విజయనగరం

నైపుణ్యంతోనే ఫలితాలు: ఎంఇవొ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లిమర్ల, నవంబర్ 13: నైపుణ్యంతోనే మంచి ఫలితాలు సాధించవచ్చు అని ఎం ఇవొ అంబళ్ళ కృష్ణారావు అన్నారు. ఆయన చంద్రంపేట పాఠశాలను మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల వ్రాత నైపుణ్యం గణితంపై విద్యార్థులను ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా ఎంఇవొ మాట్లాడుతూ నైపుణ్యంతోనే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. అలాగే ప్రాథమిక స్థాయి విద్యార్థులు వ్రాత నైపుణ్యం జరిగి ఉంటే ఉన్నత తరగతులకు ఉపయోగపడతారని అన్నారు. ముఖ్యంగా 4,5 తరగతుల విద్యార్థులు వ్రాతనైపుణ్యంతో గణితంపై పట్టు సాధించాలని అన్నారు. గణితంపై పట్టుసాధించేందుకు కృషిచేయాలని అన్నారు. అనంతరం గ్రామసభలు నిర్వహించి అవసరమైన పనులను గుర్తించి ప్రతిపాదనలు తయారు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో ఏపీవొ వెంకటరమణ మాట్లాడుతూ కోటి 30లక్షల రూపాయల ఉపాధి పనులు గుర్తించామని తెలిపారు. దీంతోపాటుగా 70లక్షల రూపాయల పనులకు ప్రతిపాదనలు తయారు చేశామని అన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కంది సత్యనారాయణ, ఎంపీటీసీ వాళ్ళె సావిత్రమ్మలు పాల్గొన్నారు.

విజయమ్మగారూ వాస్తవాలు తెలుసుకోవాలి
* టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కరణం శివరామకృష్ణ
దత్తిరాజేరు, నవంబర్ 13: వైసీపీ నాయకురాలు విజయమ్మ జగన్‌పై దాడిలో వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కరణం శివరామకృష్ణ అన్నారు. మంగళవారం మండలంలోని పెదమానాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్‌పై దాడి జరిగిన వెంటనే తమకుమారుడు హైదరాబాద్ వెళ్ళిపోయారని అన్నారు. రాష్ట్ర పోలీసులకు కనీసం ఫిర్యాదు చేయలేదని అన్నారు. ఇటీవల విజయమ్మ జగన్ కేసులో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తున్నదని అనడం సరికాదని అన్నారు. ముందుగా కుమారుడుతో కూర్చొని ఏమి జరిగిందో తెలుసుకోవాలని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి వైసీపీ నేతలు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. గతంలో విశాఖలో వాణిజ్య పరమైన వ్యాపార సదస్సు జరుగుతుండగా జగన్ ఎయిర్‌పోర్టులో ధర్నా చేయగా ఇప్పుడు కోడి కత్తె డ్రామాలు ఆడుతున్నారని చెప్పారు. విదేశీ పెట్టుబడులు రానీయకుండా వైసీపీ నాయకులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఫ్యాక్షనిస్టు జగన్ తండ్రి, తాతల నుండే ఉందని ఎద్దేవా చేశారు. విశాఖ ఎంపీలో విజయమ్మ పరాజయం పాలైనందుకు మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా తమతీరును మార్చుకుని రాష్ట్భ్రావృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కంది తిరుపతినాయుడు, మాజీ జడ్పీటీసీ గంటా త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు.