విజయనగరం

దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, సెప్టెంబర్ 24: దోమల నివారణకు అన్ని గ్రామ పంచాయతీలలో ఫాగింగ్ కార్యక్రమం చేపట్టాలని ఎంపీడీవొ ఎస్. కృష్ణవేణమ్మ ఆదేశించారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యాధులు సోకకుండా ఉండేందుకు ఫాగింగ్ దోహదపడుతుందని చెప్పారు. ఇంటి పన్ను వసూలు కార్యక్రమం వందశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. అదే విధంగా ఆదరణ పథకం ద్వారా బిసి కార్పొరేషన్ లబ్దిదారులకు బ్యాంకు ఖాతాలు తెరిచేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
గ్రామాలలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
గజపతినగరం, సెప్టెంబర్ 24: గ్రామాలలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ హరి జవహర్‌లాల్ ఆదేశించారు. సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులకు కలెక్టర్ హరి జవహర్‌లాల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు వారం రోజుల్లోగా తమకు ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేయాలని చెప్పారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలెక్టర్ల సమీక్ష సమావేశం జరుగుతుందని, అందుచేత అధికారులు అందరు తమతమ శాఖల పనులను వేగవంతంగా పూర్తిచేయాలని అన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ శేషగిరిరావు, ఎంపీడీవొ కృష్ణవేణమ్మ, సిడిపివొ రమణమ్మ, మండల విద్యాశాఖాధికారి విమలమ్మ, ఉపాధి హామీ పథకం ఏపీవొ కృష్ణవేణి, మండల పంచాయతీ విస్తరణ అధికారి జి. జనార్థనరావు తదితరులు పాల్గొన్నారు.
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
బొండపల్లి, సెప్టెంబర్ 24: విద్యలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక మండల విద్యాశాఖాధికారి కూనిబిల్లి సింహాచలం అన్నారు. సోమవారం స్థానిక మండల వనరుల కేంద్రంలో మండలంలోని ఉపాద్యాయులకు తరల్‌పై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3,4,5 తరగతుల్లో వెనుకబడిన విద్యార్థులకు గణితంలో అంకెలు, కూడిక, తీసివేత, గుణకారం, బాగాహారం వివిధ స్థాయిల్లో (మూడు గ్రూపులుగా) చేసి తరగతులు నిర్వహించాలని అన్నారు. తెలుగులో అక్షర స్థాయి పథం-పేరా స్థాయి, కథాస్థాయిలుగా విభజించి బోధించాలని చెప్పారు. దీంతో వెనుకబడిన విద్యార్థులు ఎగ్రేడ్ స్థాయికి చేరుకుంటారని అన్నారు. శిక్షణ పొందిన తరువాత పాఠశాలల్లో సక్రమంగా అమలు చేయాలని చెప్పారు. ఇందుకోసం మండలానికి నలుగురితో కూడిన ఓ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామని వీరు పాఠశాలను సందర్శించి తరల్‌పై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మార్సీ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సంకల్పయాత్రలో మరో మైలురాయి
* 3వేల కిమీ పాదయాత్ర పూర్తి
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, సెప్టెంబర్ 24: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ద్వారా మరో మైలురాయికి చేరుకున్నారు. సోమవారం జిల్లాలోని కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం వద్దకు వచ్చే సరికి 3వేల కిమీ పాదయాత్ర పూర్తి కావడంతో అక్కడ పైలాన్‌ను జగన్ ఆవిష్కరించారు. అదే విధంగా ఆ మైలురాయికి గుర్తుగా రావి మొక్కను నాటారు. పైలాన్ ఆవిష్కరణకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. గత ఏడాది నవంబర్ 6న ఇడుపుల పాయ నుంచి ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్ర 11 జిల్లాలు పూర్తి చేసుకొని 12వ జిల్లాగా విజయనగరం జిల్లాలో అడుగుపెట్టారు. కాగా, జగన్ పాదయాత్ర చేపట్టి నేటికి 269 రోజులు దాటింది. జగన్ పాదయాత్ర ఇప్పటి వరకు 116 నియోజకవర్గాల్లో 193 మండలాల్లో 1650 గ్రామాల మీదుగా సాగింది. ఇప్పటి వరకు 106 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. 107 బహిరంగ సభ కొత్తవలసలో జరిగింది. ఈ సభకు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో రావడంతో ఆ ప్రాంతమంతా ఇసుక వేస్తే రాలనంత జనం తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మజ్జి శ్రీనివాసరావు, ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి కడుబండి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య , సీనియర్ నాయకులు పి.సాంబశివరాజు, భూమాన కరుణాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.