విజయనగరం

అభివృద్ధి దిశగా ఎయు విజయనగరం ప్రాంగణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), మే 1: ఆంధ్ర విశ్వవిద్యాలయం విజయనగరం ప్రాంగణం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని ఎయు ఉపకులపతి ప్రొఫెసర్ నాగేశ్వరరావు అన్నారు. ప్రాంగణంలో విద్యార్థులకు అవసరమైన వౌలిక వసతులు, ఇతర సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థానిక విశ్వవిద్యాలయం విజయనగరం ప్రాంగణాన్ని సోమవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠ్యాంశాల బోధన, బోధనేతర అంశాలు, పరీక్షలు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావుమాట్లాడుతూ అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని విద్యార్థులను అభివృద్ధి వైపు నడిపించాలని ఉద్భోదించారు. అదేవిధంగా ప్రాంగణం అభివృద్ధికి తక్షణం కావాల్సిన అవసరాలను ప్రత్యేక అధికారి ఆచార్య జి.యోహాన్‌బాబును అడిగి తెలుసుకున్నారు. నూతన కోర్సులు, వసతి గృహ భవనాలు, ప్రహారీ, లైబ్రరీ పుస్తకాలు, కంప్యూటర్ ల్యాబ్ తదితర వాటిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఐసిఎస్‌ఎస్‌ఆర్ జాతీయ సదస్సులో ఉత్తమ ప్రతిభ కనబర్చి ఇన్‌స్పా ఆంధ్ర రాష్ట్ర కన్వీనర్‌గా ఎంపికైన డాక్టర్ ఎన్‌విఎస్ సూర్యనారాయణను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంబిఎ విభాగాధిపతి డాక్టర్ పొదిలాపుహనుమంతరావు, ఎంఇడి హెడ్ డాక్టర్ మిరియాల సాల్మన్‌రాజు, రాజనీతిశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ శీర హేమలత, డాక్టర్ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.