విజయనగరం

నవనిర్మాణ దీక్షకు స్పందన నిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూన్ 3: రాష్ట్రప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న నవనిర్మాణ దీక్ష కార్యక్రమం పూర్తిగా విఫలమైందని, ప్రజలు ఈ కార్యక్రమంపై ఆసక్తి చూపడంలేదని వై ఎస్సార్ కాంగ్రెస్ నాయకులు మజ్జి శ్రీనివాసరావు, యడ్ల రమణమూర్తి, గౌరీశంకర్, అవనాపువిజయ్ చెప్పారు. శుక్రవారం ఇక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు గుప్పించిన టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలకు భిన్నంగా వ్యవహరిస్తూ అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ కారణంగా నవనిర్మాణ దీక్షల విషయంలో ప్రజల నుంచి స్పందన కొరవడిందని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే, పూరైన పనులకు ప్రారంభోత్సవాలు చేసి అది తమ ఘనతగా ముఖ్యమంత్రి, మంత్రులు, టిడిపి నాయకులు చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. తోటపల్లి, తారకరామతీర్థసాగర్ పనులను ఈ రెండేళ్లల్లో ఎందుకు పూర్తిచేయలేకపోయారని ప్రశ్నించారు. గృహనిర్మాణ పథకం రెండేళ్ల నుంచి మూలనపడిందని, అంతర్జాతీయ విమానాశ్రయం పేరిట భోగాపురం మండలంలో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నారని విమర్శించారు. జూట్, ఫెర్రో పరిశ్రమలు మూతపడి వందలాది మంది కార్మికులు రోడ్డున పడితే మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడంలేదని, పరిశ్రమల యజమానులతో లాలూచి పడి వాటాలకోసం బేరాసారాలు జరుపుతున్నారని ఆరోపించారు. నీటి వనరుల శాఖలో పంపకాల కోసం టిడిపి నాయకులు పోటీలు పడుతున్నారని చెప్పారు. బాబుహయాంలో తమకు ఒరిగింది ఏమీలేదనే అభిప్రాయంతో జిల్లా ప్రజలు నవనిర్మాణ దీక్షలను పట్టించుకోవడంలేదని చెప్పారు.