విజయనగరం

ఇలాగేనా ... కార్యాలయ నిర్వహణా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, జూలై 3: గజపతినగరం తహశీల్ధార్ కార్యాలయ నిర్వహణ పట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ హరిజవహర్‌లాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయానికి అడుగు పెట్టగానే కలెక్టర్ అపరిశుభ్రత పరిసరాలు, విరిగిన కుర్చీలు, టేబుల్స్ దర్శనం మివ్వడంతో కోపోద్రేకులయ్యారు. కార్యాలయ నిర్వహణ ఇలాగేనా! అంటూ తహశీల్ధార్ శేషగిరిరావుపై మండిపడ్డారు. మంగళవారం కలెక్టర్ హరి జవహర్‌లాల్ గజపతినగరంలోని పలు కార్యాలయాలను తనిఖీ చేశారు. కలెక్టర్ వస్తారని అధికారులంతా శాఖాపరమైన వివరాలతో సిద్ధంకాగా కలెక్టర్ కాస్తా వేరే అంశాలపై తొలుత దృష్టి సారించడంతో అధికారులు ఖంగుతిన్నారు. తహశీల్ధార్ కార్యాలయంలోకి రాగానే ప్రహరీ గోడలపై ప్రచార కరపత్రికలు అంటించి ఉండటంతోపాటు గోడనానుకొని పిచ్చి మొక్కలు ఉండటంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాగే కార్యాలయం వెనుక భాగాన కాలిన చెట్లును చూసి కోపోద్రేకులయ్యారు. అనంతరం కార్యాలయ సిబ్బంది ఛాంబర్‌లోకి ప్రవేశించిన కలెక్టర్‌కు విరిగిన కుర్చీలు, టేబుల్స్ మురికిపట్టిన టేబుల్స్ క్లాత్స్ దర్శనమివ్వడంతో ఇలాగేనా కార్యాలయ నిర్వహణ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఒక్క అధికారి కూర్చోడానికి సరైన సదుపాయాలు లేకపోతే విధులు సమర్ధవంతంగా ఎలా నిర్వహిస్తారంటూ మండిపడ్డారు. ఉద్యోగులు ఎక్కువ సమయం గడిపేది కార్యాలయాల్లోనేనని ఇక్కడ ఆహ్లాద, ఆరోగ్యకరమైన వాతావరణం ఎంతో అవసరమన్నారు. మరోమారు తనిఖీకి వస్తానని ఇదే పరిస్ధితి తలెత్తితే చర్యలు తప్పవన్నారు. ఆ తరువాత బయోమెట్రిక్‌హాజరు, రేషన్ సరుకులు సరఫరాపై నిశితంగా పరిశీలన చేపట్టారు. ఇంకా ఒక శాతం కూడా సరుకులు పంపిణీ చేయని ముగ్గురు రేషన్ డీలర్లుకు కలెక్టర్ ఫోన్ ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం తహశీల్ధార్ ఛాంబర్‌లో పలుశాఖల పనితీరును పరిశీలించారు. ఉపాధిహామీ, పౌర సరఫరాలు, భూ సమస్యలు, వ్యవసాయ శాఖ, వెలుగు శాఖల పనితీరును సమీక్షించారు. వ్యవసాయశాఖ అధికారులు ఇప్పటివరకు 36వేల క్వింటాళ్లు విత్తనాలు రైతులకు పంపిణీ చేశామని చెబుతుండగా ఆన్‌లైన్‌లో తొమ్మిదివేల క్వింటాళ్లు పంపిణీ జరిగినట్లు చూపిస్తోందన్నారు. మండలంలోని టి.కె.సీతారాంపురంలో4, బంగారమ్మపేటలో ఒకటి, భూదేవిపేటలో రెండు, ఆధార్ సీడింగ్ చేయాల్సి ఉందన్నారు. నకీలీ ఓటర్లు తొలగింపు జూలై 15వతేదీ లోగా పూర్తిచేయాలని సూచించారు. అలాగే మృతిచెందినవారి ఓటర్ల తొలగింపు త్వరితగతిన చేపట్టాలన్నారు. 17 శ్మశానవాటికల నిర్మాణాపనులు వేగవంతం చేయాలన్నారు. అనంతరం కార్యాలయాన్ని ఆనుకొని నిర్మాణంలో ఉన్న సబ్‌టెజరీ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ నెలాఖారునాటికి కార్యాలయాన్ని ప్రారంభించాలని ఎస్‌టివొ లక్ష్మణరావును ఫోను ద్వారా ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవొ కృష్ణవేణమ్మ, తహశీల్దార్ శేషగిరిరావు, డిపివొ సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రభుత్వ కళాశాలకు ఆర్థిక సహాయం అందజేత
గజపతినగరం, జూలై 3: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1977-79సంవత్సరంలో ఇంటర్మీడియట్ చదివిన పూర్వ విద్యార్థులు కళాశాల అభివృద్ధికోసం తమవంతు ఆర్థిక సాయంగా 25వేల రూపాయలు కళాశాల ప్రిన్సిపాల్ కె.వి.బి.విఠల్‌కు మంగళవారం అందజేశారు. ఈ బ్యాచ్‌లో చదివిని విద్యార్థులు ఎక్కడెక్కడో ఉన్నవారందరు ఇటీవల సమావేశం ఏర్పాటు చేసుకుని కళాశాల అభివృద్ధి కోసం తమవంతు బాధ్యతగా ఈ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇకముందు కూడా ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు అభివృద్ధి కోసం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

