విజయనగరం

చేపల చెరువుల నిర్వహణ మహిళలదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మే 17: జిల్లా మత్స్య పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా మత్స్య సహకార సంఘాలు నిర్వహిస్తున్న చెరువులను మినహాయించి జిల్లాలోని మిగిలిన చెరువులను డ్వాక్రా సంఘాలకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎంఎం నాయక్ తెలిపారు. జిల్లాలో ఉన్న ఏడువేల చెరువులలో మహిళా సంఘాలకు ఎన్ని చెరువులు ఇచ్చే అవకాశం ఉందో గుర్తించాలని చెప్పారు. మంగళవారం పంచాయతీరాజ్ శాఖ ఇఓఆర్‌డి, ఎపిఎంలతో మంగళవారం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మండలంలో మహిళాసంఘాలతో నిర్వహించే చెరువులను గుర్తించాలని, పారదర్శకంగా, చురుకుగా పనిచేస్తున్న గ్రూపులకు ఈ చెరువులను అప్పగించాలని కలెక్టర్ సూచించారు. మహిళా సంఘాలకు లాభాలు చేకూరేలా కనీస ధరకు చెరువులను అప్పగించాలని అన్నారు. సాగునీటికి ఇబ్బంది కలగకుండా ఉండే చేపల చెరువులను గుర్తించి గ్రామ పంచాయితీలు తీర్మానాలు చేసి డ్వాక్రా సంఘాలకు అప్పగించాలని చెప్పారు. ఇఓ పిఆర్‌డి, ఎపిఎంలు కలసి వచ్చే సోమవారంలోగా చెరువుల జాబితాలను అందచేయాలని ఆదేశించారు. అవసరమైతే మైక్రో ఇరిగేషన్ అధికారులను కూడా సంప్రదించాలని, మత్స్య అభివృద్ధి అధికారుల సహకారంతో త్వరగా చెరువులను గుర్తించాలని చెప్పారు. సమావేశంలో డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ ఢిల్లీరావు, మత్స్యశాఖ సహాయ సంచాలకులు ఫణిప్రకాష్, జిల్లా పంచాయతీ అధికారి సత్యనారాయణరాజు పాల్గొన్నారు.