విజయనగరం

ప్రజల భాగస్వామ్యంతోనే ‘స్వజల’ విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, నవంబర్ 13: ప్రజల భాగస్వామ్యంతోనే స్వజల పథకం విజయవంతం కాగలదని జిల్లా జాయింట్ కలెక్టర్-2 సీతారామారావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన స్వజల పథకం వర్కుషాపునకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వజల పథకం ద్వారా జిల్లాలో 301 గ్రామాలకు ఇంటింటికీ కొళాయి కనెక్షన్ మంజూరు అవుతుందన్నారు. ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ పథకం విజయవంతం కావాలంటే అందరి సహకారం అవసరమన్నారు. కాగా, పంచాయతీలు స్వజల నిర్వహణ బాధ్యతను చేపట్టాల్సి ఉందన్నారు. ప్రజలకు వౌలిక సదుపాయాలైన పారిశుద్ధ్యం, తాగునీరు అందించాల్సిన బాధ్యత పంచాయతీలపై ఉందన్నారు. అలాగే ప్రజలకు ఇంటింటికీ కొళాయి కనెక్షన్ మంజూరు చేసినపుడు వారి నుంచి నామమాత్రపు ఛార్జీలను వసూలు చేసి వాటితో స్వజల పథకాన్ని నిర్వహించాలని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ రమణమూర్తి మాట్లాడుతూ దేశంలో ఆరు రాష్ట్రాలకు ఇందుకోసం ఎంపిక చేయగా వాటిలో విజయనగరం ఒకటిగా ఉందన్నారు. కాగా, ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని విజయనగరం జిల్లాలో చేపట్టడం ఆనందదాయకమన్నారు. ప్రజల భాగస్వామ్యంతొనే ఈ పథకాన్ని నిర్వహించాల్సి ఉందన్నారు. ఇందుకు ప్రధానంగా స్వజల పథకానికి అయ్యే మొత్తంలో 10 శాతం గ్రామ పంచాయతీలు భరించాల్సి ఉందన్నారు. అలాగే ఆ పంచాయతీ ఒడిఎఫ్ ఫ్రీలో ఉండాలన్నారు. పైపులైన్ ద్వారా నీటిని సరఫరా చేసే ప్రాంతాలు లేని చోట ఈ పథకాన్ని అమలు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ విధంగా జిల్లాలో 341 గ్రామాలను ఎంపిక చేసినట్టు ఆయన వివరించారు. ఇందుకోసం పంచాయతీల నుంచి రూ.74 కోట్లు 10 శాతం వాటా కింద చెల్లించామని వివరించారు. జెడ్పీ సిఇఒ వేంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల నుంచి విరాళాలు సేకరించి పథకాన్ని నిర్వహించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. భూగర్భజలవనరుల శాఖ డిడి కెఆర్‌కె మూర్తి రాజు మాట్లాడుతూ నీటి లభ్యత ఉన్న ప్రాంతాలలో ట్యాంకులను నిర్మించాల్సి ఉందని, పంచాయతీలలో ఎక్కడ నీటి వనరులు ఉన్నాయన్నదీ తాము నిర్ధారించుకొని వాటి ప్రకారం నీటిని సరఫరా చేయాల్సి ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఎ ఎపిడి మురళీ, స్వయం సహాయక సంఘ సభ్యులు, తాజా మాజీ సర్పంచ్‌లు, ప్రత్యేకాధికారులు తదితరులు పాల్గొన్నారు.

రైతులు భూ సమస్యలు పరిష్కరించాలి
గజపతినగరం, నవంబర్ 13: రైతులు భూ సమస్యలను పరిష్కరించుకోవాలని స్ధానిక తహశీల్ధార్ బి.శేషగిరిరావు కోరారు. మంగళవారం మండలంలోని కొనిసి గ్రామంలో రైతులు కోసం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా 22 ఎకేసులు తోపాటు రికార్డులలో తప్పులు దొర్లితే తమ దృష్టికి తీసుకొచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలని తెలిపారు. 22 ఎ కేసులకు సంబందించి మీ సేవ ద్వారా తెలపాలని సూచించారు. ప్రతి గ్రామంలో ఈ గ్రామసభలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అధికారులు తమ వద్దకే వస్తున్నందున ఈ గ్రామసభలు రైతులు వినియోగించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో సిఎస్‌డిటి సత్యనారాయణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

