విజయనగరం

మీకోసం గ్రీవెన్స్‌లో సమస్యలపై వినతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), మే 1: ప్రతి సోమవారం కలెక్టరు కార్యాలయంలో నిర్వహించే మీకోసం గ్రీవెన్స్‌కు పలు సమస్యలపై అర్జీలు అందాయి. ఎజెసి నాగేశ్వరరావు, డి ఆర్ ఒ జితేంద్రలు వినతులు స్వీకరించారు. వ్యాయామ ఉపాధ్యాయులకు పదోన్నతులకు చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు సంఘం నాయకులు యుటి ఎఫ్ జిల్లా కార్యదర్శి శేషగిరి ఆధ్వర్యంలో మీకోసంలో వినతిపత్రం అందచేసారు. వ్యాయామ ఉపాధ్యాయులు పదోన్నతులకు ఎటువం ఆటంకాలు లేవని, 63 పోస్టులను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసారని, ఈనేపథ్యంలో 44 మందికి పదోన్నతులు లభించే అవకాశాలు ఉన్నాయని తగు చర్యలుతీసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో సంఘం నాయకులు తిరుపతిరావు,రామారావు తదితరులు పాల్గొన్నారు. బలిజపేట మండలం చిలకలపల్లికి చెందిన రైతు సంకు వెంటకనాయుడు తనకు రైతు రుణమాఫీ అమలు చేయలేదని, 85 వేల రూపాయులు బ్యాంకులో అప్పు ఉందని రుణమాఫీకి చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందచేసారు. మక్కువ మండలం కొయ్యానపేట గ్రామంలో ఫీల్డు అసిస్టెంట్ చేస్తున్న అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామ మాజీ ఉపసర్పంచ్ గవర ధర్మరాజు, జన్మభూమి కమిటీ సభ్యులు కోట్ల సత్యం ఫిర్యాదు చేసారు. పలు వ్యక్తిగత సామాజిక సమస్యలు మీకోసం గ్రీవెన్స్‌లో అందాయి.

టిఎన్‌టియుసి ఆధ్వర్యంలో మేడే వేడుకలు

విజయనగరం(టౌన్), మే 1: ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని టిడిపి అనుబంధ కార్మిక సంఘం టి ఎన్‌టియుసి ఆధ్వర్యంలో పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రేడ్ యూనియన్ పతాకాన్ని టిడిపి కార్మిక సంఘం నాయకులు ఐవిపి రాజు, వంక నర్సింహమూర్తి ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఐవిపిరాజు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలు సంక్షేమ చర్యలు చేపట్టారని తెలిపారు. చంద్రన్న భీమా అమలు చేసారని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.