విజయనగరం

కోట్ల వ్యయం చేసినా కాని రాని గిరిజనాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్వతీపురం, జూలై 17: ఎన్నో సంవత్సరాల నుండి ఐటిడిఎ ద్వారా గిరిజనాభివృద్ధికి వందల కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా నేటికీ గిరిజనుల బతుకుల్లో మార్పు రావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐటిడిఎ ద్వారా గిరిజనులకు వౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, రహదార్లు, తాగునీరు, విద్యుత్ వంటి సదుపాయాలు కల్పించడం కోసం కోట్లాది రూపాయలు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసున్నాయి. అలాగే గిరిజనులకు సేకరించిన అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర వంటివి కల్పించడానికి గిరిజన సహకార సంస్థ సౌజన్యంతోఐటిడిఎ గిరిజనులకు అన్నివిధాల చేదోడు,వాదోడుగా ఉండేందుకు రూపాంతరం చెందిన ఐటిడిఎకు ఐ ఎ ఎస్ స్థాయి అధికారులను నియమించి తద్వారా గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అయితే నేటికి కొండకోనల్లోని జీవిస్తున్న గిరిజనులకు ఇంకా ఎలాంటి సదుపాయాలు అందకపోవడంతో వారి జీవితాల్లో వెలుగులు చూడడం లేదు.మైదాన ప్రాంతాల్లో కూడా గిరిజనులకు అంతంత మాత్రంగా అభివృద్ధి పలాలు అందుతున్నాయి. అమాయక గిరిజనులను దళారులు, వ్యాపారులు నేటికీ దోచుకుంటూనే ఉన్నారు. సంతల్లో గిరిజనులను నకిలీ వస్తువులను అమ్మడం ద్వారా వారిని తీవ్రంగా మోసగిస్తున్నారు.

ఎన్‌ఎంయు ప్రభుత్వంతో చీకటి ఒప్పందం
పార్వతీపురం, జూలై 17: ఆర్టీసీ గుర్తింపు సంఘమయిన ఎన్ ఎం యు ప్రభుత్వంతోను, యాజమాన్యంతోను లోపాయికారిగా చేసుకున్న చీకటి ఒప్పందం వల్ల ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని సి సి ఎస్ స్టేట్ బోర్డు డైరక్టర్, పార్వతీపురం ఆర్టీసీ డిపో ఎంప్లారుూస్ యూనియన్ డిపో కార్యదర్శి మరిపి శ్రీనివాసరావు ఆరోపించారు. మంగళవారం స్థానిక ఆర్టీసీ డిపో గేటు వద్ద ఎంపారుూస్ యూనియన్ నేతల ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల ఐ ఆర్,్ఫట్ విషయాల్లో ఎన్ ఎం యు అన్యాయం చేసిందన్నారు. గుర్తింపుసంఘం ప్రభుత్వంతో కుమ్మకయి 19శాతం ఐ ఆర్‌కు ఒప్పందం చేసుకుని ఆర్టీసీ ఉద్యోగులకు బ్లాకు డేగా మిగిల్చి తీరని ద్రోహం చేశారని ఆయన ధ్వజమెత్తారు. ఎన్ ఎంయుని గెలిపించుకుంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందని తద్వారా సంస్థను ప్రైవేటీకరణ చేసేందుకు, సంస్థ ఆస్తులు అమ్మేందుకు, సిబ్బందిని తగ్గించుకునేందుకు సహకరిస్తున్న ఎ ఎన్ యును గెలిపించడానికి కొన్ని తాయిళాలు ప్రకటిస్తున్నారని, గుర్తింపు సంఘానికి చిత్తశుద్ధి ఉంటే ఐక్య ఉద్యమం నిర్మించి ఉంటే వేతన సవరణ కూడా విద్యుత్ ఉద్యోగుల మాదిరిగా సకాలంలో అయ్యేదని ఆయన పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో ఆ సంఘ రాష్ట్ర నాయకురాలు అన్నపూర్ణ, డిపోఅధ్యక్షుడు బి.సోమరాజు, రీజినల్ నాయకులు కె.శంకరరావు, కె.నరిసింగరావు, కెబి లత, సిసి ఎస్ డెలిగేట్ టి.రాములు, సోమేశ్వరరావు, డి ఎ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

కృషి కేంద్రాలు సక్రమంగా నిర్వహించాలి
పార్వతీపురం, జూలై 17: సబ్‌ప్లాన్ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో నిర్వహించాల్సిన క్రిషీ కేంద్రాలు సక్రమంగా నిర్వహించాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు పీవో డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. మంగళవారం ఐటిడి ఎ కార్యాలయంలో ఐ ఆర్ పిడబ్ల్యువో, జట్టు, నీడ్ తదితర స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాల్లోని 42క్రిషీ సెంటర్ల నిర్వహణ చేపట్టాలని సూచించారు. 3 ఏళ్లులోపుపిల్లలకు 10మంది పిల్లలున్న గ్రామాల్లో ఈకేంద్రాల నిర్వహణ బాధ్యతలు చూడాలని కోరారు. జట్టు సంస్థకు కురుపాంలో2, గుమ్మలక్ష్మీపురంలో3, ఐ ఆర్ పి డబ్ల్యు ఎకు జియ్యమ్మవలసకు 1, పార్వతీపురం, కొమరాడలలో 17సెంటర్లు, నీడ్ సంస్థకు పాచిపెంటలో 15,సాలూరు1, మక్కువ 3వంతున పీవో కేటాయించారు. ఈ కార్యక్రమంలో ఐసిడియస్ పీవో విజయగౌరి, ఐ ఆర్ పిడబ్ల్యు ఎ సంస్థ డైరక్టర్ ప్రకాష్, నీడ్ సంస్థకు చెందిన వేణుగోపాలరావు, జట్టుకు చెందిన పకీరునాయుడు తదితరులు పాల్గొన్నారు.