విజయనగరం

ఏకపక్షంగా సిబ్బందిని కుదించడం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 12: ప్రసుత్తం ఆర్టీసీ యాజమాన్యం ఏకపక్షంగా వ్యవహరిస్తూ గుర్తింపుసంఘంతో ఎటువంటి చర్చలు జరపకుండా సిబ్బందిని కుదించే చర్యలు చేపట్టడం తగదని ఆర్టీసీ ఎంప్లాయిస్‌యూనియన్ (ఇయు) రీజనల్ కార్యదర్శి బాసూరు కృష్ణమూర్తి అన్నారు. రాష్టక్రమిటీ ఇచ్చిన పిలుపుమేరకు బుధవారం ఇక్కడ ఆర్టీసీ డిపో కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ ఆర్టీసీ ఎండి తీసుకుంటున్న ఏకపక్షంగా నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈనెల 10వ తేదీన యాజమాన్యానికి రాష్ట్ర కమిటీ నోటీసు ఇచ్చిందని తెలిపారు. ఆర్టీసీలో సిబ్బంది కుదింపులో భాగంగా సివిల్ ఇంజనీరింగ్ సిబ్బందిని తగ్గించేందుకు సర్క్యులర్ జారీ చేశారని చెప్పారు. అలాగే సెక్యూరిటీ సిబ్బందిని కూడా కుదించేందుకు చర్యలు చేపడుతున్నారని అన్నారు. త్వరలో మిగిలిన కేటగిరిలకు సంబంధించి ట్రాఫిక్, గ్యారేజి సూపర్‌వైజర్లు, ఎడి,పిడి క్లరికల్ సిబ్బందిని కుదించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. గ్రౌండ్‌బుకింగులు, బుగింగ్ కౌంటర్లను ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చే ఆలోచనలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రీజనల్ అధ్యక్షుడు జి.రవికాంత్ మాట్లాడుతూ ఒకవైపుసిబ్బందిని తగ్గించాలని చెబుతూనే మరోవైపురెగ్యులర్ సిబ్బంది చేపడుతున్న పనులను ఔట్‌సోర్సింగ్‌వారికి అప్పగించేందుకు యాజమాన్యం ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. యాజమాన్యం అనుసరిస్తున్న ఏకపక్ష విధానాలను తిప్పికొట్టేందుకు అన్నివర్గాల ఉద్యోగుల మద్ధతు తీసుకుంటున్నామని చెప్పారు. ఆర్టీసీ ఇయు డిపోకమిటీ నాయకుడు కెవి రమణ తదితరులు పాల్గొన్నారు.

ఇళ్లులేని నిరుపేదలకు
ఇళ్లస్థలాలు ఇవ్వాలని ధర్నా

విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 12: విజయనగరం పట్టణంలో 16వ వార్డుపరిధిలో జమ్ముకు చెందిన సుమారు 40 నిరుపేద కుటుంబాలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లాసహాయకార్యదర్శి బుగత అశోక్ మాట్లాడుతూ పట్టణంలో జమ్ముకు చెందిన 40 నిరుపేద కుటుంబాలు స్వంత ఇంటిస్థలం లేక 2012 నుంచి అధికారులు చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రచ్చబండ, జన్మభూమి కార్యక్రమాల్లో అర్జీలు పెట్టుకున్నా ఫలితం దక్కలేదన్నారు. పెద్దొళ్లు వందలాది ఎకరాల ప్రభుత్వస్థలాలు ఆక్రమించుకుంటుంటే ఇల్లులేని నిరుపేదలకు 60 గజాల ఇంటిస్థలం ఇవ్వాలని అడుగుతుంటే ఒక్క అంగుళం స్థలం కూడా లేదని మాయమాటలు చెప్పి అధికారులు తప్పించుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వస్థలాలను గుర్తించి ఆక్రమణలను తొలగించి ఇల్లు లేని నిజమైన అర్హులకు ఇంటిస్థలం కేటాయించి ప్రభుత్వఖర్చులతో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఆయన కోరారు. జమ్ములో కబ్జాకు గురవుతున్న ప్రభుత్వభూమిని పరిరక్షించి, కబ్లాకు పాల్పడుతున్నవారిపై సమగ్ర విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యవర్గసభ్యులు తుమ్మి అప్పలరాజుదొర, టి.జీవన్ తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్ బిల్లులు వెంటనే ఇప్పించాలి
*తప్పుడు అధికారులపై చర్యలు తీసుకోవాలి * అంబేద్కర్ విగ్రహం సాక్షిగా దళిత మాజీ సర్పంచ్ వౌనదీక్ష

విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 12: విజయనగరం మండలం సారిక గ్రామ పంచాయతీలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లును వెంటనే చెల్లించాలని మాజీ సర్పంచ్ డోకుల అచ్చియ్యమ్మ కోరారు. దళిత మహిళా సర్పంచ్‌గా పనిచేసిన తనపట్ల అధికారులు చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధిపనులకు బిల్లులు చెల్లించకుండా మోసం చేస్తున్న పంచాయతీ, ఇంజనీరింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ మేరకు కంటోనె్మంట్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం వౌన దీక్ష చేశారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ గ్రామపంచాయతీ నిధులతో పనులు చేయకుండా 70 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టించి తనతో పనులు చేయించారని, ఇప్పుడు బిల్లులు చెల్లించకుండా సంవత్సరం ఆరునెలల నుంచి అధికారులు అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు చెల్లించాలని జిల్లాకలెక్టర్ డాక్టర్ హరిజవహర్‌లాల్‌ను కోరామని, తక్షణమే బిల్లులు చెల్లించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారని, అయితే ఇంజనీరింగ్, పంచాయతీ అధికారులు తనను మోసం చేస్తూ కలెక్టర్‌కు తప్పుడు నివేదిక ఇచ్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ తీర్మానాలు, ఇంజనీరింగ్ అధికారి పర్యవేక్షణ లేకుండా పనులు చేసినట్లు తప్పుడు నివేదిక ఇచ్చారని తెలిపారు. అభివృద్ధిపనులకు సంబంధించి గ్రామపంచాయతీ తీర్మానాలు, ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణపై జిల్లా కలెక్టర్ బహిరంగ విచారణ చేపట్టాలని ఆమె కోరారు.
పాఠశాలలకు చేరిన పదవ తరగతి మెటీరియల్
మెరకముడిదాం, డిసెంబర్ 12: రానున్న పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు గాను రూపొందించిన మెటీరియల్ బుదవారం మండలంలో గల జిల్లా పరిషత్ పాఠశాలలకు చేరాయి. ఈ చేరిన మెటీరియల్‌ను గర్భాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు గ్రంది ఈశ్వరరావు చేతుల మీదుగా విద్యార్థులకు అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టర్, విద్యా శాఖ అధికారి వారికి తమ విద్యార్దులకు మెటీరియల్ పంపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్ధులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ జరగనున్న పదవతరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్న ఉద్దేశ్యంతో ఈ మెటీరిల్ పంపిణీ చేయడం జరుగుతుందని వీటిని సద్వినియోపర్చుకోవాలాన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

తేనేటీగల దాడిలో ముగ్గురికి గాయాలు
గరుగుబిల్లి, డిసెంబర్ 12: మండల పరిధిలోని సంతోషపురం గ్రామసమీపంలోని పార్వతీపురం-శ్రీకాకుళం ప్రధాన రహదారిలో ఉన్న వంతెన వద్ద తేనెటీగల దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం సంతోషపురం గ్రామంలో ఉన్న బ్రిడ్జి వద్ద తేనెటీగలు ఒక్కసారిగా దాడిచేయడంతోపార్వతీపురం నుంచి కిచ్ఛాడవైపు మోటార్ సైకిల్‌పై వెళుతున్న ముగ్గురు వ్యక్తులు బైక్‌ను అదుపుచేయలేకపోవడంతో లారీ ముందుభాగంలోకి దూసుకుపోయింది. ఈప్రమాదంలో టి సీతారాం, సుధారాణి, కె రమేష్‌లకు స్వల్పగాయాలయ్యాయి. అంతేకాకుండా వీరిపై తేనెటీగలు కూడా దాడి చేయడంతో గాయపడ్డారు. చికిత్స నిమిత్తం పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

