విజయనగరం

మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి(రూరల్), జూన్ 5: ప్రతీ ఒక్కరూ మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడాలని రాష్ట్ర గనులశాఖామంత్రి సుజయ్‌కృష్ణరంగారావు కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సోమవారం పట్టణంలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే కాలుష్యం బారినపడి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఖాళీ స్థలాల్లోనూ, పాఠశాల ఆవరణలు, ప్రభుత్వ కార్యాలయ ఆవరణలో, ఇళ్లముందు ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. అవసరమైన వారికి ప్రభుత్వం ఉచితంగా మొక్కలను పంపిణీ చేస్తుందన్నారు. మొక్కలను నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలను సంబంధిత వ్యక్తులు తీసుకోవాలన్నారు. రోడ్లుకు ఇరువైపులా, చెరువు గట్లుపైన ఉపాధి హామీపథకంలో మొక్కలు నాటుతున్నారన్నారు. సామాజిక అటవీ విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాలకు మొక్కలను ఉచితంగా అందిస్తుందన్నారు. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. స్వచ్ఛ్భారత్‌ను చేపట్టాలన్నారు. చెత్తాచెదారాలను ఎక్కడా వేయకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ అచ్యుతవల్లి, ఉపాధ్యక్షుడు సిహెచ్. రమేష్‌నాయుడు, కమిషనర్ శంకరరావు కౌన్సిల్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

‘పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి’
విజయనగరం (్ఫర్టు), జూన్ 5: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎలయన్స్‌క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ -105 ఆధ్వర్యంలో సోమవారం గురజాడ పాఠశాలలో జరిగిన సదస్సులో ఆయన మొక్కల సంరక్షణపై ప్రతిజ్ఞ చేశారు. అనంతరం బాబ్జీ మాట్లాడుతూ ఈ ఏడాది ‘ప్రకృతితో మనిషి అనుసంధానం’ అనే అంశాన్ని తీసుకున్నారని, ప్రతి ఒక్కరూ మొక్కలను నాడటం, వాటిని సంరక్షించడం చేయాలని కోరారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎంవిఆర్ కృష్ణాజీ మాట్లాడుతూ మానవ తప్పిదాల వల్ల పంచభూతాలు కాలుష్యానికి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలయన్స్‌క్లబ్ వైస్ గవర్నర్ గురుప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తెలుగునాడు డెవలప్‌మెంట్ ఫోరం అధ్యక్షురాలు విమలారాణి, మహిళా క్లబ్ అధ్యక్షురాలు ఎం.సుభద్రాదేవి పాల్గొన్నారు.