అగ్ని అస్త్రంతోనే కత్తెరపురుగు అంతం
* గజపతినగరం ఎడి ఎ అన్నపూర్ణ
గజపతినగరం, నవంబర్ 13: అగ్ని అస్త్రంతోనే కత్తెర పురుగును అంతం చేయవచ్చని గజపతినగరం సబ్‌డివిజన్ ఆర్.అన్నపూర్ణ అన్నారు. మంగళవారం మండలంలోని పొలంపిలుస్తోంది కార్యక్రమంలో బాగంగా మండలంలోని కాళంరాజుపేట, డోలపాలెం గ్రామాలలోని మొక్కజొన్న పంటను పరిశీలించగా మొక్కజొన్నకు కత్తెర పురుగు సోకుతున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ గ్రామాలలో మొక్కజొన్నను పరిశీలించగా కత్తెరపురుగు ఉదృతి తీవ్రంగా ఉందన్నారు. తొలిదశలోనే దీనిని గుర్తించిన రైతులు సహజసిద్దమైన అగ్ని అస్త్రం మందును తయారు చేసుకొని పిచికారీ చేయాలన్నారు. అర కిలో వెల్లుల్లి ముద్ద, అరకిలో పచ్చిమిర్చి ముద్ద, పొగాకు కిలో ఆవు మూత్రం 15 లీటర్ల, ఐదు కిలోల వేపాకు ముద్ద వీటన్నిటిని ఒక ట్రబ్బులో వేసి నాలుగు పొంగులు వచ్చేదాకా మరగబెట్టాలని చెప్పారు. అనంతరం 48గంటలు చల్లార్చాలని తరువాత డబ్బాలో వడగట్టి దాచుకోవాలన్నారు. ఎకరాకు ఆరు లీటర్లను 200మీటర్ల నీటిలో వేసి పిచికారీ చేయాలని సూచించారు. త్వరితగతిన నివారణ చర్యలు తీసుకోకపోతే పంటలు నాశనం అవుతాయని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి టి.సంగీత, గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి తేజ తదితరులు పాల్గొన్నారు.

అగ్నిప్రమాదాలపై అవగాహన అవసరం
గజపతినగం, నవంబర్ 13: అగ్నిప్రమాదాలపై అవగాహన అవసరమని స్ధానిక అగ్నిమాపక అధికారి మహేశ్వరరావు అన్నారు. మంగళవారం గజపతినగరం పంచాయతీ శివారు నారాయణగజపతిరాజపురంలోని ధాన్యం మిల్లులోని కళాసీలు, యాజమాన్నానికి అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైసుమిల్లులు, కర్రడిపోలు అలాగే ఎక్కువ మంది ఒకేచోట పనిచేసే ప్రదేశంలో తప్పనిసరిగా అగ్నిమాపక నిరోధాలకు సంబందించిన అన్ని ఏర్పాట్లును చేయాల్శి ఉందన్నారు. నిబంధనలు అతిక్రమించే యజమానులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అగ్నిప్రమాదాలు జరిగినపుడు ఆందోళన చెందకుండా బయట పడే అవకాశాలను చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది, వాసవీ అగ్రో ఇండస్ట్రీ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రధానిమంత్రి ఫసల్‌భీమా రైతులకు ఆసరా!
* జిల్లా సమన్యయకర్త గోపినాధ్
గజపతినగరం, నవంబర్ 13: ప్రధానిమంత్రి ఫసల్ భీమా రైతులకు ఆసరా అని జిల్లా సమన్వయకర్త గోపినాధ్ అన్నారు. మంగళవారం మండలంలోని జిన్నాం గ్రామంలో పంటకోత ప్రయోగం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది తీవ్ర వర్షాబావ పరిస్ధితులు నెలకొన్నందున ఈ గ్రామంలో దిగుబడి శూన్యమని అన్నారు. రైతులు ఖరీప్ రుణాలు తీసుకొన్నందున ప్రధానిమంత్రి ఫసల్ భీమా కింద పరిహారం అందించడమే కాకుండా మిగిలిన రైతులు అందరికి పరిహారం అందజేయడం జరుగుతుందని అన్నారు. పంట రుణాలు తీసుకోని రైతులు ప్రధానిమంత్రి ఫసల్ భీమా చేయించుకోవాలని సూచించారు. రబీలో పండించే రైతులు రుణాలు పొందడమో, లేదా భీమా చెల్లించుకోవడయో చేయాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి టి.సంగీత, గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి తేజ తదితరులు పాల్గొన్నారు.