36వ రాష్ట్రీయ రహదారిలో తప్పని ట్రాఫిక్ సమస్యలు
* సీతానగరం ఆర్‌అండ్‌బి వంతెనపై గంటలతరబడి ట్రాఫిక్ ఇబ్బందులు
సీతానగరం, డిసెంబర్ 12: మండల కేంద్రంలోని సువర్ణముఖి నదిపై ఉన్న ఆర్‌అండ్‌బి వంతెనపై ట్రాఫిక్ సమస్యలు కొనసాగుతున్నాయి. ప్రతీరోజు ఈ వంతెనపై నుంచి ప్రయాణించాలంటే వాహనచోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు బుధవారం ఆర్‌అండ్‌బి వంతెనపై ఓ వాహనం నిలిచిపోవడంతో గంటలతరబడి ఈమార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. మధ్యాహ్న భోజన సమయం కావడంతో ప్రయాణీకుల ఇబ్బందులు వర్ణణాతీతం. సుమారు 2గంటలపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. పోలీసులు వాహనాలను యంత్రాల సహాయంతో తొలగించడంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారమైంది. స్థానిక పోలీసులకు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడం సవాల్‌గా మారుతోంది. వంతెనపై వెడల్పు తక్కువగా ఉండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈమధ్యకాలంలో బొబ్బిలి నుంచి పార్వతీపురం వెళ్లే 36వ రాష్ట్రీయ రహదారి సక్రమంగా లేకపోవడంతో పలు సమస్యలు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా పార్వతీపురం డివిజన్ పరిధిలో సీతానగరం మీదుగా ఆర్‌అండ్‌బి వంతెన అంటిపేట గ్రామం వద్ద కల్వర్టులు మరమ్మతులకు గురికావడంతో ఈ రహదారిలో వాహనాల రాకపోకలకు నిరంతరం అవాంతరాలు ఎదురవుతున్నాయి. దీనిపై సంబంధితశాఖాధికారులు త్వరితగతిన స్పందిస్తే ఈ సమస్యలు తలెత్తవనేది పలువురి ప్రయాణీకుల అభిప్రాయం.

లక్ష్మీపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
సీతానగరం, డిసెంబర్ 12: మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈమేరకు ఎంపీటీసీ దాసరి నాగరత్నం బుధవారం కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందన్నారు. అధికారులు రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహించాలని, ఇందుకు రైతుల కూడా అధికారులకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీటీ నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

విత్తనశుద్ధితో బహుళ ప్రయోజనాలు
సీతానగరం, డిసెంబర్ 12: విత్తనశుద్ధి చేసుకోవడం వలన బహుళ ప్రయోజనాలు చేకూరుతాయని మండల వ్యవసాయ అధికారి ఎం ఉమామహేశ్వరనాయుడు సూచించారు. మండలంలోని ఆర్‌వెంకంపేట, రామవరం గ్రామంలో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రబీ సీజన్‌కు సంబంధించి వరివేసుకున్న రైతులందరికీ రెండవ పంటగా విత్తనశుద్ధి చేసుకోవాలని, దీని వలన తెగుళ్లు రాకుండా కొంతవరకు నివారించవచ్చునన్నారు. దీని కోసం కార్భన్‌డిజం పొడిమందును వాడవచ్చునన్నారు. ఈ మందులను సబ్సీడిపై వ్యవసాయ కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయన్నారు. పెసర, మినుము పంటలలో వచ్చే తెగుళ్లుపై కూడా రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఇఓ రామ్మూర్తి, ఎంపీఇఓ గౌరీలు పాల్గొన్నారు.

ఓటర్ల జాబితాలో తప్పులను వెంటనే సవరించాలి
కొమరాడ, డిసెంబర్ 12: ఓటర్లజాబితాలో ఎటువంటి తప్పులున్న వెంటనే సవరించి తుది జాబితాను విడుదల చేయాలని బీఎల్‌ఓలకు సబ్ కలెక్టర్ చేతన్ ఆదేశించారు. ఈమేరకు స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో పలు పార్టీల నాయకులు, బీఎల్‌ఓలతో బుధవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 ఏడాదికి సంబంధించి తయారుచేసిన ఓటర్ల జాబితాలలో ఎటువంటి తప్పులు ఉంటే వెంటనే వాటిని సవరించాలన్నారు. అలాగే జాబితాలను రాజకీయ పార్టీ నాయకులు కూడా చూసి ఎటువంటి అవకతవకలు ఉన్న తెలియజేయాలన్నారు. పోలింగ్ బూత్‌లలో వౌళిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో తహశీల్దార్ రాజకుమారి, టీడీపీ మండల అధ్యక్షులు ఎన్ శ్రీనివాసరావు, బిజెపీ నాయకులు మురళీమోహన్, సీపీఎం నాయకులు కె సాంబమూర్తి, వైసీపీ నాయకులు సింహాచలంనాయుడు, బీఎల్‌ఓలు పాల్గొన్నారు.