పురిటిపెంట పంచాయతీలో మురుగునీటి కాలువ వివాదం
గజపతినగరం, జూలై 3: మండలంలోని పురిటిపెంట గ్రామ పంచాయతీలో మురుగునీటి కాలువ ద్వారా పోయే మురుగునీటికి సంబంధించి వివాదం తలెత్తడంతో రెండు వర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. గ్రామంలోని బ్రాహ్మణవీధిలో నాలుగేళ్ళ కిందట మురుగునీటి కాలువను నిర్మించారు. ఈ కాలువలో ఇటీవల ఎదురుగా గృహనిర్మాణాల ఇంటిలోని వ్యర్థనీటిని విడిచిపెట్టడం వలన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పి కొంత మంది వ్యక్తులు మురుగునీటి కాలువను మట్టితో కప్పి వేశారు. దీంతో గ్రామంలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకున్నది. గ్రామ సర్పంచ్ మండల సురేష్, ఎంపీటీసీ గొర్లె ఆదినారాయణలు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. మురుగునీటి కాలువపై వేసిన మట్టిని తొలగించి యదావిధిగా కాలువ ద్వారా నీరు వెళ్ళే విధంగా చర్యలు తీసుకుంటామని మాజీ సర్పంచ్ గుమ్మా శ్రీనివాసరావు వర్గం అంగీకరించడంతో గ్రామస్తులు అంఘీకారం తెలిపారు.

పొగరహిత సమాజానికి ప్రజలు సహకరించాలి
బొండపల్లి,జూలై 3: పొగరహిత సమాజానికి ప్రజలు సహకరించాలని స్థానిక జడ్పీటీసీ బండారు బాలాజీ అన్నారు. మంగళవారం బొండపల్లి గ్రామంలో ఉజ్వల పథకం ద్వారా మంజూరైన ఉచిత గ్యాస్ కనెక్షన్లను జడ్పీటీసీ బాలాజీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలుష్యంలేని సమాజంగా తీర్చిదిద్దడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని, ఇందుకు ప్రజలు కూడా భాగస్వాములు కావాలని అన్నారు. అర్హులైన లబ్దిదారులు అందరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బిసి-ఎ లబ్దిదారులకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వర్రి సత్యవేణి, సిఎస్‌డిటి సత్యనారాయణమూర్తి, శ్రీనివాస గ్యాస్ ఏజెన్నీ నిర్వాహకులు బాబు తదితరులు పాల్గొన్నారు.

భూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి
గజపతినగరం, జూలై 3: భూమి సదస్సులు రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్ బి. శేషగిరిరావు కోరారు. మంగళవారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో భూమి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని అన్నారు. రెవెన్యూ రికార్డులు తమ వద్దకే తీసుకువస్తున్నందున ఏమైనా అభ్యంతరాలు ఉన్నా తమకు తెలియజేయాలని అన్నారు. తమ పరిధిలో పరిష్కారం జరగకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో సర్వేయర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

మాదక ద్రవ్యాలు వినియోగిస్తే కఠిన చర్యలు
కొత్తవలస, జూలై 3: మాదక ద్రవ్యాలు వినియోగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కొత్తవలస సిఐ రెడ్డిశ్రీనివాసరావు హెచ్చరించారు. మంగళవారం వి.బి.పురం వద్ద గల కోస్టల్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలకు బానిసలు అవుచున్నారని తెలిపారు. డ్రగ్స్ వినియోగించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామన అన్నారు. కేంద్ర ప్రభుత్వం డ్రగ్స్ వినియోగదారులపై కఠిన చట్టాలు రూపొందించిందని ఆయన విద్యార్థులకు వివరించారు. ముఖ్యంగా యువకులు మందుకు బానిసలు అగుచున్నారని పేర్కొన్నారు. ఖైనీ, గుట్కా, పాన్ మసాల వంటివి ఆరోగ్యానికి చాలా హానికరమని, వీటిని విక్రయించిన వారికి జైలు జీవితమేనని తెలిపారు. ప్రిన్సిపాల్ వి. ఆర్.కె.నర్సింహరాజు మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కావద్దని కోరారు. మంచి ఆలోచనలతో మంచి మార్గాన్ని ఎంచుకోవాలని అన్నారు. కార్యక్రమంలో కళాశాల విద్యార్థులతోపాటు సిబ్బంది వేణు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

