విజయనగరం

కచ్చితమైన ఓటర్ల జాబితాలు ఆన్‌లైన్ పూర్తిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్వతీపురం, నవంబర్ 19: ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు, తడకలకు ఆస్కారం లేకుండా ఇంతవరకు నమోదు చేసిన కొత్త ఓటర్ల జాబితాతో పాటు తొలగింపులు, చేర్పులు వంటివి ఆన్‌లైన్‌లో నమోదు చేసే కార్యక్రమం త్వరితగతిన ఆన్‌లైన్ చేయాలని పార్వతీపురం ఆర్డీవో బి.సుదర్శదొర బిఎల్‌వోలను ఆదేశించారు. సోమవారం పార్వతీపురం ఆర్డీవో బంగ్లా సమీపాన ఏర్పాటు చేసిన కురుపాం అసెంబ్లీ నియోజకవర్గ బిఎల్‌వోల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కురుపాం అసెంబ్లీలోని వచ్చిన కొత్త ఓటర్ల జాబితాతోని వచ్చిన 6425మంది, తొలగింపులు 1592మంది ఓటర్లను ఆన్‌లైన్ చేయాలని కోరారు. అదేవిధంగా 212మంది పేర్లు మార్పిడికి సంబంధించి, పోలింగ్ స్టేషన్ల మార్పుకు సంబంధించిన వచ్చిన 326 క్లెయిమ్‌లను కూడా త్వరితగతిన ఆన్‌లైన్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోకార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అప్పలరాజు, ఎన్నికల డిప్యూటీ తహశీల్దారు రాధాకృష్ణ, ఆయా మండలాలకు చెందిన డిటిలు పాల్గొన్నారు.

గిరిజనులకు న్యాయం చేయాలి
పార్వతీపురం,నవంబర్ 19: పార్వతీపురం ఐటిడిఎ కార్యాలయంలో ఉద్యోగాల నియామకాల్లో గిరజనులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ సోమవారం గిరిజన సంక్షేమసంఘం, గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా సంఘనేతలు మాట్లాడుతూ పాఠశాల్లో మెనూ ప్రకారం భోజనాలు పెట్టాలని, ఉపాధ్యాయుల కొరత పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో గిరిజన సంక్షేమసంఘం నేత రంజిత్‌కుమార్, గిరిజన విద్యార్థి సంఘం నేత పల్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.