విజయనగరం

డయాలిసిస్ రోగులకు పింఛన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, డిసెంబర్ 12: జిల్లాలో విజయనగరం, పార్వతీపురం కేంద్రాల్లో డయాలిసిస్ చికిత్స పొందుతున్న రోగులకు పింఛన్లు అందజేయాలని కలెక్టర్ హరి జవహర్‌లాల్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఇప్పటికే 160 మంది రోగులకు పింఛన్లు అందజేస్తున్నారని, మిగిలిన 9 మందికి పింఛన్లు అందజేయాలని ఆదేశించారు. చంద్రన్న సంచార చికిత్సలో రాష్ట్రం రెండో స్థానంలో ఉందన్నారు. మిగిలిన 108, తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్, ఎన్టీఆర్ వైద్య సేవలు, డయాలిసిస్ సేవలు, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు చాలా వెనుకబడి ఉన్నాయని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రోగుల పట్ల డాక్టర్లు, సిబ్బంది ప్రవర్తన, లంచాల నివారణ మెరుగైన సేవలు తదితర అంశాల సంతృప్తి స్ధాయిపై ప్రభావం చూపిస్తాయన్నారు. అదే విధంగా ఐసిడిఎస్ సమీక్షలో అంగన్‌వాడీ భవనాల్లో వసతులు సరిగా లేవని, భోజనం బాగోలేదని ప్రజలు సంతృప్తి వ్యక్తపరుస్తున్నందున ఆయా అంశాల్లో క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందికి ప్రత్యేక చొరవ తీసుకొని ప్రజల సంతృప్తి స్థాయిని పెంచాలన్నారు. సమావేశంలో జెసి-2 సీతారామారావు, డిఎంహెచ్‌ఒ డాక్టర్ విజయలక్ష్మి, డిసిహెచ్‌ఎస్ డాక్టర్ ఉషశ్రీ, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సీతారామరాజు, ఐసిడిఎస్ పిడి వసంతబాల తదితరులు పాల్గొన్నారు.

బీసీల సదస్సుకు సన్నద్ధం!
* టీడీపీ హయాంలోనే బీసీలకు న్యాయం

విజయనగరం, డిసెంబర్ 12: తెలుగుదేశం హయాంలోనే బీసీలకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే మీసాల గీత అన్నారు. బుధవారం అశోక్‌బంగ్లాలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ నెల 30న రాజమండ్రిలో జరిగే బీసీల సదస్సును విజయవంతం చేయాలన్నారు. బీసీల సంక్షేమానికి టీడీపీ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఈ సందర్భంగా పార్టీ పరిశీలకుడు పిల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీ అత్యధిక స్థానాల్లో గెలుపు ఖాయమన్నారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన మోసానికి ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ అడ్రస్ గల్లంతయ్యిందన్నారు. పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో శ్రేణులంతా చురుగ్గా పాల్గొనాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు మాట్లాడుతూ బీజేపీతో ఒప్పందం చేసుకున్న జగన్, పవన్ అంటకాగుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణాలో పోటీ చేసే ధైర్యం లేకుండా పిరికిపందాల్లా పారిపోయిన వైసీపీ, జనసేన నాయకులు తెరాస గెలిస్తే ఇక్కడ సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. మున్సిపల్ చైర్మన్ రామకృష్ణ మాట్లాడుతూ బీసీల సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందన్నారు. కాగా, రాజమండ్రిలో జరిగే బీసీల సదస్సును విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ విఎస్ ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ఎన్‌ఎం రాజు, ఎఎంసి చైర్మన్ సైలాడ త్రినాద్, గ్రంథాలయ సంస్ధ చైర్మన్ బి.నర్సింగరావు, జెడ్పీటీసీ తుంపల్లి రమణ, సీనియర్ నాయకులు విజ్జపు ప్రసాద్, బలివాడ అప్పారావు, రొంగలి రామారావు, జి.ఆదిబాబు, ఈగల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.