విజయనగరం

దళిత మహాసంకల్పసభను జయప్రదంచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుర్ల, నవంబర్ 16: దళిత మహాసంకల్పసభ జయప్రదం చేయాలని చీపురుపల్లి నియోజకవర్గ ఎయిమ్ చీఫ్ అడ్వజర్ కెల్ల భీమారావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ ఈ నెల 18న విజయనగరంలో నాయుడు ఫంక్షన్‌హాల్లో జరగనున్న దళిత మహాసంకల్పసభ విజయవంతం చేయాలని అన్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో ఉన్న దళితులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎయిమ్ వ్యవస్థాపకులు బి.వి.సునీల్‌కుమార్, అడిషినల్ డిజిపి ముఖ్య అతిధులుగా హాజరుతారని చెప్పారు. ఈ సమావేశంలో ప్రధానంగా దళిత వాడలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని, చట్ట పరిరక్షణ కల్పించాలని తదితర అంశాలన్నీ ఉంటాయని తెలిపారు. ఇందుకు దళిత యువతలు అందరు హాజరు కావాలని కోరారు.
=============

పంచాయతీలు విద్యుత్ బకాయిలు చెల్లించాలి

గుర్ల, నవంబర్ 16: 2017 ఏప్రిల్ నుంచి 2018 అక్టోబర్ వరకు వీధిదీపాల ఛార్జీలుచెల్లించాలని గ్రామ పంచాయతీలకు లేదంటే విద్యుత్‌ను నిలిపివేయడం జరుగుతుందని ఆశాఖ ఎఇ అన్నారు. గుర్ల మండలంలో వీధి దీపాలకు సంబంధించి విద్యుత్ బకాయిలను మూడు రోజుల్లో చెల్లించాలని కోరారు. గుర్ల మండలంలో మొత్తం 44లక్షల రూపాయలు వీధిదీపాలకు సంబంధించి బకాయిలు 2017 ఏప్రిల్ 2018వరకు 13లక్షల బకాయిలు ఉన్నాయని చెప్పారు. వెంటనే పంచాయతీలు స్పందించి చెల్లింపులు చేయాలని లేదంటే విద్యుత్ నిలిపివేసేందుకు విద్యుత్‌శాఖ చర్యలు తీసుకుంటుందని అడిషినల్ ఇంజనీరు ప్రసాదరావు అన్నారు.
===============

ప్రతిభ వెలికితీయడానికి పోటీ పరీక్షలు

నెల్లిమర్ల, నవంబర్ 16: విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడానికి పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నామని నెల్లిమర్ల శాఖా గ్రంథాలయం నిర్వాహకులు పి.రామారావు అన్నారు. శుక్రవారం జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా రామతీర్థం జంక్షన్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఇటువంటి పోటీలు ఉపయోగపడతాయని అన్నారు. పుస్తకపఠనం వలన విజ్ఞానం పెరగడంతోపాటు ప్రపంచ విషయాలు తెలుసుకోవచ్చు అని చెప్పారు. చిన్నతనం నుండి గ్రంథపఠనం అలవర్చుకోవాని అన్నారు. కార్యక్రమంలో హెచ్ ఎం పి. జనార్థనరావు, ఉపాద్యాయులు కుసుమంచి జగన్మోహన్, శ్రీరాములు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
==============

మొక్కజొన్న పంటను ఆశించే తెగుళ్ళు, నివారణ చర్యలపై అవగాహన

జామి, నవంబర్ 16: మండలంలోని అన్నంరాజుపేట గ్రామంలో శుక్రవారం మొక్కజొన్న పంట రైతులకు మొక్కజొన్న పంటను ఆశించే తెగుళ్ళు, నివారణ చర్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి ఎడిఎ లీలావతి మాట్లాడుతూ ముఖ్యంగా మొక్కజొన్న పంటను కత్తెర పురుగు ఆశించడం జరుగుతుందని, దీని నివారణ చర్యలకు సంబంధించి అనకాపల్లి ఆత్మాసౌజన్యంతో అనకాపల్లి శాస్తవ్రేత్త విశాలాక్షి ఈ తెగుళ్లు నివారణ గురించి, పిచికారిచేసే మందులు గురించి వివరించారు. పోలా