విద్యార్థులను అభినందించారు.
క్రిస్మస్‌కు చంద్రన్న సరకులు
నెల్లిమర్ల, డిసెంబర్ 19: ఈనెల 25న క్రిస్మస్ పురస్కరించుకుని వినియోగదారులకు చంద్రన్న సరుకులను అందిస్తామని ఎంపిపి సువ్వాడ వనజాక్షి చెప్పారు. శనివారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ గత ఏడాదిలాగే ఈ ఏడాదికూడా రేషన్ కార్డులకు ఉచితంగా సరుకులు అందించాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు యోచించారని చెప్పారు. రేషన్ కార్డులేని లభ్ధిదారులకు సంక్రాంతి సందర్భంగా కొత్త రేషన్ కార్డులు అందిస్తామని తెలిపారు. దీనికి సంబంధిత లభ్ధిదారుల వివరాలు ఆన్‌లైన్ చేసారని చెప్పారు. పింఛన్ కమిటీ సభ్యులు, వి ఆర్ ఓ, డీలర్ అర్హులను గుర్తించి తహశీల్దార్ కార్యాలయానికి పంపిస్తే తుది జాబితా తయారు చేసి కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేస్తారని చెప్పారు. ప్రజాసమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి జనవరిలో జన్మభూమి కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.
ప్రజలకు, పోలీసులకు మధ్య అంతరం తగ్గాలి: డిఎస్పీ
కొత్తవలస, డిసెంబర్ 19: ప్రజలకు, పోలీసులకు మధ్య అంతరం తగ్గాలని భయం వీడి పోలీసులకు ప్రజలు నిర్భయంగా సమస్యలు చెపుకోవచ్చునని విజయనగరం డి ఎస్పీ ఎవి రమణ అన్నారు. శనివారం మండలంలోని చింతలదిమ్మగా గ్రామంలో ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో నెలకు రెండు గ్రామాల్లో ప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాట్లు చెప్పారు. చట్టవిరుద్ధ వ్యాపారాలు వద్దని శాంతి భద్రతలు ముఖ్యమని చెప్పారు. సంఘ వ్యతిరేకచర్యలు సహించబోమని చెప్పారు. సి ఐ సంజీవరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవించాలని చెప్పారు. హెల్మెట్ లేనివారు సుమారు 40శాతం మంది యువకులు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని చెప్పారు. వాహనాల రిజిస్ట్రేషన్, హెల్మెట్ లు తప్పని సరిగా వాహనదారుడుకి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు అప్పలనాయుడు, నీలకంఠం, హెచ్ సి తిరుపతిరావు, స్థానిక నేతలు భూమిరెడ్డి వరలక్ష్మి, మాధవరావు, సత్యంలు పాల్గొన్నారు.
సాధుమఠం ఆస్తులను పరిరక్షించాలి
విజయనగరం (పూల్‌బాగ్), డిసెంబర్ 19: ల డెంకాడ మండలంలోని అక్కివరంలోని సత్యానంద ఆశ్రమం, విశాఖలోని జి ఆర్ సాధుమఠానికి సంబంధించిన ఆస్తులను రక్షించాలని సాధుమఠ పీఠాధిపతి స్వామి పూర్ణానంద సరస్వతి ప్రభుత్వాన్ని కోరారు. పట్టణంలోని అంబటిసత్రం జంక్షన్‌లోని ప్రెస్‌క్లబ్‌లో శనివారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కొంతమంది అక్కివరం భూములను అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని , ఆప్రయత్నాలను వెంటనే విరమింపచేసేలా ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వారు అమ్మడానికి ప్రయత్నిస్తున్న భూములు సాధుమఠానికి చెందినవని చెప్పారు. అధికారులు తక్షణం స్పందించి మఠం ఆస్తులను రక్షించాలని కోరారు. ఈసమావేశంలో స్వామి సమతానంద, స్వామి సదానందభారతి, స్వామి సిద్ధేశ్వరానంద భారతి పాల్గొన్నారు.
9న నవోదయ పరీక్ష
నెల్లిమర్ల, డిసెంబర్ 19: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జనవరి తొమ్మిదవ తేదీన నవోదయ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని ఎం ఇ ఓ కృష్ణారావు తెలిపారు. శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ కేంద్రంలో మండలంలో 393 మంది విద్యార్థులు నవోదయ పరీక్షలు రాస్తారని తెలిపారు. ఆదివారం ఎం ఇ ఓ కార్యాలయంలో మద్యాహ్న భోజన నిర్వహకులకు పరిశుభ్రతపై అవగాహన సదస్సు నిర్వహిస్తామని తెలిపారు.
వీడియో క్లిప్పింగ్‌ల ద్వారా నిర్వహకులకు అవగాహన పరుస్తామని చెప్పారు. పరిసరాల పరిశుభ్రత, వంటలు పరిశుభ్రంగా ఉండడం తదితర అంశాలపై అవగాహన పరుస్తామని తెలిపారు.
కిటకిటలాడిన విష్ణు ఆలయాలు
విజయనగరం(పూల్‌బాగ్), డిసెంబర్ 19: పట్టణంలోని విష్ణు ఆలయాలు ధనుర్మాసం సందర్భంగా శనివారం భక్తులతో కిటకిటలాడాయి.వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో ధనుర్మాస పూజలు నిర్వహించారు. రింగ్‌రోడ్డులో ఉన్న కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి విశేషపూజలు నిర్వహించారు. వేకువజామున నాలుగవ పాశురాన్ని చదివి పూజాకార్యక్రమాలను ఆరంభించారు. స్వామి వారికి విశేష అభిషేకం అర్చనలు జరిపారు. స్వామివారిని పలురకాల పుష్పాలతో అలంకరించారు. శనివారం కావడంతో స్వామి దర్శనార్ధం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. మహిళలు తులసిచెట్ల వద్ద దీపాలను వెలిగించారు. ఆలయ అర్చకులు పీసపాటి సంపత్కుమార్ మాట్లాడుతూ ధనుర్మాసం విష్ణుదేవునకు అత్యంత ప్రీతికరమైనదని అన్నారు. వర్షాలు సక్రమంగా కురిసి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ 4వ పాశురాన్ని స్వామి సన్నిధిలో పఠించామని చెప్పారు. అర్చకులు శ్రీమన్నారాయణ అభిషేక, పూజలు నిర్వహించారు.