విజయనగరం

బీఎస్‌ఎన్‌ఎల్ ఛార్జీలు పెరుగుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, డిసెంబర్ 14: బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్ లైన్, బ్రాడ్‌బ్యాండ్ ఛార్జీలను పెంపుదల చేసింది. నెలసరి అద్దె గతంలో రూ.99 ఉండగా దానిని ఈ నెల 1 నుంచి రూ.129 పెంపుదల చేసినట్టు బీఎస్‌ఎన్‌ఎల్ జిల్లా జనరల్ మేనేజర్ ప్రభా రామారావు తెలిపారు. శుక్రవారం ఆయన 3ఆంధ్రభూమి2తో మాట్లాడుతూ ఈ కొత్త ప్లాన్‌తో నెలకు రూ.129 అద్దెతో దేశంలోని అన్ని బిఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్కులకు ఉచిత కాల్స్ చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. ఇతర నెట్‌వర్కులకు రూ.100 ఉచిత కాల్స్, ప్రతి రోజు రాత్రి 10.30 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు, ఆదివారం నాడు ఉచిత కాల్స్ చేసుకునే అవకాశం ఉందన్నారు. అలాగే అర్బన్ ల్యాండ్‌లైన్ రూ.249 ప్లాన్ ఈనెల ఒకటొ తారీఖు నుంచి అమల్లోకి వచ్చిందన్నారు. ఈ కొత్త ప్లాన్‌తో రూ.249 అద్దెతోపాటు దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా కాల్స్ చేసుకునే వీలుందన్నారు. రూరల్ ల్యాండ్ లైన్ ప్లాన్ రూ.160 నుంచి రూ.180 ప్లాన్‌గా మార్పు చేశారు. ఎక్పీరియన్స్ బ్రాడ్‌బ్యాండ్ రూ. 249 ప్లాన్‌ను రూ.299గా మార్పు చేశారు. అపరిమిత డేటా 8ఎంబిపిఎస్ స్పీడుతో రోజుకు 1.5 జిబి, తరువాత 1 ఎంబిపిఎస్ స్పీడు, భారత్‌లో బిఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్‌కు ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. ఇతర నెట్‌వర్కులకు రూ.300 విలువ గల ఉచిత కాల్స్, ప్రతి రోజు రాత్రి 10.30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కాల్స్ చేసుకునే సదుపాయం కల్పించారు.
ఇదిలాఉండగా అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం కింద బిఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ పోస్టు పెయిడ్ రూ.399 అంతకన్నా ఎక్కువ లేదా ల్యాండ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్ రూ.745 అంతకన్నా ఎక్కువ వినియోగించే వినియోగదారులు ఒక ఏడాది పాటు అమోజాన్ సభ్యత్వం ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా చెల్లించకుండా పొందవచ్చని ఆయన వివరించారు.
కాల్స్ చేయాలంటే అదనంగా అలాగే బ్రాడ్‌బ్యాండ్ నెలసరి అద్దె రూ.291కు మార్పు చేశారు. ఇది ఈనెల 7 నుంచి అమల్లోకి వచ్చింది.

జనవరి నుండి డిజిటల్‌లైఫ్ సర్ట్ఫికేట్లు నమోదు

గజపతినగరం, డిసెంబర్ 14: ప్రభుత్వ పింఛన్‌దారులకు సంబంధించి డిజిటల్ లైఫ్ సర్ట్ఫికెట్లు నమోదు కార్యక్రమం జనవరి ఒకటి నుండి ప్రారంభిస్తామని స్ధానిక ఉపఖజానాధికారి వి.లక్ష్మణరావుతెలిపారు. శుక్రవారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా పించనుదారులు సులభంగా ఎక్కడి నుండైనా వారి డిజిటల్ లైఫ్ సర్ట్ఫికేట్లను సమర్పించే అవకాశం ఉందన్నారు. ఆధార్‌నెంబర్ ఆధారంగా పింఛన్‌దారులు తమ వేలిముద్రలను నమోదు చేసుకోవడం ద్వారా ధ్రువపత్రాన్ని అందజేయవచ్చన్నారు. ఉపఖాజానా కార్యాలయంతోపాటు మీ సేవాకేంద్రాలు, ఇంటర్నెట్ కేంద్రాల్లోను జీవన్‌ప్రమాణ్ పోర్టల్ అందుబాటులో ఉంటుంది అని ఎక్కడనుండైనా ధ్రువపత్రాలు కోసం న మోదు చేసుకోవచ్చన్నారు.
మార్చి నెలాఖరులోగా పించనుదారులు ఆధార్‌నెంబర్, వేలిముద్రలు ఆధారంగా లైఫ్ సర్ట్ఫికేట్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

ప్రైవేటీకరణకు నిరసనగా 19న చలో కలెక్టరేట్
గజపతినగరం, డిసెంబర్ 14: మధ్యాహ్న భోజన పధకంను ప్రైవేటు సంస్ధలకు అప్పజెప్పిన నిర్ణయానికి వ్యతిరేకంగా వంటలు బంద్‌చేసి ఈ నెల 19న చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు డివిజన్ కార్యదర్శి పురం అప్పారావు అన్నారు. శుక్రవారం స్ధానిక మండల వనరుల కేంద్రంలో నిర్వాహకులతో కలసి వినతిపత్రాన్ని అందజేశారు. గత 15 సంవత్సరాలుగా అనేక వ్యయ ప్రయాసాల కోర్చి భోజన పధకాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులను కాదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు సంస్ధలకు అప్పజెప్పేందుకు సిద్ధం అవుతున్నాయన్నారు. గత 11 సంవత్సరాలుగా నిర్వాహకులకు ఇస్తున్న గౌరవ వేతనాన్ని వెయ్యి రూపాయలు పెంచలేదన్నారు. లక్షలాది రూపాయలు ప్రైవేటు సంస్ధలకు షెడ్డులు నిర్మాణాలకు నిధులను కేటాయించి ప్రభుత్వం నిర్వాహకులను ఇంటికి పంపేందుకు సిద్ధం అవుతుందన్నారు. 17,18 తేదీల్లో కలెక్టరేట్ వద్ద రిలే నిరాహారదీక్షలు చేపట్టిన తరువాత 19న పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపడాతామని తెలిపారు. నాలుగైదు మండలాలకు కలిపి ఒకచోట భోజనాలను వండి పాఠశాలలకు సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతుందన్నారు. కార్యక్రమంలో మధ్యాహ్నభోజన నిర్వాహకుల సంఘం జిల్లా అధ్యక్షురాలు జయలక్ష్మి, మండలశాఖ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సత్యవతి, రాధ తదితరులు పాల్గొన్నారు.