విజయనగరం

ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (కంటోనె్మంట్), డిసెంబర్ 19: జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు సరిపడక రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అదేవిధంగా కొనుగోలు కేంద్రాల వద్ద విఆర్‌ఓ లేదా ఇతర అధికారుల ధృవీకరణ ప్రకారం రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేసారు. ఎల్‌బిజి భవనంలో శనివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 23, 24 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. నిరసన కార్యక్రమాల్లో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.గత ఏడాది 136 కొనుగోలు కేంద్రాల ద్వారా 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారని, అయితే ఈ ఏడాది 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగే అవకాశం ఉన్నందున అదనంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. విఆర్‌ఓలు ధ్రువీకరించిన రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని నిబంధన పెట్టడం వలన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. విఆర్‌ఓల కొరత కారణంగా ఆయా కేంద్రాల వద్ద విఆర్‌ఓలు లేక రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు జరగడంలేదని ఆందోళన వ్యక్తం చేసారు. అదేవిధంగా రైతులు ఎకరాకు 60 గోనె సంచులు అందజేస్తున్నారని, అవికూడా చిరిగిన గోనె సంచులను అందజేస్తునారని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తేమ యంత్రాల్లేక కొనుగోలు నిలిచిపోతుందని, దీంతో రైతులు తమ ధాన్యాన్ని కళ్ళాల్లో నిల్వచేసుకుని రాత్రింబవళ్లు కాపలా కాచుకునే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేసారు.
చాలా మంది రైతుల వద్ద పట్టాదారుల పాసుపుస్తకాల్లేక సాధారణ రైతులు, కౌలు రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్మకుండా దళారులను ఆశ్రయించి నష్టపోతున్నందున ధాన్యం కొనుగోలులో కొన్ని నిబంధనలను సవరించి ప్రతి రైతు వద్ద నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఈ సమావేశంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు బుద్ధరాజు రాంబాబు, సిపిఎం డివిజన్ కార్యదర్శి రెడ్డి శంకర్రావు పాల్గొన్నారు.