విజయనగరం

పూర్తి ఆయకట్టుకు నీరు అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఫిబ్రవరి 1: జిల్లాలోని తోటపల్లి ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రాజెక్టు పరిధిలోని నిర్మాణం పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎంఎం నాయక్ తోటపల్లి ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మంది రంలో తోటపల్లి, తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టుల ఇంజనీర్లు, కాంట్రాక్టు ఏజెన్సీలతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తోటపల్లి ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ సమస్యలు పెద్దగా లేని కారణంగా పనులు వేగవంతం చేయాలని, ముందుగా నిర్ణయించిన మేరకు జూన్ నాటికి పూర్తి ఆయకట్టుకు నీరిందించేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీర్లను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. నిర్మాణ పనులపై కలెక్టర్ సమీక్ష జరిపిన సందర్భంలో జనవరి నెలలో 43 స్ట్రక్చర్లు ప్రారంభించగా వాటిలో 33 నిర్మాణాలు పూర్తి చేసామని, మిగిలిన పనులు వివిధ దశలలో ఉన్నాయని తోటపల్లి ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామచంద్ర తెలిపారు. గజపతినగరం బ్రాంచి కెనాల్ పనులకు అవసరమైన భూసేకరణను త్వరగా పూర్తిచేయాలని, అక్కడి నిర్మాణం పనులను సరిగా చేయని కారణంగా కాంట్రాక్టర్‌ను మార్పు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఇకనుంచి ప్రతివారం ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహిస్తామని అన్నారు. మైనర్లు, సబ్‌మైనర్ల పనులను ఇనె్వస్టిగేట్ చేసి నివేదికలు అందచేయాలని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్రీకేష్ లఠ్కర్, తోటపల్లి, తారకరామతీర్థ సాగర్ ఇంజనీరింగ్ అధికారులు, డిప్యూటీ కలెక్టర్లు బాలాత్రిపుర సుందరి అనిత, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి శ్రద్ధ తీసుకోవాలి
ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుంచి వ్యక్తిగత, సామాజిక ఆర్థిక సమస్యల పరిష్కారం కోరుతూ వస్తున్న దరఖాస్తులను పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఎంఎం నాయక్ సూచించారు. సోమవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమం అనంతరం కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో దరఖాస్తుల పరిష్కారంపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీవెన్స్ కార్యక్రమంలో రెవెన్యూ, పంచాయతీరాజ్, గృహనిర్మాణం, పౌరసరఫరాల శాఖలకు సంబంధించి ఎక్కువగా ఫిర్యాదులు, దరఖాస్తులు వస్తున్నాయని, ఈ దరఖాస్తులను నిర్ణీత వ్యవధిలో పరిశీలించి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా అందిన దరఖాస్తులలో 66శాతం పరిష్కారం జరిగిందని, మిగతా దరఖాస్తుల విషయంలో కూడా సంబంధితశాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్రీకేష్ లఠ్కర్ జిల్లా రెవెన్యూ అధికారి జితేంద్ర తదితరులు పాల్గొన్నారు.

రాజకీయ స్వార్థానికే కాపు గర్జన
* మాజీ మంత్రి అరుణ
గజపతినగరం, ఫిబ్రవరి 1: కాపుగర్జన ఉద్యమం రాజకీయ స్వార్థంతో కూడుకున్నదని మాజీ మంత్రి పడాల అరుణ అరోపించారు. సోమవారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అరుణ మాట్లాడుతూ ప్రజలను భయభ్రాంతుల్ని చేసే విధంగా ఉద్యమంలో హింసాత్మక సం ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రణాళికలో హామీల మేరకు కాపులను బిసిలుగా గుర్తించేందుకు బిసి కార్పొరేషన్, కమిషన్లను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేసారు. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కాపునాయకులకు బిసి విషయం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం దురదృష్టకరమని అన్నారు. నిరసనలు తెలియజేసేందుకు పలు రకాల ఉద్యమాలు కలవని అన్నారు. ఎన్నడూ లేని విధంగా ప్రజలను రెచ్చగొట్టి రైళ్లను తగలబెట్టడం ఎంతవరకు సమంజసమని అన్నారు. అన్ని కార్యక్రమాలు ఒకే రోజు జరిగేది కాదు అని ప్రభుత్వం దశలవారీగా కాపు సంక్షేమానికి కృషి చేస్తుందని అన్నారు. ఉత్తరాంధ్ర కాపులను ఏ కేటగిరిలో చేర్చాలని, ఎఫ్ సిలో ఉన్న కాపులను బిసిల్లో చేర్చాలనే ఆలోచన ప్రభుత్వ పరిశీలనలో ఉందని అన్నారు. సాధ్యసాధ్యాలు చూసుకొని ప్రభుత్వం అమలు చేస్తుంది తప్ప అరాచక కార్యక్రమాలతో ఇవన్నీ సాధ్యం కాదన్నారు. సమావేశంలో ఎంపిపి గంట్యాడ శ్రీదేవి, దత్తిరాజేరు మాజీ ఎంపిపి తిరుపతినాయుడు, పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.

వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే జగన్‌పై విమర్శలు
ఎన్నికల హామీలను నెరవేర్చని టిడిపి * మా నాయకుడిని చూసి భయపడే ఆరోపణలు
భవిష్యత్తులో మరిన్ని నిరసనలు ప్రభుత్వం ఎదుర్కొంటుంది * ఎమ్మెల్సీ కోలగట్ల విమర్శ
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, ఫిబ్రవరి 1: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజలను మభ్య పెట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్‌పై, పార్టీ అధినేత జగన్‌పై తప్పుడు ఆరోపణలు చేయటం ఆనవాయితీగా మారిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ బెల్లాన చంద్రశేఖర్ విమర్శించారు. కాపులను బిసిలలో చేరుస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ హామీని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారని ఆరోపిస్తూ, ఆదివా రం తునిలో జరిగిన హింసాత్మక సంఘటనలకు ప్రభుత్వమే బాధ్యతవహించాలని స్పష్టం చేసారు. సోమవారం ఇక్కడ ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వపరంగా ఎన్ని తప్పులు జరిగినా, అనుకోని సంఘటనలు జరిగినా దానికి బాధ్యత జగన్ అం టూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన అనుచరగణం తప్పుడు ఆరోపణలు చేయటం శోచనీయమ ని అన్నారు. విజయవాడలో కాల్‌మనీ వ్యవహారం, చిత్తూరులో టిడి పి నేతల హత్య, రేణిగుంట విమానాశ్రయంలో జరిగిన గొడవ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైన, పార్టీ అధినేతపై బురద చల్లేందుకు టిడిపి ప్రయత్నించిందని చెప్పారు. కాపుల డిమాండ్‌కు తమ పార్టీ మద్దతు ప్రకటించిందని, పార్టీ నాయకులు తుని కార్యక్రమంలో పాల్గొన్నారని, ఈ కారణంగా అక్కడ జరిగిన హింసాత్మక సంఘటనలకు తమ పార్టీని, తమ నాయకుడిని బాధ్యుడిని చేయటం ఏమిటని ప్రశ్నించారు. తుని కార్యక్రమానికి తమ పార్టీ నాయకులే కాకుండా టిడిపికి చెందిన మంత్రుల, ముఖ్యనేతల అనుచరగణం, బిజెపికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ, తదితర నాయకులు కూడా పాల్గొన్నారని, మరి వారిని ఎందుకు బాధ్యులను చేయటం లేదని ప్రశ్నించారు. అధికారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు వేసే నక్కజిత్తులు ప్రజలకు తెలుసని, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎదుటివారిపై ఆరోపణలు చేయటం ఆయనకు సహజమేనని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నాయకుడు జగన్‌ను చూసి చంద్రబాబు భయపడిపోతున్నారని, అందుకే జగన్‌పై అభండాలు వేస్తున్నారని తెలిపారు. సమైఖ్య రాష్ట్రం విషయంలో, ప్రత్యేక హోదా విషయంలో జరగని విధంగా కాపు రిజర్వేషన్ కోసం ఆ వర్గం ఉద్యమం చేస్తుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ వర్గాన్ని బ్లాక్‌మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కాపు గర్జనను విఫలం చేసేందుకు గడచిన కొన్ని వారాలుగా ప్రభుత్వం, టిడిపి ముఖ్యనాయకులు చేయని ప్రయత్నం అంటూ లేదని, కానీ ఆదివారం కాపు గర్జనకు హాజరైన జనాలు ప్రభుత్వ అడ్డంకులను ఖాతరు చేయలేదని స్పష్టం అవుతోందని తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేయటంలో విఫలమైన టిడిపి ప్రభుత్వం భవిష్యత్తులో విద్యార్థి, యువజన, రైతు వర్గాల నుంచి నిరసన ఎదుర్కోక తప్పదని స్పష్టం చేసారు. విలేఖరుల సమావేశంలో పార్టీ కేంద్రలపాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, పార్టీ నాయకులు శ్రీరాములునాయుడు, అప్పలనాయుడు, నడిపెన శ్రీను తదితరులు పాల్గొన్నారు.

