విజయనగరం

కరవు మండలంగా ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దత్తిరాజేరు,నవంబర్ 13: దత్తిరాజేరు మండలంలో వర్షాభావ పరిస్థితులు వలన ఈ సంవత్సరం వరిపంటలన్నీ పోయాయని,కరవు మండలంగా ప్రకటించాలని జిల్లా కలెక్టర్‌ని, ఎమ్మార్వోని, ఎంపీడీవొని కోరినా ఇంతవరకు మండలం విషయం పట్టించుకోలేదని రైతు సంఘి జిల్లా ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయకార్యదర్శి రాకోటి రాములు, గజపతినగరం ఏరియా సి ఐటియు నాయకులు పురం అప్పారావు అన్నారు. మంగళవారం మండల కేం6దైమన దత్తిరాజేరులో స్థానిక విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత నెల 3వ తేదీన మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట రైతులతో కూడిన ధర్నా చేయడం జరిగిందని, అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందించామని, అయినా ఇప్పటికీ వారు ఏ విషయం పట్టించుకోలేదని వారు అన్నారు. రైతులు వేలాది రూపాయలు అప్పులు చేసి వరిపంటకు మదుపుపెట్టారని, వర్షాభావర పరిస్థితులతో పంటలు పోవడంతో అప్పులుపాలై వలసలు పోతున్నారని అన్నారు. జిల్లా అధికారులు స్పందించి కరవు పింఛన్లు, 50కిలోల బియ్యం, పప్పులు, ఉప్పులు పంపిణీ చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. అలాగే జిల్లా మొత్తంపై కరవు ఏర్పడిందని, జిల్లాను కూడా కరవుమండలంగా ప్రకటించి కరవు రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ విషయమై జిల్లాలో ఈనెల 27న జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాను కరవుజిల్లాగా ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మికసంఘం జిల్లా ఉపాధ్యక్షులు జి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా
పార్వతీపురం, నవంబర్ 13: తోటపల్లి బ్యారేజి నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం పార్వతీపురం ఆర్డీవో కార్యాలయం ముందు నిర్వాసితుల సంఘం,సిపియం పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపియం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కార్యవర్గసభ్యులు ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ తోటపల్లి ప్రాజెక్టు పూర్తిచేసినప్పటికీ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడంతో ప్రభుత్వం, అధికారులు వైఫల్యం చెందుతున్నారని పేర్కొన్నారు. నందివానివలస గ్రామంలోని ఇళ్లకునష్టపరిహారం ఇవ్వాలని, అలాగే నిర్వాసిత గ్రామాల్లో గల రామాలయాలకు,చర్చిలకు, రచ్చబండ్లకు నష్టపరిహారాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గుణాణపురం, అడ్డాపుశీల, బాసంగి, గదబవలసలలో గల డి.పట్టా భూములు గల రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. వంశధార, పోలవరం ప్రాజెక్టుల మాదిరిగానే ఇంటి నిర్మాణానికి ఇపుడు ఇస్తున్న రూ.55వేల నుండి రూ.5లక్షల మేర మంజూరు చేయాలని కోరారు. ప్రస్తుతం లోతట్టుగా ఉన్న దుగ్గి, పి ఆర్ ఎన్ వలస, బిత్తరపాడు నిర్వాసితులకు కేటాయించిన ఇళ్లస్థలాలు చదువును చేయించాలని కోరారు. నిర్వాసిత గిరిజన కుటుంబాలకు శాశ్వతంగా ప్రాజెక్టులో శాశ్వతంగా చేపలు పట్టుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రాజెక్టులో భూములు కోల్పోయిన అడ్డాపుశీల, గుణాణపురం, మార్కొండపుట్టి గ్రామ రైతులకు పి ఎ ఎఫ్ ప్యాకేజిలు ఇవ్వాలని కోరారు. పునరావాలస గ్రామాలయిన నవిరి, మార్కొండపుట్టి, కోటవానివలస, బంటువానివలసలకు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు వంటివి సౌకర్యం కల్పించాలని కోరారు. నిర్వాసిత గ్రామాలన్నింటికీ పూర్తిస్థాయిలో సంపూర్ణంగా వౌలిక, ఇతర సదుపాయాలు కల్పించేలా చూడాలని డిమాండ్ చేశారు. ధర్నా కార్యక్రమం వద్దకు వచ్చిన ఆర్డీవో బి.సుదర్శనదొరకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ నిర్వాసితుల సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కరించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈధర్నాలో సిపియం జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీరామ్మూర్తి, నిర్వాసిత సంఘ నాయకుడు బంటు దాసు తదితరులతో పాటు పలు గ్రామాలకు చెందిన నిర్వాసితులు పాల్గొన్నారు.