విజయనగరం

ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్కవరపుకోట, సెప్టెంబర్ 21: ప్రజలు ఓటు వేసేటపుడు పూర్వ పరాలు ఆలోచించి ఓటు వేయాలని ఎవరికిబడితే వారికి ఓటు వేసే మనహక్కులు అయోగ్యుల చేతిలో పెట్టినవారమవుతామని, యోగ్యత ఉన్న వారికే ఓటు వేయాలని విజయనగరం కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. శుక్రవారం ఎల్.కోట వచ్చిన ఆయన ప్రతి పక్ష నేత జగన్, రాజశేఖర్ రెడ్డిలపై బొత్స సత్యనారాయణ, సినీ నటి రోజా చేసిన విమర్శలకు సంబంధించి పత్రికల్లో వచ్చిన కథనాలను సిబిఎన్ ఏర్పాటుచేసిన కటౌట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు ప్రతిపక్ష నేత జగన్‌పై, తండ్రి రాజశేఖరరెడ్డిపై ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేసి అదే పార్టీలో మళ్ళీ చేరిన బొత్స సత్యనారాయణ వ్యక్తిత్వాన్ని ఒక్కసారి పరిశీలించాలని, ఒకప్పుడు కుట్రలు చేసి జగన్‌తో విభేధించి ఆయనపై అనేక విమర్శలు చేసి ఇప్పుడు అతడ్ని పొగడ్తలతో ముంచెత్తి అధికార దాహంతో అల్లాడుతున్నారని, ఇటువంటి వారికి విలువలతో పనిలేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సాక్షాత్తు సిబి ఐ కోర్టులు ఆయన చేసిన అవినీతిపై తీర్పులు వెలువరించి ఆస్తులు జప్తు చేయడం జరిగిందని, వేల కోట్ల అక్రమ ఆస్తులను కలిగి ప్రజాధనాన్ని దుర్వినియోగంచేసి తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అనేక పొరపాట్లు చేసిన వ్యక్తికి పడే శిక్షలకు సంబంధించిన కటౌట్లను ఏర్పాటు చేయడం చెప్పుకోదగిన విషయమని ప్రజలకు ఇలా నిజాలు తెలిసినపుడే వారిలోవారు సరిదిద్దుకుని మంచి వ్యక్తులకు అధికారం ఇచ్చే సంస్కృతి ప్రారంభమవుతుందని ఎవరు అవినీతికి పాల్పడినా ప్రజలు సహించకూడదని అన్నారు. ఓటు హక్కు అధికారానికి బ్రహ్మాస్త్రంలాంటిదని, అధికారం ఇచ్చేది అదే అతపాతాళానికి తొక్కేది అదేనని ప్రజా స్వామ్యంలో ప్రజల వద్ద ఉన్న ఈ ఓటు ఆయుదాన్ని అవినీతి నిర్మూలన చేసే వ్యక్తికి సహాయంగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్‌గజపతిరాజుతోపాటు ఎమ్మెల్యే లలితకుమారి, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కోళ్ళరాంప్రసాద్, ఎంపీపీ కొల్లు రమణమూర్తి, జడ్పీటీసీ కరెడ్ల ఈశ్వరరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
టీడీపీలోకి వలసల జాతర
లక్కవరపుకోట, సెప్టెంబర్ 21: శృంగవరపుకోట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి వలసల జాతర కొనసాగుతోంది. శుక్రవారం ఎల్.కోట మండలం కళ్ళేపల్లి గ్రామం నుండి 50కుటుంబాల నుండి సుమారు 110 మందికి పైగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరంతా గతంలో కాంగ్రెస్, వైసీపీ పార్టీలలో కొనసాగారు. ఆయా పార్టీలలో క్రియాకీలకంగా వ్యవహరించిన గోకాడ గోవింద, నక్క కృష్ణ, గోకాడ కాటమయ్య, అప్పలరాజు తదితరులు తమకుటుంబాలతో కలసి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధికి చిరునామాగా నియోజకవర్గాన్ని తయారు చేస్తున్నామని, ఈ అభివృద్ధిని చూసి ప్రజలు టీడీపీకి పట్టం కడుతున్నారని, ఇతర పార్టీల వారు కూడా టీడీపీలో చేరుతున్నారని, ఇది మంచి పరిణామమని అన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేసిన జక్కాన సింహాద్రప్పడు, గురు ముత్యాల నాయుడులను ఎమ్మెల్యే అభినందించారు. పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే లలితకుమారి చేసిన అభివృద్ధిని చూసి టీడీపీలో చేరామని, ఎంతోమంది ఎమ్మెల్యేలను చూసినప్పటికీ ఈమె కష్టపడుతున్న తీరు, చేస్తున్న అభివృద్ధికి ముగ్థులయ్యామని ఇకపై గ్రామ అభివృద్ధికి అందరం టీడీపీతో కలసి పనిచేస్తామని అన్నారు. వీరి చేరికతో పార్టీ మరింత బలపడుతుందని ఎంపీటీసీ జక్కాన కన్నబాబు,నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కోళ్ళ రాంప్రసాద్‌లు అన్నారు. ఈ కార్యక్రమంలో, ఎపీపీ కొల్లురమణమూర్తి, జడ్పీటీసీ కరెడ్ల ఈశ్వరరావు, ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.