విజయనగరం

కుదిరిన ముహూర్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మార్చి 26: మరో వారం రోజుల్లో జెంటిల్‌మెన్ ఒప్పందాలను అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని జామి, ఎస్‌కోట, కొమరాడ మండలాధ్యక్ష పదవుల కోసం గతంలో జెంటిల్‌మెన్ ఒప్పందాలను చేసుకున్న విషయం విధితమే. గడువు పూర్తి కావడంతో జెంటిల్‌మెన్ ఒప్పందాలను అమలు చేయాలని అధికార పార్టీ నేతలపై ఆయా వర్గాలు వత్తిడి తెస్తున్నారు. అయితే జిల్లాలో ఇరువర్గాల నుంచి వత్తిడి పెరగడంతో ఏం చేయాలో పాలుపోక అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై అధిష్టానం కూడా జెంటిల్‌మెన్ ఒప్పందాలను అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇటీవల అమరావతిలో నిర్వహించిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా అదే అభిప్రాయాన్ని వెల్లడించారు. జెంటిల్‌మెన్ ఒప్పందాలను వెంటనే అమలు చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు మరో పది రోజుల్లోగా ప్రస్తుతం పదవిలో ఉన్నవారితో రాజీనామాలు చేయించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ మేరకు వచ్చే నెల 3న ఇన్‌ఛార్జి మంత్రి పల్లె రఘునాధరెడ్డి సమక్షంలో పంచాయతీ నిర్వహించనున్నట్టు సమాచారం.
కాగా, మూడు మండలాల్లో మూడు రకాల భిన్నమైన ఒప్పందాలు చోటుచేసుకున్నాయి. ఎస్.కోట మండలాన్ని తీసుకుంటే అక్కడ రెడ్డి వెంకన్న, రాయవరపు చంద్రశేఖర్‌ల మధ్య ఒప్పందం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఎన్నికల ఖర్చు మూడు రెట్లు భరించేవారికి మొదటి ఛాన్స్, రెండు రెట్లు ఖర్చు బెట్టిన వారికి రెండో దఫా ఎంపిపి పదవి కట్టబెట్టాలని పెద్దలు నిర్ణయించారు. ఆ మేరకు తొలి విడత ఛాన్స్ రెడ్డి వెంకన్నకు లభించింది. ఆ తరువాత రెండున్నరేళ్ల తరువాత ఇపుడు తనకు అవకాశం కల్పించాలని రాయవరపు చంద్రశేఖర్ పట్టుబట్టాడు. దీంతో ఈ జెంటిల్‌మెన్ ఒప్పందం అమలు చేయాల్సి వచ్చింది.
ఇక జామి మండలాన్ని పరిశీలిస్తే.. అక్కడ జెడ్పీటీసీలు పి.అప్పాయమ్మ, ఇప్పాక చంద్రకళలు ఇరువురు ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పాయమ్మ ఎంపిపిగా బాధ్యతలు చేపట్టి రెండున్నరేళ్లు పూర్తి కావడంతో ఇపుడు చంద్రకళకు ఆ పీఠం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. జామి ఎంపిపి స్థానాన్ని ఎస్సీలకు కేటాయించడంతో ఇరువురు కూడా ఎంపిపి పదవికి పోటీపడ్డారు. దీంతో అప్పట్లో జెంటిల్‌మెన్ ఒప్పందం కుదుర్చుకోవాల్సి వచ్చింది.
ఇక కొమరాడ మండలంలో భిన్నమైన పరిస్థితి ఉండేది. కొమరాడ మండలంలో నందిరెడ్డి ప్రియాంక, దొడ్డి కుమారిల మధ్య ఒప్పందం కుదిరింది. అప్పట్లో 8 మంది ఎంపిటీసీలు టిడిపి, 7గురు వైకాపా ఎంపిటిసీలు కావడంతో అప్పట్లో వీరిద్దరి మధ్య ఎంపిపి పదవికి ఒప్పందం కుదుర్చుకున్నారు. చెరి సగం కాలం ఎంపిపి పీఠం అధిరోహించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఎంపిటిసిలకు అయ్యే ఎన్నికల ఖర్చును కూడా ప్రియాంక 60 శాతం, దొడ్డి కుమారి 40 శాతం భరించారు. ఆ ఒప్పందాన్ని అమలు చేయాలని పట్టుబడుతున్నారు.