విజయనగరం

న్యాయవాదులు విధులు బహిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం,సెప్టెంబర్ 20: న్యాయవాదుల హక్కులకు, స్వేచ్చకు భంగం కలిగించే విధంగా ఇటీవల సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఇచ్చినందుకు నిరసనగా గురువారం గజపతినగరంలోని న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన తెలియజేశారు. దేశవ్యాప్తంగా న్యాయవాదులు విధులు బహిష్కరించాలని ఇచ్చిన పిలుపుమేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కూరెళ్ల నాగభూషణరావు మాట్లాడుతూ ఈ ఉత్తర్వులలో భాగంగా అన్ని రకాల కేసులను సత్వరమే పరిష్కరించాలని, న్యాయవాదుల వృత్తిపై అనేక ఆంక్షలు విధించడం దారుణమన్నారు. అదే విధంగా న్యాయవాదులు తమ సమస్యలను పరిష్కరించే స్వేచ్చను పూర్తిగా నిర్వీర్యం చేయడం, సెక్షన్ 41 ఎ సవరణను అమలు చేయకపోవటం వంటి అంశాలు అన్నీ న్యాయవాద వృత్తిలో కొనసాగించటానికి ఆటంకం ఏర్పడుతుందని అన్నారు. తక్షణమే ఈ ఉత్తర్వులను నిలిపివేసి న్యాయవాదులు, కక్షిదారులకు సరైన న్యాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఉప్పలపాటి రమేష్, రెడ్డి శ్రీనివాసులనాయుడు, కలిశెట్టి రామునాయుడు తదితరులు పాల్గొన్నారు.

కరణంను అభినందించిన సిఎం చంద్రబాబు
గజపతినగరం,సెప్టెంబర్ 20: ప్రజలను ఆధ్యాత్మికత వైపునడిపించడంతో పాటు సంస్కృతి సంప్రదాయాలను వివరించడానికి కృషి చేస్తున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కరణం శివరామకృష్ణను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందించారు. అమరావతిలో టీడీపీ రాష్టస్ధ్రాయి విస్తృత సమావేశం జరగగా గజపతినగరంలో చేపడుతున్న నవగణపతుల నవరాత్రి మహోత్సవాలకు సంబంధించిన కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లారు. పట్టణంలో జరుగుతున్న వినాయక ఉత్సవాల గురించి ముఖ్యమంత్రికి వివరించడంతోపాటు జాతీయస్ధాయిలోనే గుర్తింపుపొందిన సురభి నాటక పరిషత్ వారిచే రోజుకొక నాటకం వంతున నాటకాలు ప్రదర్శిస్తున్నామని వివరించారు.

ప్రత్యేక హోదా కోసం ట్రై సైకిల్‌తో అమరావతికి
గజపతినగరం, సెప్టెంబర్ 20: ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం జిల్లాలోని బూరగాం గ్రామానికి చెందిన నెయ్యిల ప్రసాద్ అనే దివ్యాంగుడు మూడు చక్రాల సైకిల్‌తో చేపట్టిన యాత్ర గురువారం పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ గత నెల 12న శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వద్ద ఈ ట్రై సైకిల్ యాత్ర ప్రారంభించానని తెలిపాడు. 730 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగుతూ అమరావతికి చేరుకుని ముఖ్యమంత్రిని కలుస్తానని చెప్పారు. ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెంగాల్ అశోక్, ఎంపీ రామ్మోహన్‌నాయుడు యాత్రను ప్రారంభించారని చెప్పారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇస్తే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని చెప్పారు. తనకుటుంబం పేద కుటుంబం అయినా రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఈ హోదా వలన న్యాయం జరుగుతుందనే ఉద్దేశ్యంతో ఈ యాత్రకు శ్రీకారం చుట్టానని చెప్పారు. యాత్రలో భాగంగా దాతలు ఇచ్చిన సహాయ సహకారాలతో ముందుకు సాగుతున్నానని తెలిపారు.