విజయనగరం

విద్యతోనే సమసమాజం సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్కవరపుకోట, జూలై 17: విద్యవలనే మానజాతి మనుగడ ప్రతి రోజు అనేక మార్పులు సంభవించడానికి అవకాశం దొరుకుతుందని ప్రతి ఒక్కరు విద్యను అభ్యసించడం, వారు పొందిన జ్ఞానాన్ని సమాజానికి ఉపయోగించడం, దాని ద్వారా అభివృద్ధి సాధించడం లక్ష్యం కావాలని జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్ అన్నారు. మంగళవారం మండలంలోని రెల్లి గౌరమ్మపేట గ్రామంలో 12లక్షల అంచనా వ్యయంతో ఎన్ ఆర్‌విజి ఎస్ నిధులతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్డు ప్రారంభించారు. అనంతరం గ్రామంలో మొక్కలు నాటి పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ చదువువలన ఎంతటి అభివృద్ధి సాధించవచ్చో అనే ఉదాహరణకు నేనే జవాబు అని, మారుమూల గ్రామంలో పుట్టి కరెంటు, బోరునీరు, రోడ్లులేని పరిస్థితుల్లో మొట్టమొదటిసారి ఆ గ్రామం నుంచి ఎస్‌ఎస్సీ పాస్ అవడంతోపాటు ఇపుడు ఐఎఎస్ అధికారిగా మీ ముందు నిలుచున్నానని, విద్యకు, పేద, ధనిక,కులం, మతం అనేవి అడ్డురావని, మనస్సు పెట్టి చదివితే విజయాలు తమంతటతామే ఎదురవుతాయని విద్యార్థులు దీనిని దృష్టిలో పెట్టుకుని కష్టపడి చదవాలని అన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను అభివృద్ధికి అనుగుణంగా ఇష్టమైన విద్యను అందించాలని హితవుపలికారు. జిల్లాకు కలెక్టర్‌గా వచ్చిన తరువాత మొట్టమొదటిసారి ఎస్.కోట నియోజకవర్గంలో కాలుమోపి అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నానని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సైతం ఎస్.కోట నియోజకవర్గం నుంచే ఏ కార్యక్రమమైనా ప్రారంభించడం ఇక్కడ ప్రజల, నాయకుల నిబద్దతే కారణమని అన్నారు.
రానున్న రోజుల్లో, విద్య, వైద్యం, వ్యవసాయం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ముందుకు వెళ్తానని, ఈ మూడు వ్యవస్థల్లో ఎటువంటి లోపాలు ఉన్నా క్షమించేదిలేదని అధికారులను హెచ్చరించారు. జిల్లాను సొంత జిల్లాగా మార్చేందుకు ఉదయం 4.30 గంటలకే నిద్రలేచి తనవంతుగా విజయనగరం వార్డుల్లో పర్యటిస్తూ మొక్కలు నాటడం, వీధులను పరిశుభ్రం చేయించడం వంటి కార్యక్రమాలు చేయిస్తున్నానని కలెక్టర్ కార్యాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో ఆహ్లాదకర వాతావరణం నింపేందుకు నడుం బిగించానని ఆయన అన్నారు. కొత్త జిల్లాగా విజయనగరాన్ని నిలిపేందుకు అవినీతి రహిత పాలన అందించేందుకు అందరు ముందుకు రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
స్థానిక ఎమ్మెల్యే లలితకుమారి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్దికి కట్టుబడి ప్రజలతో మమేకమై ముందుకు వెళుతున్నానని దీనికి జిల్లా కలెక్టర్ కూడా సహాయ సహకారాలు అందించాలని ఆమె కలెక్టర్‌ను కోరారు. సిఎం సహాయ నిధి ద్వారా తెప్పించిన 9,25,610 నలుగురు లబ్దిదారులకు కలెక్టర్ ద్వారా పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 20కోట్లకుపైగా సిఎం సహాయ నిధి ద్వారా నిరుపేదలకు అందించామని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కోళ్ళ రాంప్రసాద్, ఎమ్మెల్యే లలితకుమారి, సర్పంచ్ అప్పన్న దొర, ఎంపీపీ కొల్లురమణమూర్తి, జడ్పీటీసీ కరెడ్ల ఈశ్వరరావు, మహామాయ కంపెనీ ఎండీ అగర్‌వాల్, సెయ్యిలు మేనేజరు బాలకృష్ణ, ఎంపీడీవొ రమణమ్మ, తహశీల్దార్ రాములమ్మ, ఇతర జిల్లా అధికారులు, మండల నాయకులు పాల్గొన్నారు.

