విజయనగరం

పిల్లల ఆరోగ్యానికి బాలామృతం దోహదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, సెప్టెంబర్ 24: పిల్లల ఆరోగ్యానికి బాలామృతం దోహదపడుతుందని గజపతినగరం ఐసిడిఎస్ సిడిపివొ కె.రమణమ్మ అన్నారు. సోమవారం మెంటాడ మండల కేంద్రంలోని అంగన్ వాడీ కేంద్రంలో లబ్దిదారులకు పోషణాభియాన్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రక్తహీనత గల పిల్లలను గుర్తించి వారికి అదనపు ఆహారంగా బాలామృతాన్ని అందించాలని అన్నారు. అదే విధంగా గర్భిణీలు, బాలింతలకు సక్రమంగా పౌష్టికాహారాన్ని అందించడంతోపాటు ఆరోగ్య కార్యకర్తల ద్వారా అందించాల్సిన సేవలు సక్రమంగా అందే విధంగా చేయాలని అన్నారు. కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పాటు చేయవచ్చు అని చెప్పారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ హైమావతి, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

హైడ్రోజల్‌తో నీటి ఎద్దడి నివారణ
గజపతినగరం, సెప్టెంబర్ 24: హైడ్రోజల్ వాడకంతో నీటి ఎద్దడిని నివారించుకోవచ్చు అని ఆత్మా బిటిఎం ఉదయసిరి అన్నారు. సోమవారం మండలంలోని కొత్త శ్రీరంగరాజపురం గ్రామంలో వరిలో హైడ్రోజల్ వాడకంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హైడ్రోజల్ గుళికలు ఇసుకలో కలిపి జల్లాలని సూచించారు. ఇది భూమిలోని తేమను పీల్చుకుని నీటి ఎద్దడి ఏర్పడినపుడు మొక్కకు తేమను అందిస్తుందని తెలిపారు. ఇటువంటి అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని అన్నారు. హైడ్రోజల్ వలన సుమారు 15రోజులు పాటు వర్షాలు పడకపోయినా పరవాలేదని అన్నారు. కార్యక్రమంలో రైతు తవిటినాయుడు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు మరింత చేరువగా వరల్డ్ విజన్ సేవలు
గంట్యాడ, సెప్టెంబర్ 24: గ్రామీణుల సంక్షేమం కోసం వరల్డ్ విజన్ అందిస్తున్న సేవలు, పథకాలు ఇకపై మరింత విస్తృతం చేస్తామని ఆ సంస్థ జిల్లా మేనేజర్ రాంబాబు తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ సంస్థ గంట్యాడ మండలాన్ని దత్తత తీసుకుని 22సంవత్సరాలుగా ప్రజారోగ్యం, విద్య, తాగునీరు, ఉపాధి కల్పన తదితర అంశాలకు ప్రాధాన్యతను ఇచ్చి పథకాలను అమలు చేశారు. ఆర్వో వాటర్ ప్లాంట్లను తొమ్మి గ్రామాలలోను, మూడు ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేశామని అన్నారు. అంగన్‌వాడీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాల భవనాలను ఆధునీకరించి పెయింటింగ్ చేయించామని అన్నారు. స్పాన్సర్డ్ పిల్లలకు 500 మందికి స్కార్‌షిప్‌లు అందజేశామని చెప్పారు. ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా సీజనల్ వ్యాధులు ప్రబల కుండా వైద్య సిబ్బందితో కలసి తమ సంస్థ చర్యలు చేపట్టిందని అన్నారు. మండలంలోని ఐదు అంగణ్‌వాడీ కేంద్రాలలో వరల్డ్ విజన్ నిధులతో కూరగాయల మొక్కలను పెంచుతున్నామని అన్నారు. అన్ని రంగాలలో గంట్యాడ మండలాన్ని ఆదరంగా తీర్చిద్దిదాలనే లక్ష్యంతో ప్రజల భాగస్వామ్యంతో వరల్డ్ విజన్ సమావేశంలో సీనియర్ పిడిఎఫ్ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగికి సేవలే గుర్తింపు తీసుకువస్తాయి
గంట్యాడ, సెప్టెంబర్ 24: ఉద్యోగంలో ఉంటూ అందించిన సేవలే ఏ ఉద్యోగికైనా గుర్తింపు తీసుకువస్తాయని డిఎస్పీ సూర్య శ్రావణ్‌కుమార్ అన్నారు. గంట్యాడ ఎంపీగా పనిచేసి బదిలీపై వెళ్ళిన నారాయణరావును పోలీస్ సిబ్బంది ఆదివారం రాత్రి ఘనంగా సత్కరించారు. నూతన ఎస్సై రమేష్‌నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి డి ఎస్పీ శ్రావణ్‌కుమార్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బదిలీ ఎస్సై నారాయణరావును సత్కరించి జ్ఞాపికను అందజేశారు. నేరాల నియంత్రణతోపాటు వాహనప్రమాదాల నివారణకు నారాయణరావు తీసుకున్న చర్యలు ప్రశంసనీయమని డిఎస్పీ అన్నారు. కార్యక్రమంలో విజయనగరం రూరల్ సిఐ డి.రమేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
మంచినీటి పథకం పనులను పరిశీలిన
విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 24: విజయనగరం పట్టణవాసులకు చంపావతి నదిలో నిర్మిస్తున్న రక్షిత మంచినీటి పథకం ద్వారా అదనంగా 10 ఎంఎల్‌డి మంచినీటిని సరఫరా చేసేందుకు ప్రణాళికలు తయారు చేశామని మున్సిపల్‌చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ అన్నారు. ప్రజారోగ్య, పురపాలక సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో అమృత్‌ఫేజ్-4లో చంపావతి నదిలో నిర్మిస్తున్న మంచినీటి పథకం నిర్మాణపనులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంపావతినదిలో వాటర్‌ట్యాంకు నిర్మాణం పూర్తయితే పట్టణవాసులకు అదనంగా పది ఎంఎల్‌డి మంచినీటి సరఫరా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌కమిషనర్ వేణుగోపాల్, పబ్లిక్‌హెల్త్ ఇఇ గణపతిరావు, డిప్యూటీ ఇంజనీర్ ప్రసన్న, జూనియర్ ఇంజనీర్ హరి, మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు ఆహ్వానం
విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 24: ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు సంబంధించి డ్రైవర్ పోస్టులకు మాత్రమే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఆర్టీసీ రీజనల్‌మేనేజర్ ఎ.అప్పలరాజు తెలిపారు. ఆర్టీసీలో పనిచేస్తూ మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన వారికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులు హెవీ ట్రాన్స్‌ఫోర్టు వెహికల్ లైసెన్స్ పొంది 18నెలలు పూర్తియిన అభ్యర్థులు ఈనెల 26వతేదీన ఉదయం పది గంటలకు రీజనల్‌మేనేజర్ కార్యాలయంలో హాజరు కావాలని కోరారు. అభ్యర్థుల డ్రైవింగ్ లైసెన్స్ కాలపరిమితి చలామణిలో ఉండాలన్నారు. అభ్యర్థులు తమతోపాటు డ్రైవర్ ఉద్యోగానికి అవసరమైన ధృవీకరణ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్‌కార్డు తీసుకురావాలన్నారు.