విజయనగరం

ఆకట్టుకున్న అగ్నిమాపక విన్యాసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీపురుపల్లి, ఏప్రిల్ 15: చీపురుపల్లి అగ్నిమాపక దళం ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ వారోత్సవాలలో భాగంగా శుక్రవారం స్థానిక మూడు రోడ్లు జంక్షన్ వద్ద అగ్నిమాపక గల వాహనంతో వివిధ విన్యాసాలను ప్రదర్శించారు. అగ్ని ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. ప్రమాదాలు సంభవించిన అనంతరం ఏవిధంగా నివారణ చర్యలు చేపట్టాలో అగ్నిమాపక శకటం ద్వారా విన్యాసాలు చేసి చూపించారు. ఫైర్‌స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎస్సై సింహాచలం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.