విజయనగరం

ప్రత్యేకహోదా బంద్‌ను విజయవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, జూలై 23: రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చే అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా మోసం చేశాయని, అందుకు నిరసనగా మంగళవారం వైకాపా రాష్టబ్రంద్‌కు పిలుపునిచ్చిందని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య అన్నారు. సోమవారం స్ధానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ద్వందవైఖరికి నిరసనగా తమ పార్టీపిలుపుమేరకు రాష్టబ్రంద్‌లో వ్యాపారులు, విద్యార్ధులు, సచ్చందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం దొంగనాటకాలతో ప్రజలను నమ్మించాలని చూస్తోందన్నారు. చంద్రబాబు నాడు ప్రత్యేకప్యాకేజీకి సై అనడంవలన హోదా నినాదం మరుగున పడిందన్నారు. తొలి నుంచి హోదా కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ తమదేనని తెలిపారు. అవిశ్వాసతీర్మాన చర్చలో సాక్షాత్తు ప్రధాని మోదీ హోదా సాధ్యం కాదని చెప్పడం చంద్రబాబు చేతకాని తనానికి నిదర్శనమన్నారు. అందుచేతనే రాష్టబ్రంద్ చేపడుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బూడి వెంకటరావు, పి ఎసి ఎస్ అధ్యక్షుడు కరణం ఆదినారాయణ, గ్రామ సర్పంచ్ మండల సరేష్, మాజీ ఎ ఎంసి చైర్మన్ పల్లి సంజీవరావు, బెల్లాన త్రినాధరావు, ఆల్తిరామునాయుడు, కనకల సుబ్రమ్మణ్యం, జెర్రిపోతుల జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

కేంద్రం చేసిన అన్యాయాన్ని ప్రజలు గ్రహించాలి
కొత్తవలస, జూలై 23: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని ప్రజలు గ్రహించాలని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ళ లలితకుమారి అన్నారు. సోమవారం మండలంలోని కాటకాపల్లి, కంటకాపల్లి గ్రామాలలో గ్రామదర్శిని-గ్రామ వికాశం కార్యక్రమానికి హాజరయ్యారు. ముందుగా కాటకాపల్లి గ్రామంలో అన్ని వీధులు తిరిగి ప్రజలను పలకరించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. మండలంలో కాటకాపల్లి గ్రామానికి ఎక్కువ నిధులు ఇచ్చి అభివృద్ధికి సహకరించామని తెలిపారు. జిల్లాలో ఉత్తమ పంచాయతీ ఎంపికైందని తెలిపారు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా అభివృద్ధిలో ముందున్నామని తెలిపారు. అనంతరం కంటకాపల్లి గ్రామంలో పర్యటించారు. గ్రామాల్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీలు చేస్తున్న విమర్శలకు ప్రజలు తగిన బుద్దిచెప్పాలని అన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు కోళ్ళ శ్రీను, కొరుప్రోలు అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

సర్పంచ్ విధులకు ఆటంకం కలిగించడం తగదు
* జెడ్పీటీసిపై సారిక సర్పంచ్ ఫిర్యాదు
విజయనగరం (్ఫర్టు), జూలై 23: విజయనగరం మండలం సారిక గ్రామపంచాయతీలో సర్పంచ్ విధులకు అడ్డుపడుతూ అధికారులను బ్లాక్‌మెయిన్ చేస్తున్న జెడ్పీటీసి, ఉపసర్పంచ్‌తోపాటు వార్డుసభ్యుడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సారిక గ్రామసర్పంచ్ డోకుల అచ్చియ్యమ్మ కోరారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం సంబంధిత ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లా ఎస్పీకి ఒక వినతిపత్రం ఇచ్చారు. తాను దశిత సర్పంచ్ అయినందునే వివక్షత చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సర్పంచ్ చేపట్టిన ధర్నాకు పలు రాజకీయపార్టీల నాయకులు మద్ధతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లోకల్ గవర్నమెంట్స్ ఛాంబర్ జాతీయ అధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు మాట్లాడుతూ సారిక పంచాయతీలో అభివృద్ధిపనులు సత్వరమే పూర్తిచేయాలని కోరారు. గ్రామ పంచాయతీలో ప్రభుత్వవిధులకు వ్యతిరేకంగా అక్రమాలకు పాల్పడుతూ పింఛన్‌దారులను, ఇళ్ల లబ్ధిదారులను బెదిరిస్తూ కమిషన్లు వసూలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. దళిత మహిళా సర్పంచ్ విధులు, బాధ్యతలు నిర్వహించకుండా అధికారుల ద్వారా బ్లాక్‌మెయిల్ చేస్తూ గ్రామ అభివృద్ధిని అడ్డుకుంటూ ఇబ్బందులు పెడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీసెట్టి బాబ్జీ, సిపిఐ నాయకుడు జీవ, దళిత సంఘాల జిల్లా నాయకులు రామవరపుపైడిరాజు, బొంగ భానుమూర్తి, పాండ్రంకి వెంకటరమణ, జి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.