బృహత్తర తాగునీటి పథకానికి తొలి అడుగు
* పెద్దగెడ్డ జలాశయాన్ని పరిశీలించిన ఏఐఐబి బృందం
సాలూరు, డిసెంబర్ 12: మున్సిపాల్టీలో తాగునీటి సరఫరాకు సంబంధించిన పైలెట్ వాటర్ స్కీం మంజూరుకు తొలి అడుగుపడింది. కొద్ది సంవత్సరాలక్రితం ఈ స్కీం నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించారు. గత ప్రభుత్వ హయాంలోని 54కోట్ల రూపాయలతో డీపీఆర్ ప్రతిపాదనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించారు. పెద్దగెడ్డ జలాశయం నుంచి పట్టణానికి తాగునీటి సరఫరా పైపులైన్ నిర్మాణంతోపాటు ప్రస్తుత తాగునీటి సరఫరా వ్యవస్థను మార్చేందుకు అవసరమైన ప్రతిపాదనలను ఈప్రాజెక్టులో పొందుపరిచారు. ఈ ప్రాజెక్టు మంజూరైతే 2050 వరకు పట్టణ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చవచ్చునని తెలుస్తోంది. ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి బుధవారం తొలి అడుగుపడింది. ఏఐఐబి అధికారుల బృందం, ప్రజారోగ్య ఇంజనీరింగ్ అధికారుల బృందం, మున్సిపల్ అధికారుల బృందం పెద్దగెడ్డ ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు నుంచి తీసుకురావల్సిన నీటి లభ్యత, ఇతర అంశాల గురించి బృందంలోని జర్మనీ ప్రతినిదులు జాక్, ప్రజారోగ్యశాఖ ఎస్‌ఇ శ్రీనివాసరావు, ఇఇ గణపతిరావు, డీఇ జగన్మోహనరావు, మున్సిపల్ డీఇ సుధాకర్, కమిషనర్ నాయుడు, మున్సిపల్ ఛైర్‌పర్సన్ విజయకుమారిలు కూడా పరిశీలించారు. పైలెట్ వాటర్ స్కీం ఆవస్యకతపై కమిషనర్, డీఇలు ఏఐఐబి బృందం అధికారులకు వివరించారు.

మున్సిపల్ హైస్కూల్‌లో ఆకస్మిక తనిఖీ
సాలూరు, డిసెంబర్ 12: పట్టణంలోని డబ్బీవీధి ఉన్నత పాఠశాలను మున్సిపల్ కమిషనర్ ఎంఎం నాయుడు బుధవారం ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈమేరకు హైస్కూల్, ప్రాథమిక పాఠశాలలోని హాజరుపట్టికలను పరిశీలించారు. 10వ తరగతి ఉత్తీర్ణతశాతాన్ని పెంచేందుకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల గురించి విద్యార్థులను ఆరాతీశారు. ప్రత్యేక తరగతుల ప్రయోజనాన్ని విద్యార్థులు వివరించారు.

రెగ్యూలర్ చేయాలని ఎమ్మెల్సీకి వినతి
సాలూరు, డిసెంబర్ 12: ఇందిరాక్రాంతి పథంలో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యూలర్ చేయాలని కోరుతూ సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల ఉద్యోగులు బుధవారం ఎమ్మెల్సీ సంధ్యారాణికి వినతిపత్రాన్ని అందించారు. వెలుగు ఉద్యోగుల సంఘం నాయకులు పి రామకృష్ణ ఆధ్వర్యంలో 3మండలాల ఉద్యోగులు సంధ్యారాణి నివాసంలో ఆమెను కలిశారు. ప్రభుత్వ సంక్షేమపథకాల్లో తామే కీలకపాత్ర పోషిస్తున్నామని, 18 ఏళ్లుగా పనిచేస్తున్న వారిని రెగ్యూలర్ చేయకపోవడం అన్యాయమన్నారు. గత కొద్దిరోజులుగా ఐకెపీ ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు. ఉద్యోగుల వినతి మేరకు ఎమ్మెల్సీ సంధ్యారాణి సంబంధితశాఖా మంత్రి సునీతతో ఫోన్‌లో మాట్లాడారు. వెలుగు ఉద్యోగుల న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని మంత్రిని కోరారు.