విజయనగరం

వివాదంలో గురజాడ స్మారక నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మే 15: తెలుగు జాతి గర్వించదగ్గ మహాకవి గురజాడ అప్పారావు పేరిట స్మారక భవనాన్ని విజయనగరంలో నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. మహాకవి గురజాడ సమాజానికి అందించిన కన్యాశుల్కం నాటకాన్ని రచించి, మహాకవి నివసించిన స్వగృహం పక్కనే సర్వే నెం.499/1లో 806 చదరపు గజాల విస్తీర్ణంలో స్మారక భవనాన్ని నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్న తరుణంలో వివాదం చోటుచేసుకోవడం గురజాడ అభిమానులను, సాహితీవేత్తలను కలచివేసింది. మహాకవి గురజాడ అప్పారావు మెమోరియల్(స్మారక) భవనం నిర్మాణానికి గురజాడ అప్పారావుకు చెందిన కుటుంబ సభ్యులు 806 చదరపుగజాల విస్తీర్ణం భూమిని ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఈ స్థలానికి బదులుగా ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం కూడా గురజాడ కుటుంబ సభ్యుల ప్రతిపాదనకు సుముఖత వ్యక్తం చేసి ఇందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా కలెక్టర్, మండల తహశీల్దార్, మున్సిపల్ కమిషనర్‌లు ఇచ్చిన నివేదికలో మున్సిపాలిటీ సర్వే నెం.14లో పురపాలక స్థలం 45సెంట్లుభూమిని గురజాడ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. అయితే ఇక్కడే వివాదానికి తెరలేచింది. మున్సిపల్ కౌన్సిల్‌కు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు తీసుకున్న చొరవ కారణంగా ప్రతిపాదించిన ఇంటి స్థలం గతంలో వేరే అవసరాలకు కేటాయించాలని కౌన్సిల్‌లో నిర్ణయించిన విషయం పరిగణనలోకి తీసుకోకుండా చేసిన ప్రతిపాదనను మున్సిపల్ కౌన్సిల్ పాలక వర్గం 9న జరిగిన సమావేశంలో తిరస్కరించింది.మున్సిపల్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని రచయితలు, సాహిత్య అభిమానులు, పౌరవేదిక సభ్యులు తీవ్రంగా పరిగణించారు. కౌన్సిల్ తీసుక్నున నిర్ణయం సహేతుకంకాదని మహాకవిని గౌరవించేవిధంగా వ్యవహరించాల్సిన సమయంలో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం వారిని తీవ్రంగా కలచివేసింది. మహాకవి గురజాడ స్మారక భవనం నిర్మాణంలో ఎటువంటి రాజీలేదని గురజాడ కుటుంబ సభ్యులకు ప్రత్యామ్నా స్థలం కేటాయిస్తామని పురపాలక సంఘం స్పష్టంచేసింది. కౌన్సిల్‌కు సరైన సమాచారం లేకుండా జిల్లా యంత్రాంగం తీసుకున్న నిర్ణయం వివాదాలకు కారణమైంది. జిల్లా యంత్రాంగం, మున్సిపల్ పాలక వర్గం చర్చించి నిర్ణయించి ఉంటే ఇటువంటి పరిస్థితి వచ్చి ఉండేదికాదని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. ఈవివాదానికి తెరదించేందుకు మున్సిపల్ పాలకవర్గం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. త్వరలోనే గురజాడ కుటుంబ సభ్యులకు ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయిస్తామని మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ వెల్లడించారు.