కల్వర్టులు, రోడ్ల మరమ్మతులకు చర్యలు
* మున్సిపల్ కమిషనర్ నాగరాజు
విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 1: నగరంలో కల్వర్టులు, రోడ్ల మరమ్మతులకు చర్యలు తీసుకుంటామని నగర పాలక సంస్థ కమిషనర్ జి.నాగరాజు తెలిపారు. నగరంలో 12,14 వార్డులలో సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ బాగోలేదని, రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, వీధిలైట్లు వెలగడం లేదని, మంచి సరఫరా అస్తవ్యస్తంగా ఉందని పలువురు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన కమిషనర్ నాగరాజు మాట్లాడుతూ నగరంలో అనేక సమస్యలు ఉన్నాయని, అన్ని వార్డుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. అయితే ఆయా సమస్యలపై దృష్టి సారిస్తామని, ముఖ్యంగా కల్వర్టులు, రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశిస్తామని అన్నారు. అన్ని వార్డులలోను ప్రధాన కాలువలలో పేరుకుపోయిన పూడికను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, సంవత్సరాల తరబడి పేరుకుపోయిన పూడికను తొలగించడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నా, జెసిబిలతో తొలగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ సుంకరి విజయలక్ష్మి, నగర పాలక సంస్థ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

హింసాకాండకు ప్రభుత్వానిదే బాధ్యత
* మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య
గజపతినగరం, ఫిబ్రవరి 1: తునిలో జరిగిన హింసాకాండకు చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య డిమాండ్ చేసారు. తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కాపులను అణిచి వేయాలనే దోరణి ప్రదర్శించడం వలనే ఈ విధ్వంసానికి కారణం అన్నా రు. ప్రభుత్వం తన వైఫల్యాలు కప్పి పుచ్చుకునేందుకు తమ పార్టీ అధినేత జగన్‌పై బురదజల్లే ప్రయత్నం చేయ డం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ఎమై నా జరిగితే దానికి జగనే కారణమని బాబు మాట్లాడటం తగదని అన్నా రు. కాల్‌మనీ, రాజధానిభూముల వ్యవహారంలోరైతుల ఆందోళన ఏ వ్యవహారమైన జగన్‌పై నెట్టడం చంద్రబాబుకు అలవాటుగా మారింది అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాపులకు ఐదువేలకోట్లు కేటాయిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారని అన్నారు. కాపుల న్యాయమైన కోర్కేలు తీర్చడానికి చంద్రబాబుకు ఉన్న ఇబ్బందులు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేసారు. కాపు గర్జనకు అధికార పార్టీ మంత్రులను ముఖ్యమంత్రి పంపి ఒక స్పష్టమైన హామీ ఇస్తే ఇంతఅవేదన బయటికి వచ్చేది కాదని అన్నారు. సమావేశంలో మాజీ జడ్పీటీసీ గార తౌడు, మండల పార్టీ అధ్యక్షుడు బూడి వెంకటరావు, సొసైటీ అధ్యక్షుడు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఆదర్శ గ్రామంగా కోనమసివానిపాలెం
* ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి
కొత్తవలస, ఫిబ్రవరి 1: మండలంలోని కోనమసివానిపాలెం గ్రామాన్ని ఆదర్శ ప్రాయంగా తీర్చి దిద్దుతామని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు. సోమవారం కోనమసివానిపాలెంలో అభివృద్ధి కార్యక్రమాలకు అమె శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా 50 లక్షల రూపాయల నిధులకు గ్రామంలోని అన్ని వీధులకు సిసిరోడ్డు డ్రైనేజి నిర్మాణం చేపడతామని చెప్పారు. గ్రామ సర్పంచ్ అన్నపూర్ణ, టిడిపి నాయకులు సత్యన్నారాయణ చొరవతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఉపాధిహామి పథకం ద్వారా అభివృద్ధి పనులకు నిధులు సమకుర్చుతామని పంచాయితీ రాజ్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేందుకు గ్రామాస్థులు ముందుకు వచ్చారని ఈ మేరకు అవసరమైన సహకారం అందించామని ఎల్.కోట జడ్పీటిసి ఈశ్వరరావు తెలిపారు. పార్టీలకు అతీతంగా అన్ని గ్రామ పంచాయితీలలో అభివృద్ధి పనులకు నిధులు సమకూర్చామని చెప్పారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం జరిగిందని ప్రజాల సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని సర్పంచ్ అన్నపూర్ణ తెలిపారు. టిడిపి మండల నాయకులు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
నిరసన తెలిపే పద్ధతి ఇది కాదు
ప్రజలు వారిహక్కులు, డిమాండ్ల సాధనకు నిరసనలు తెలియజేసే పద్ధతులు చాలా ఉన్నాయని, అలాకాకుండా హింసాత్మక చర్యలకు పాల్పడటం సరికాదని ఎస్.కోట ఎమ్మెల్యే లలితకుమారి అన్నారు. ఆదివారం తునిలో జరిగిన సంఘటనపై ఆమె స్పందిస్తూ కాపుగర్జన సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక సంఘటన మంచిదికాదని, రాజకీయ విజ్ఞత ఉన్న నాయకులు అటువంటి దుశ్చర్యలకు పాల్పడరని చెప్పారు. కులం పేరుతో ప్రజలను రెచ్చగొట్టవద్దని, అభివృద్ధి విషయంలో మాత్రమే పోటీ పడాలని అన్నారు.

రాజాంలో విద్యార్థి మృతి
మృతుడి బంధువుల ఆందోళన
అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు కేసు నమోదు
రాజాం, ఫిబ్రవరి 1:రాజాంలోని జిఎన్‌ఆర్ కళాశాల పై అంతస్థులో ఓ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘన రాజాం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిం ది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయనగరం జిల్లా తెర్లాం మండలం రాముడువలసకు చెందిన ఈ విద్యార్థి మరిచర్ల తేజ(20) బిఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇతడు ఎప్పటిలాగే కళాశాలకు ఉదయం 7.30 సమయంలో కళాశాలకు వచ్చా డని తోటి విద్యార్థులు చెబుతున్నారు. అయితే సుమారు 9 గంటల ప్రాంతంలో ఈ విద్యార్థి పై అంతస్థులోని భోజనశాలలో ఒక వైరుతో మెడకు ఉరివేసుకుని వేలాడుతూ మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. విషయం తెలుసుకున్న మృతుడి బంధువులు కళాశాలకు చేరుకుని ఇది ఆత్మహత్య కాదని, హత్యేనని తల్లిదండ్రులు అప్పలనాయుడు, కమల, బంధువులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు. రాజాం సిఐ శంకరరావు సారధ్యంలో ఎస్సైలు, సిబ్బంది అక్కడకు చేరుకుని మృతుని బంధువులకు నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ సాయంత్రానికి కూడా సమస్య కొలిక్కి రాలేదు. ఇప్పటికీ మృతదేహం యథాస్థితిలో ఉండటంతో కళాశాల పరిసర ప్రాంతా ల్లో నివసిస్తున్న వారు భయాందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో డాగ్‌స్వ్కాడ్ రంగ ప్రవేశం చేసి కళాశాలలోని అన్ని గదులను నిశితంగా పరిశీలించారు. ఇది హత్య ఆత్మహత్యా అనే నిజాలు పిఎంలో తేలుతుందని పోలీసులు వివరిస్తున్నప్పటికీ మృతుడు కుటుంబ సభ్యులు శాంతించలేదు. అనుమానస్పద కేసు కింద నమోదు చేస్తున్నామని సిఐ శంకరరావు తెలిపారు.

ప్రశాంతినగర్‌లో తాగునీటి సమస్య పరిష్కరించండి
‚* కమిషనర్‌కు స్థానికుల వినతి
విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 1: నగరంలో 17వ వార్డు పరిధిలో ప్రశాంతినగర్‌లో మంచినీటి ఎద్దడి ఏర్పడిందని, మంచినీటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నామని పలువురు మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ బొద్దాన అప్పారావుఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం నగర పాలక సంస్థ కమిషనర్ నాగరాజుకు ఒక వినతిపత్రాన్ని అందజేశారు. మంచినీటి సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ చైర్మన్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. వేసవి రాక ముందే మంచినీటి ఎద్దడి ఏర్పడటంతో ముందస్తు చర్యలు చేపట్టాలని విన్నమించుకున్నా ఖాతరు చేయడం లేదని వాపోయారు. గత కొన్నినెలల నుంచి కుళాయిల ద్వారా మంచినీరు సక్రమంగా సరఫరా కావడం లేదని, దూర ప్రాంతాలకు వెళ్లి మంచినీటిని తెచ్చుకోవలసి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతీ ఏటా ప్రశాంతినగర్ కాలనీ వాసులు మంచినీటి కోసం పడుతున్న ఇబ్బందులను పాలకులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మూడవ విడత జన్మభూమిలో కూడా మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్, అధికారులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా మంచినీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా అధ్యక్షుడు వి.కృష్ణంరాజు, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు రెడ్డి శంకరరావుతదితులు పాల్గొన్నారు.