విజయనగరం

ఆహ్లాదమా...ఏదీ నీ చిరునామా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), ఏప్రిల్ 15: పట్టణంలో పార్కులు ఉనికిని కోల్పోతున్నాయి. దశాబ్ధాల తరబడి చరిత్ర కలిగిన పార్కులు కూడా మున్సిపల్ యంత్రాంగం నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఒకవైపు అధికారులు..మరోవైపుప్రజల ఆదరణ లేక వెలవెలబోతున్నాయి. జిల్లా కేంద్రంలో సరైన పార్కులు లేకపోవడం వల్ల ఆహ్లాదం కోసం పట్టణ ప్రజలు విశాఖ వెళుతున్నారు. పార్కుల నిర్వహణ కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని మున్సిపల్ పాలకులు, అధికారులు చెబుతున్నా, పార్కుల అభివృద్ధి ఎక్కడా జరగడం లేదు. రెండేళ్ల క్రితం హుదూద్ తుఫాన్ సృష్టించిన బీభత్సానికి వృక్షసంపద నేలమట్టం కావడంతో పార్కులన్నీ కళావిహీనంగా తయారయ్యాయి. నీరు-చెట్టు కార్యక్రమం కింద పెద్దఎత్తున మొక్కలు పెంపకం చేపడతామని అధికారులు చేసిన ప్రకటనలు గాలిలో కలిసిపోయాయి. ప్రస్తుతం పట్టణంలో అన్ని పార్కులు చాలా దయనీయంగా ఉన్నాయి. కొన్ని పార్కులు ఆక్రమణకు గురవుతున్నాయి. పట్టణంలో 49.62 ఎకరాల విస్తీర్ణంలో 103 పార్కులు ఉన్నాయి. ఇందులో 95 పార్కులకు కంచె నిర్మాణం చేపట్టలేదు. మిగతా పార్కులలో దేవాలయాలు, పాఠశాలలను నిర్మించడం వల్ల కంచె నిర్మాణం చేపట్టారు. కాలనీలలో ఉన్న పార్కులలో అర ఎకరానికి పైబడి ఆక్రమణకు గురయ్యాయి. వీటిని తొలగించే ప్రయత్నాలు చేయకపోవడం వల్ల భవన నిర్మాణాలు చేపట్టేందుకు ఆక్రమణదారులు ఉపక్రమిస్తున్నారు. పట్టణంలో ప్రధానంగా మహాత్మాగాంధీ, నెహ్రూ, ప్రకాశం పార్కులు నిరక్ష్యానికి గురవుతున్నాయి. ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన ఈ పార్కుల అభివృద్ధిపై మున్సిపల్ యంత్రాంగం శీతకన్ను వేయడంతో కళావిహీనంగా తయారయ్యాయి. ఒకప్పుడు వృద్ధులు, పిల్లలతో కళకళలాడిన ఈ పార్కులు నేడు వెలవెలబోతున్నాయి. మిగతా పార్కులలో కనీస సదుపాయాలు కూడా లేవు. క్రీడా పరికరాలు లేకపోవడం వల్ల విద్యార్థులకు సైతం ఆహ్లాదం కరువైంది. అన్ని పార్కులలో ప్రహారీ గోడల నిర్మాణం చేపట్టకపోవడం వల్ల పశువుల మేతకు బాగా ఉపయోగపడుతున్నాయి. దీనికితోడు చాలామంది పశువులు యజమానులు ఈ పార్కులను పశువుల కొట్టాలుగా వినియోగిస్తున్నారు.
పార్కుల అభివృద్ధికి చర్యలు
పట్టణంలో పార్కుల అభివృద్ధికి పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు తెలిపారు. పార్కుల చుట్టూ కంచె నిర్మాణం చేపడతామని చెప్పారు. పార్కులలో అవసరమైన సదుపాయలు కల్పిస్తామని అన్నారు. ప్రజలకు ఉపయోగపడేవిధంగా తగిన చర్యలు చేపడతామని తెలిపారు.