విజయనగరం

కార్మికుల హక్కుల రక్షణకు కదం తొక్కాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, మే 1: కార్మికుల హక్కుల పరిరక్షణకు పెద్ద ఎత్తున ఉద్యమించాలని సిపిఐ అనుబంధ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్తి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. సోమవారం గజపతినగరంలో 131వ మే డే వేడుకలను సిపిఐ, సిపిఎం నాయకులు ఘనంగా నిర్వహించారు. గజపతినగరం నాలుగు రోడ్లు జంక్షన్‌లో గల ఎఐటియుసి పతాకాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్తి అప్పలనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి ఆల్తి మాట్లాడుతూ ప్రపంచంలో కార్మికులు గతంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసినందునే 18గంటల పనిని 8గంటలకు తగ్గించడం జరిగిందని అన్నారు. అదే విధంగా కార్మికుల పరిరక్షణకు ప్రత్యేకమైన చట్టాలు చేశారని అన్నారు. దేశంలో ప్రధాని నరేంద్రమోడీ కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ప్రత్యేక చట్టాలు తెచ్చి పెట్టుబడుదారులకు అనుకూలంగా చట్టాలు చేస్తున్నారని ఆరోపించారు. కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమానికి సన్నద్ధం కావాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడుదారుల ప్రయోజనాల కోసమే అహర్నిశలు శ్రమిస్తున్నారని,కార్మికుల ప్రయోజనాలకు కృషి చేయడంలేదని అన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చంద్రన్న భీమా పథకానికి భవన నిర్మాణ సంక్షేమ నిధులు నుండి 234 కోట్లు నిధులు మళ్లించారని ఆరోపించారు. చంద్రన్నబీమాకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు గేదెల రామునాయుడు, బి.శ్రీనివాసరావు, కొంకిరామారావు తదితరులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా సిఐటియు ఆధ్వర్యంలో బిల్డింగ్ వర్కర్స్, ఆటోకార్మికులు, పంచాయతీ కార్మికులు పెద్ద సంఖ్యలో చేరుకుని పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జాతీయ రహదారి పక్కనే గల సిఐటియు పతాకాన్ని డివిజన్ కార్యదర్శి పురం అప్పారావు ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు సంఘటితంగా ఉండడం ద్వారానే సమస్యను పరిష్కరించుకోవచ్చునని అన్నారు. సమస్యల పరిష్కారానికి ఏకైక మార్గం పోరాటమేనని చెప్పారు. కార్యక్రమంలో సిఐటియు నాయుకులు అప్పలాచారి, కర్రి అప్పలరాజు, గోవిందరావుతదితరులు పాల్గొన్నారు.

పిడుగుపాటుకు మహిళ మృతి

గజపతినగరం, మే 1: ఇక్కడికి సమీపంలోని గుర్ల-తమ్మిరాజుపేట గ్రామం పరిధిలో సోమవారం సాయంత్రం పిడుగుపాటుకు మహిళ మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మెంటాడ మండలం జి.టి.పేట గ్రామానికి చెందిన సిరిపురపు తిరుపతమ్మ పొలంలో పనులుచేసుకుని తిరిగి ఇంటికి వస్తుండగాసమీపంలో పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మరో ముగ్గురు అస్వస్తతకు గురయ్యారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

తుపాను హెచ్చరికలపై అప్రమత్తం కావాలి

- డిఆర్వో జితేంద్ర

విజయనగరం, మే 1: తుపాను హెచ్చరికలు వచ్చిన వెంటనే అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి జితేంద్ర ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయన తుపాను మిటిగేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుపాను సంభవించినపుడు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అందుకు ముందుగా తీరప్రాంత గ్రామాల్లో పర్యటించి తుపాను షెల్టర్లను పరిశీలించాలన్నారు. సమస్యాత్మక చెరువులను గుర్తించి ఆ చెరువులను ఆనుకొని ఉన్న గ్రామాల్లో రైలు, రహదారుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. చెరువుకు గండ్లు పడకుండా ముందుగా చిన్న చిన్న మరమ్మతులు చేపట్టాలన్నారు. దాంతోపాటు ఇసుక బస్తాలు, ఇతర సామాగ్రిని సిద్ధం చేయాలని చిన్నతరహా నీటిపారుదల అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా పడిపోయే స్థితిలో ఉన్న చెట్లను, దెబ్బతినే అవకాశం ఉన్న రహదారులను గుర్తించాలన్నారు. జెసిబి యంత్రాల ఫోను నంబర్లను సిద్ధంగా ఉంచాలన్నారు. ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్, స్కౌట్స్, గైడ్స్ విద్యార్థుల ఫోన్ నంబర్ల జాబితాను కూడా సిద్ధం చేసుకోవాలన్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా తాగునీటి ప్రాజెక్టులకు ముందస్తుగా మరమ్మతులు చేయించాలన్నారు. నీటిని తరలించేందుకు అవసరమయ్యే జనరేటర్లను సిద్ధం చేసుకోవాలన్నారు. గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని, దాంతోపాటు బోట్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో సైక్లోన్ మిటిగేషన్ సమావేశాలు నిర్వహించి ఆ సమస్యలను జిల్లా స్థాయిలో చర్చించాలన్నారు. అత్యవసర మందులు, ఆహార పదార్థాలను సిద్ధం చేసుకోవాలని డిఎంహెచ్‌ఒ, పౌరసరఫరాలశాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.