విజయనగరం

వైసీపీ మోడల్ ఎంసెట్‌కు స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), ఏప్రిల్ 15: వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో నిర్వహించిన మోడల్ ఎంసెట్‌కు అనూహ్య స్పందన లభించింది. ఈసందర్భంగా విద్యార్థి విభాగం అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ మూడువేల మంది విద్యార్థులు మోడల్ ఎంసెట్‌కు హాజరయ్యారని తెలిపారు. ఎంసెట్‌పై అవగాహన పెంచేందుకు పార్టీ ఆదేశాల మేరకు పరీక్ష నిర్వహించామని చెప్పారు. ఫలితాలను ప్రశ్నాపత్రం కిందన పేర్కొన్న వెబ్‌సైట్‌లో ఉంచామని తెలిపారు. మొదటి మూడు స్థానాలలో నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అనిల్, ఫణిరాజు, వెంకటేష్,గుణ పాల్గొన్నారు.