విజయనగరం

భద్రతా చర్యలు పాటిస్తే బాణసంచాకు అనుమతి: ఎస్పీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీపురుపల్లి, ఫిబ్రవరి 18:శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి యాత్ర సందర్భంగా కాల్చే బాణాసంచాకు కమిటీ నిర్వాహకులు అన్ని భద్రతా చర్యలు తీసుకుంటేనే అనుమతి ఇస్తామని జిల్లా ఎస్పీ జి పాలరాజు స్పష్టంచేశారు. యాత్ర మహోత్సవాన్ని పరిశీలించేందుకు ఆయన ఆదివారం చీపురుపల్లి వచ్చారు. బాణసంచా కాల్చేందుకు నిర్ధేశించిన స్థలాన్ని ఆయన డి ఎస్పీ సౌమ్యలత, ఇతర సిబ్బందితో పరిశీలించారు. అనంతరం అమ్మవారిని దర్శించి తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ యాత్ర సందర్భంగా కాల్చే బాణసంచాతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, అలాని యాత్రలో సందర్శకులు ఆనందాన్ని ఆపలేమన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎటువంటి ప్రమదాలు జరగకుండా ముందస్తుచర్యలు చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు.