విజయనగరం

టీడీపీ అభివృద్ధి పథకాలే మా విజయానికి సోపానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామభద్రపురం, ఏప్రిల్ 9: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమపథకాలే టీడీపీ అభ్యర్థులకు శ్రీరామరక్ష అని బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ఆర్‌వి సుజయ్‌కృష్ణరంగారావు అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం టీడీపీ నాయకులు చింతల రామకృష్ణ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్నివర్గాల ప్రజలకు మేలు చేసిందన్నారు. ముఖ్యంగా రైతులకు రుణమాఫీ వంటి సాహాసోపేతమైన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి తీసుకున్నారన్నారు. అలాగే యువనేస్తం కింది యువతకు సహాయం, డ్వాక్రా మహిళలు, వృద్ధులకు రెట్టింపు పింఛన్లు అందించారన్నారు. జిల్లాలోనే ఏ నియోజకవర్గంలో చేయనివిధంగా 6వేల పక్కా ఇళ్లు బొబ్బిలి నియోజకవర్గంలో మంజూరుచేయించామన్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 2వేల పింఛన్లు మంజూరుచేస్తే బొబ్బిలి నియోజకవర్గంలో 3వేల పింఛన్లు మంజూరు చేయించామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వౌళిక సౌకర్యాలకు పెద్దపీట వేశామన్నారు. సాగు, తాగునీటి కోసం అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న సాహాసోపేతమైన నిర్ణయాల వలన దేశంలోనే టీడీపీకి మంచి పేరు వచ్చిందన్నారు. ప్రస్తుతం శరవేగంగా నిర్మాణమవుతున్న అమరావతి, ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన పోలవరం పూర్తికావాలంటే మరలా చంద్రబాబునాయుడే ముఖ్యమంత్రి కావల్సిన ఆవస్యకత ఎంతైన ఉందని టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చింతల రామకృష్ణ అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం ప్రాముఖ్యత ఇచ్చిందన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి రాష్ట్ర నిదులతోపాటు తమ సొంత నిదులను ఖర్చు చేస్తున్న బొబ్బిలి రాజులను భారీ మెజార్టీతోగెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, వేలాదిమంది టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

సుజయ్‌నాయనకు ఘనస్వాగతం
ప్రచారాలకు చివరి రోజైన మంగళవారం రామభద్రపురంలో సుజయ్‌కృష్ణరంగారావుకు టీడీపీ నాయకులు చింతల రామకృష్ణ, చింతల వసుంధర ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి మహిళలు వీరతిలకం దిద్ది హారతులు ఇచ్చారు.

రాజన్న రాజ్యం రావాలంటే జగన్‌తోనే సాధ్యం
మక్కువ, ఏప్రిల్ 9: రాజన్నరాజ్యం రావాలంటే వైఎస్ జగన్మోహనరెడ్డితోనే సాధ్యపడుతుందని మండల వైసీపీ కన్వీనర్ మావుడి రంగునాయుడు అన్నారు. ఈమేరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ఎంపీపీ శ్రీనివాసులనాయుడు, తిరుపతినాయుడుల ఆధ్వర్యంలో మంగళవారం వైసీపీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించేందుకే జగన్మోహనరెడ్డి నవరత్నాల పథకాలను ప్రవేశపెట్టారన్నారు. టీడీపీ పాలనతో ప్రతీ ఒక్కరూ విసిగిపోయారని, ముఖ్యమంత్రి చంద్రబాబు మోసపూరిత మాటలను ఇకపై ఎవరూ నమ్మరన్నారు. వైఎస్ జగన్మోహనరెడ్డి తన మేనిఫెస్టోలో ఆమోదయోగ్యమైన పథకాలను ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్రంలో అవినీతి పాలనను అంతమొందించాలని, ఇందుకోసం ఓటర్లంతా ఫ్యాన్ గుర్తుకే ఓటువేసి వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిని చేయాలన్నారు. టీడీపీ హయాంలో సంక్షేమపథకాలు, అభివృద్ధి పనులు పచ్చచొక్కాలకే పరిమితమయ్యాయన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే ఎమ్మెల్యే అభ్యర్థి రాజన్నదొరను, ఎంపీ అభ్యర్థి మాదవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు నిరుపేదలకు అనుకూలంగా ఉన్నాయని, అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు పసుపుకుంకుమ కింద 75వేల రూపాయలు, పింఛన్లును 3వేల రూపాయలు అందిస్తారన్నారు. కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

జగనన్నకు కానుకగా ఇచ్చేందుకు నన్ను ఆశీర్వదించండి
*వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి జోగారావు
పార్వతీపురం, ఏప్రిల్ 9: నేడు జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఆశీర్వదించి గెలిపించాలని వై ఎస్ ఆర్ సి పి పార్వతీపురం అసెంబ్లీ అభ్యర్థి అలజంగి జోగారావుఓటర్లను అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన మంగళవారం పార్వతీపురం నియోజకవర్గకంలోని బలిజిపేట మండలలోని బలిజిపేట, పలగర తదితర పలు గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ భారీ ర్యాలీకి ప్రజల నుండి విశేష ఆదరణ లభించింది. ఈ సందర్భంగా వై ఎస్ ఆర్ సిపి అసెంబ్లీ అభ్యర్థి జోగారావు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ప్రజలు చూపిన ఆదరణ మరువలేనిదన్నారు. నియోజకవర్గంలోని పార్వతీపురం పట్టణ ప్రజలే కాకుండా, సీతానగరం, బలిజిపేట మండలాలకు చెందిన ప్రజలు తమ ప్రచారంలో తమ పార్టీపట్ల, తన పట్ల చూపిన ఆదరణనే తనను గెలిపిస్తుందన్న నమ్మకం మరింత బలపడిందన్నారు. వై ఎస్ ఆర్ సిపి రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహనరెడ్డికి తనను కానుకగా పంపించి జగనన్నను ముఖ్యమంత్రిగా చేయడానికి తమ ఆశీర్వాదం అందించాలని విజ్ఞప్తి చేశారు. తమ పార్టీ మానిఫెస్టోలో నవరత్నాలు పేద ప్రజలకే కాకుండా అన్ని వర్గాల అభ్యున్నతికి దోహదపడతాయన్నారు. ఈర్యాలీ ప్రచార కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజాదరణ ఏర్పడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి జోగారావుకు మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ఈకార్యక్రమంలో వైకాపా నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పలువురు పాల్గొన్నారు.