విత్తనమో రామచంద్రా...
* విత్తనాలు లేక రోడ్డెక్కిన రైతన్నలు
కొత్తవలస, జూలై : మాది రైతు ప్రభుత్వమని చెప్పిన అధికార పార్టీ రైతులకు విత్తనాలు అందించడంలో విఫలమైంది. ముందస్తు ప్రణాళిక, అంచనాలు లేక అధికారులు విత్తనాలను రైతులకు అందజేయలేకపోయారు. ప్రభుత్వ విత్తన దుకాణాలు మూత పడ్డాయి.ప్రైవేటు డీలర్లు రైతులపై పడగ విప్పారు. వారికి నచ్చిన రీతిలో నచ్చిన ధరకు విత్తనాలు విక్రయిస్తున్నా వ్యవసాయశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. ప్రతి ఏడాది రైతు ఈ విధంగానే దగా పడుతున్నాడు. అయినా అధికారుల్లో చలనం లేదు. ఖరీఫ్‌కు ముందు జిల్లా స్థాయి అధికారుల నుండి కింద స్థాయి అధికారి వరకు ఒకటే ఊకదంపుడు. రైతులకు కావాల్సిన విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని,తీరా చూస్తే ఒక్క రైతుకు కూడా కావాల్సిన విత్తనాలు అందించలేని స్థితిలో వ్యవసాయశాఖ ఉంది. ఈ ఏడాది రైతుకు విత్తనరాయితీ బాగా రావడంతో విత్తనాలు తక్కువ ధరకే దొరుకుతాయనుకున్న రైతుకు అధికారుల నిర్లక్ష్యంతో ప్రైవేటు డీలర్లపంచనే చేరాల్సి వచ్చిందని, రైతన్న లబోదిబో మంటున్నాడు. కావాల్సిన రకం విత్తనాలు ఎలాగో లేవు. కనీసం రాయితీపై వచ్చిన విత్తనాలు కొందామంటే దొరకండం లేదు. ప్రభుత్వం రాయితీపై ఇచ్చిన విత్తనాలు ఏ రకం విత్తన బస్తా అయినా 600 రూపాయల లోపే ధర ఉంది. ప్రైవేటు డీలర్ల వద్ద కొనుగోలు చేద్దామంటే గంటకో రేటు ఉంటుంది. రకాన్ని బట్టి 850 రూపాయల నుండి 1100 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఇదెక్కడి న్యాయమని అధికారులను,ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ పోతున్నారు. తిండి పెట్టే రైతన్నకు ఇన్ని కష్టాలా అని విస్తుపోతున్నారు. జిల్లా స్థాయి అధికారులు స్పందించి సకాలంలో రైతులకు విత్తనాలు అందజే విధంగా చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.

రాజరాజేశ్వరి దేవికి ప్రత్యేక పూజలు
బొండపల్లి,జూలై 3: మండలంలోని దేవుపల్లి గ్రామంలో స్వయం భూగా వెలసిన రాజరాజేశ్వరిదేవి అమ్మవారికి మంగళవారం జేష్ఠ పంచమి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు దూసి శ్రీధర్ శర్మ అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ జరిపి విశేష కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవుపల్లి గ్రామానికి చెందిన కాపువీధి భక్తులు సుమారు 500మంది ఘటాలతో, ప్రభలతో భారీ ఊరేగింపు,మేళతాళాలతో అమ్మవారికి మొక్కులు తీర్చి పసుపు కుంకుమలు సమర్పించుకున్నారు. విశాఖపట్నం. తగరపువలస, విజయనగరం, ఏలూరు తదితర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారికి పూజలు నిర్వహించారు.

