విజయనగరం

ఆకట్టుకున్న ‘ప్రతిఘటన’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (పూల్‌బాగ్),మే17: పట్టణంలోని కణపాక చెన్నారెడ్డి కాలనీలో నల్లమారమ్మ చదురువద్ద సినీ, రంగస్థల కళాకారుడు ఆర్. అప్పలనాయుడు వర్ధంతిని పురస్కరించుకుని శ్రీనివాసా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో మంగళవారం ప్రదర్శించిన ప్రతిఘటన వీధినాటిక ఆకట్టుకుంది. విద్యలేని గిరిజన, ఆదివాసీలను గ్రామపెద్దలు ఏవిధంగా మోసంచేస్తారో ఈనాటికలో తెలిపారు. వారి మోసాలను విద్యావంతుడు ఏవిధంగా బయటపెట్టాడో స్పష్టంగా చెప్పారు. రామానాయుడు రచించి దర్శకత్వం వహించిన ఈనాటికలో నటీనటులు పాత్రోచితమైన నటనను ప్రదర్శించారు. కాలనీవాసులు ఈనాటికను తిలకించారు.