విజయనగరం

అర్హులందరికీ పక్కాగృహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దత్తిరాజేరు, ఏప్రిల్ 15:గ్రామాలలో అర్హులైన నిరుపేదలకు ఎన్టీఆర్ గృహ సముదాయం కింద పక్కాగృహాలు మంజూరుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు అన్నారు. శుక్రవారం మండలంలోని దత్తి గ్రామంలో ఎన్టీ ఆర్ గృహ సముదాయం కింద 49 గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేసారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి అధ్యక్షుడు ఆర్.కృష్ణార్జున అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో ఆరు లక్షల పక్కా గృహాలు నిర్మించడానికి చర్యలు ప్రారంభించారని తెలిపారు. ఒక్కో గృహాన్ని 2.90రూపాయల వ్యయంతో నిర్మించి లబ్ధిదారునుకి నూతన నివాసంలో నిర్మించి ఇస్తున్నారని అన్నారు. బిసిలకు లక్ష రూపాయలు, ఎస్సీలకు లక్షన్నర రూపాయల రాయితీపై ఇళ్లు నిర్మిస్తారని చెప్పారు. అలాగే సాగునీటి వనరుల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపిపి రాజేశ్వరి, జడ్పీటిసి అప్పయ్యమ్మ, ఎంపిడిఓ ప్రకాశరావు, తహశీల్దార్ జనార్థన, సర్పంచ్ హేమంతరావు కార్యకర్తలు పాల్గొన్నారు.