చంపావతి నది పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి
గజపతినగరం, జూలై 3: చంపావతి నది పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని పలువురు జిల్లా కలెక్టర్ హరిజవహర్‌లాల్‌కు మంగళవారం వినతిపత్రం ద్వారా కోరారు. గజపతినగరం మీదుగా వెళుతున్న చంపావతి నది పరివాహక ప్రాంతం(సుమారు 50గ్రామాలకు పైనే) ఉందని ఈ నది ద్వారా ఈ ప్రాంత ప్రజలకు తాగు,సాగునీరుగా ఉపయోగపడుతున్నది. ప్రస్తుతం గజపతినగరం పంచాయతీ పరిధిలో ఉన్న డంపింగ్ యార్డుకు(చెత్తను శుద్ధి చేసే కేంద్రం) చేరవలసిన వ్యర్థ పదార్థాలన్నింటిని నదిలో వేయడం వలన నది కలుషితమై మట్టి సారం తగ్గి పర్యావరణానికి తీవ్రమైన ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని,్భవిష్యత్తులో ప్రజలకు అంటువ్యాదులు, శ్వాసకోస వ్యాధులు సోకే ప్రమాదం ఉందని కలెక్టర్‌కు వివరించారు. దీని గురించి అధికారులకు తెలియజేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని తక్షణమే చంపావతి నది పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హరిజవహర్‌లాల్‌ను లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ బెల్లాన నాగనరేంద్ర, సామాజిక వేత్త, న్యాయవాది శీరవాసుదేవరావు, శీర రమణ తదితరులు కోరారు.

రాయితీ విత్తనాల కోసం రైతులు పాట్లు
జామి,జూలై 3: మండల కేంద్రమైన జామిలో రాయితీపై అందిస్తున్న వరి విత్తనాల కోసం రైతులు ప్రభుత్వ కార్యాలయాలపై మంగళవారం ఎగబడ్డారు. ప్రభుత్వ అందిస్తున్న రాయితీలకు రైతులంతా ఆసక్తి కనబరచి విత్తనాల కోసం వ్యవసాయ అధికారి కార్యాలయం, ప్రాథమిక సహకార వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయం, తహశీల్దార్ కార్యాలయం చుట్టూ అనేక మంది రైతులు తిరుగుతున్నారు. రైతాంగానికి ఇస్తున్న రాయితీని ప్రభుత్వం బాహాటంగా ప్రకటించినప్పటికీ ఈ రాయితీని పొందేందుకు విధించిన ఆంక్షలు మాత్రం రైతులకు కళ్ళు బైర్లు కమ్మె విధంగా ఉన్నాయి. బయోమెట్రిక్ విధానంతో రైతుల భూములు ఆన్‌లైన్‌లో ఉన్నాయోలేదోనని, ఉంటే ఎంత భూమి ఉందని పరిశీలించి ఎకరాకు ఒక బస్తా అందజేయడంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ మధ్య ఆన్‌లైన్‌లో భూములు లేని అగ్రహారం రైతుల భూములకు ప్రభుత్వం కొంత సడలింపు చేసి భూమి పత్రాలనుచూపిన వారికి ఒక ప్యాకెట్ చొప్పున విత్తనాలు అందజేయడం కొంతమంది రైతులకు ఊరట లభించింది. ఏది ఏమైనప్పటికీ రైతులకు అవసరమైన విత్తనాలు ఆంక్షలు విధించడకుండా అందిస్తే బాగుంటుందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అలమండ సంత మోనటరింగ్ కమిటీ సమావేశం
జామి,జూలై 3:మండలంలోని అలమండ సంతకు సంబంధించిన మోనటరింగ్ కమిటీ సమావేశం మంగళవారం ఎంపీడీవొ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ఎంపీడీవొ గొర్రిపాటి శ్రీను ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఎస్సై లక్ష్మణరావు, పశువైద్యాధికారి నరేష్, ఇవొ పీ ఆర్డీ లక్ష్మి, ఆర్టీవొలు హాజరయ్యారు. ముఖ్యంగా సంత నిర్వహణకు కావాల్సిన వౌలిక సదుపాయల గురించి చర్చించారు. సంతలో తాగునీటి సౌకర్యం, షెడ్లు ఏర్పాట్లు, పశువులను కబేళాలకు తరలించకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి కమిటీ సభ్యులంతా చర్చించి వారియొక్క అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన గో-సంరక్షణ అధ్యక్షుడు లోగిస రామకృష్ణ మాట్లాడుతూ మానాపురం, అలమండ, కొత్తవలస సంతల్లో గోవులను, దున్నలను,లేగదూడలను సైతం అత్యంత కిరాతకంగా కళేబరాలకు తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోసంరక్షణ కమిటీ సభ్యుల ద్వారా ఇటువంటి అక్రమాలను అడ్డుకుని అధికారులకు ఫిర్యాదు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ విషయమై ఇటువంటి అక్రమాలపై కఠినంగా వ్యవహరించి తగు చర్యలు తీసుకోవాలని కమిటీ తీర్మానించింది.