విజయనగరం

యువకుల సమస్యలను పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురుపాం, డిసెంబర్ 11: గ్రామాభివృద్ధికి యువకులే కీలకపాత్ర వహిస్తున్నందున వారి సమస్యల పరిష్కారానికి పాలకులు కృషి చేయాలని సీపీఎం రాష్ట్ర నాయకులు ఎం కృష్ణమూర్తి కోరారు. బుధవారం కురుపాంలో ఏజెఎన్‌సీ యువజన సంఘం ఆధ్వర్యంలో విద్యార్థుల సదస్సు జరిగింది. యువకుల సమస్యలు- పరిష్కారమార్గాలు అనే అంశంపై పలువురు నేతలు చర్చించారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ యువకులకు నిరుద్యోగ సమస్య నానాటికి తీవ్రమవుతున్నందున దానిపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. ఏళ్లు గడుస్తున్న ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో నిరుద్యోగులుగా నిరాశపరులుగా మారుతున్నారన్నారు. విద్యార్థి దశలోను కూడా సమస్యలు ఉండటం వలన యువత నైరాస్యంలో మునిగిపోతున్నారన్నారు. ప్రతీ ఒక్కరికీ ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగాలు కల్పించినప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని ఇవ్వడం కంటే ఉద్యోగ కల్పనే ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోలక లక్ష్మణమూర్తి, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్, యువజన సంఘం ప్రతినిదులు మోహన్, తదితరులు పాల్గొన్నారు.

షటిల్ రాష్టస్థ్రాయి పోటీలకు ఎంపిక
కురుపాం, డిసెంబర్ 12: కురుపాంనకు చెందిన ఇద్దరు యువకులు షటిల్ బాడ్మింటిన్ రాష్టప్రోటీలకు ఎంపికయ్యారు. గ్రామానికి చెందిన వి వెంకటరమణ సింగిల్స్‌లోను, ఎన్ రాజేష్ డబుల్స్‌లోను జిల్లాస్థాయిలో ప్రతిభను కనబర్చడంతో రాష్ట్ర పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల విజయనగరంలో జరిగిన పోటీలలో ప్రథమస్థానాలను పొంది రాష్టప్రోటీలకు హాజరుకానున్నారన్నారు. 21 నుంచి 23వ తేదీ వరకు అనంతపురంలో జరిగే రాష్టస్థ్రాయి షటిల్ పోటీలకు హాజరుకానున్నట్లు క్రీడాకారులు తెలిపారు. వీరిని పలువురు అభినందించారు.

132 జీఓ రద్దుకు ప్రతీ ఒక్కరూ కలిసిరావాలి
కురుపాం, డిసెంబర్ 12: రాష్ట్రంలో గిరిజన సంక్షేమ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల అధికారాలను తొలగిస్తు జారీచేసిన 132 జీఓను రద్దుచేసేందుకు ప్రతీ ఒక్కరూ కలిసిరావాలని ఆదివాసీ సేవా సంఘం అధ్యక్షులు ఆరిక సూర్యనారాయణ కోరారు. బుధవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఇప్పటికే గిరిజన సంక్షేమ పాఠశాలల ఉపాధ్యాయులు పోరుబాట పట్టారన్నారు. వీరికి మద్ధతుగా మైదానప్రాంత ఉపాధ్యాయులు, ఉద్యోగులు మద్ధతు పలకాలన్నారు. గతంలో ఉన్న 40జీఓను పునరద్దరించి అధికారాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులకే ఉండేలా చూడాలన్నారు. మండలంలోని ఏటీడబ్ల్యుఓ ఒక్కరే అన్ని పాఠశాలలకు బిల్లులు పెట్టడం ఇబ్బందికరంగా ఉంటుందని, దీనిని రద్దుచేసి పూర్వపువిధానమే కొనసాగించాలని డిమాండ్ చేశారు.