గ్రామ అభివృద్ధి కోసమే గ్రామదర్శిని
* ఎమ్మెల్యే లలితకుమారి
లక్కవరపుకోట, జూలై 17: గ్రామ అభివృద్ధికోసమే గ్రామదర్శిని నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే లలితకుమారి అన్నారు. మంగళవారం జమ్మాదేవిపేట గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ముందుగా మొక్కలను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబునాయుడు జమ్మాదేవిపేట గ్రామంలో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఇక్కడ ప్రజలు చూపించిన విధేయతను చూసి ప్రశంసించారని దీనిని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో గ్రామదర్శిని, రచ్చబండ కార్యక్రమాలను నిర్వహిస్తానని ఆయన నాయకులు ఆదేశించారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాలలో ఉన్న సమస్యలను మాఫీలకు అతీతంగాపరిష్కరించాలని తద్వారా గ్రామ అభివృద్ధికి కృషి చేయాలనే సత్‌సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని చంద్రబాబు ఆదేశించారని, ఈ 75రోజులుపాటు ప్రతి గ్రామంలోను కార్యక్రమం నిర్వహిస్తామని ఆమె అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కరెడ్ల ఈశ్వరరావు, సర్పంచ్ కన్నయ్య, ఉప సర్పంచ్ కొట్యాడ ఈశ్వరరావు, కోళ్ల రాంప్రసాద్, మండల అధ్యక్షుడు మల్లునాయుడు, శ్రీనాథ్ పెదబాబు, ఎంపీటీసీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
పేదరిక నిర్మూలనే ప్రభుత్వ థ్యేయం
* ఎమ్మెల్యే డాక్టర్ కె. ఎ.నాయుడు
గజపతినగరం, జూలై 17: రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించాలన్నదే ప్రభుత్వ థ్యేయమని ఎమ్మెల్యే డాక్టర్ కె. ఎ.నాయుడు అన్నారు. మంగళవారం మండలంలోని ఎస్.లింగాలవలస గ్రామంలో గ్రామసందర్శన-గ్రామవికాస్ కార్యక్రమంలో భాగంగా పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ గ్రామానికి 6.16కోట్ల రూపాయలతో సంక్షేమ, అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా కోట్ల రూపాయలు ఖర్చుచేసి అభివృద్ధి పనులు చేపట్టిన దాఖలాలు లేవని అన్నారు. గత పదేళ్ళ కాలంలో కాంగ్రెస్ హయాంలో పేదవారికి ఇచ్చిన ఇళ్ళు కూడా బినామీల పేర్లతో తిన్నారని, పేదవాడికి గూడులేని పరిస్థితి తీసుకువచ్చారని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రతి పేదవాడికి లబ్దిచేకూరడం జరుగుతుందని అన్నారు. గ్రామంలో ఇంకా పలుసమస్యలు ఉన్నాయని, మూడు నెలల్లో సమస్యపరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. 2014లో తెలుగుదేశం పార్టీపై అత్యంత విశ్వాసంతో ఓట్లు వేసి గెలిపించారని, అదే విధంగా రానున్న ఎన్నికల్లో కూడా తమ పార్టీని ఆదరించి గెలిపించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రోజుకి 18 గంటలు పనిచేస్తూ రాష్ట్ర ఆర్థిక పురోగతిని సాధించే విధంగా కృషి చేస్తున్నారని అన్నారు. ప్రతి పక్షాలు చేస్తున్న ఆసత్య ఆరోపణలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. గ్రామంలో పర్యటిస్తుండగా పైలబంగారమ్మ తనకు ఇల్లు కావాలని ఎమ్మెల్యేను కోరగా ఇల్లును మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఆవూరి వంశీగ్రామస్తుడు కిడ్నీవ్యాధితో బాధపడుతున్నాడని, శస్తచ్రికిత్స కోసం ఆర్థిక సాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సి ఎం సహాయ నిధి నుండి శస్త్ర చికిత్సకు ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటానని వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీదేవి, జడ్పీటీసీ మక్కువ శ్రీధర్, ఎఎంసి వైస్ చైర్మన్ లెంక బంగారునాయుడు, ఆత్మాకమిటీ చైర్మన్ లక్ష్మునాయుడు, సిహెచ్‌సి చైర్మన్ మిత్తిరెడ్డి వెంకటరమణ, వైస్ ఎంపీపీ పోలినాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు గండ్రేటి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.