విజయనగరం

ఎన్‌ఆర్‌ఐల భాగస్వామ్యంతో ‘స్మార్ట్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, నవంబర్ 28: స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ఎన్‌ఆర్‌ఐలను భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలెక్టర్లకు సూచించారు. హైద్రబాద్ నుండి శనివారం నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాల నుంచి కలెక్టర్ ఎంఎం నాయక్, జాయింట్ కలెక్టర్ రామారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు అంతర్గత రహదారుల నిర్మాణంతోపాటు మంచినీటి పథకాలకు ప్రభు త్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. నదుల అనుసంధానం కార్యక్రమం కింద అన్ని చెరువులను నీటితో నింపే కార్యక్రమాన్ని విస్తృతం చేస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలలో వౌలిక సదుపాయాల ఏర్పాటుకు ఉపాధిహామీ పథకం కింద వచ్చే నాలుగు నెలల్లో ఐదువేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పారు. ఈ ఏడాది అభివృద్ధి రేట్ లక్ష్యాన్ని 10.83శాతంగా తీసుకోగా మొదటి మూడునెలల్లో 9.72 అభివృద్ధి రేట్ సాధించడం అభినందనీయమని అన్నారు. పర్యటకరంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా విదేశీ పర్యటకులను అకర్షించేందుకు పెద్దఎత్తున చర్యలు చేపడుతున్నామని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం కోసం రూపొందించిన ప్రణాళికలను సకాలంలో అమలు చేయడంపై కలెక్టర్లు దృష్టి పెట్టాలని సూచించారు.

మొక్కల పెంపకంతో
కాలుష్యానికి కళ్లెం

* మున్సిపల్ చైర్మన్ రామకృష్ణ
విజయనగరం (్ఫర్టు), నవంబర్ 28: పర్యావరణ పరిరక్షణ కోసం విరివిగా మొక్కలు నాటాలని మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ కోరారు. పట్టణంలో నాలుగవ వార్డు పరిధిలో పూల్‌భాగ్ బిట్-2లో శనివారం వనమహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ పెరుగుతున్న పర్యావరణ, వాతావరణ కాలుష్యానికి కళ్లెం వేయాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మొక్కలను నాటాలని తెలిపారు. నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పారు. మొక్కలను నాడటం ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చునని అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఖాళీ స్థలాలలో మొక్కలను నాటేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత ఏడాది హుదూద్ తుపాను సృష్టించిన బీభత్సం వల్ల అపారపరమైన వృక్ష సంపద నేలమట్టమైందని అన్నారు. వృక్ష సంపద లేకపోవడం వల్ల పర్యావరణ పరంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొన వలసి వస్తుందని, అందువల్ల ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ కిల్లాన పార్వతి, తెలుగుదేశం నాయకులు కిల్లాన మహేశ్వరరావు, వెలిచేటి బాబూరావుతదితరులు పాల్గొన్నారు.

మహిళ దారుణ హత్య?
కూరగాయల తోటలో కాల్చివేసిన దుండగులు
అత్యాచారం చేసి హతమార్చినట్లు అనుమానం
రామభద్రపురం, నవంబర్ 28: మండల కేంద్రంలోని సోంపురం వెళ్లే రహదారిలో పంట పొలాల మధ్య ఒక మహిళను దారుణంగా హత్యచేసి కాల్చివేసిన సంఘటన వెలుగుచూసింది. పోలీసులు అందించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ మేరకు రామభద్రపురంన కు చెందిన మామిడి అప్పన్న కూరగాయల తోట లో 25 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళను హత్యచేసి నిప్పంటించడంతో సగం కాలిన మృతదేహం లభ్యమైంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. మృతురాలు శరీరంపై బట్టలతో పాటు చేతులకు గాజులు కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కాగా ఈ సంఘటనపై స్థానికులు మహిళపై అత్యాచారం చేసి అనంతరం హతమార్చినట్టు భావిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పార్వతీపురం ఇన్‌చార్జ్ డిఎస్పీ కృష్ణప్రసన్న పరిశీలించారు. అలాగే విజయనగరం నుంచి క్లూస్‌టీంను కూడా రప్పించి సంఘటనా స్థలం వద్ద పరిశీలిస్తున్నారు. ఈమె పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సగం కాలి ఉన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాడంగి పిహెచ్‌సికి తరలించినట్టు ఎస్‌ఐ కె.దేముడునాయుడు తెలిపారు.

సెట్ టాప్ బాక్సులపై విస్తృత ప్రచారం చేయండి
* ఎంఎస్‌ఒలకు సూచించిన జెసి
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, నవంబర్ 28: జిల్లాలోని కేబుల్ టివి కనెక్షన్లు ఉన్న వినియోగదారులు డిసెంబర్ 31వ తేదీలోగా తప్పని సరిగా సెటాప్ బాక్సులు ఏర్పాటు చేసుకునేలా కేబుల్ టివి నిర్వాహకులు విస్తృత ప్రచారం నిర్వాహించాలని జాయింట్ కలెక్టర్ రామారావు తెలిపారు. శనివారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్‌లో జెసి రామారావు జిల్లాలోని వివిధ ప్రాంతాలక చెం దిన ఎంఎస్‌ఓలతో సమావేశమై సెటాప్ బాక్సు ల ఏర్పాటుపై చర్చించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ టెలివిజన్ నెట్ వర్క్‌ను డిజిటలైజేషన్ చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా నాణ్యమైన రికార్డింగ్, ప్రసారాలకోసం సెటాప్ బాక్సు లు టివిలకు అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వ టెలివిజన్ నెట్‌వర్కు విభాగం ఆదేశాలను జారీ చేసిందని చెప్పారు. వేయి నుంచి 1500 రూపాయలు విలువ చేసే ఈ సెటాప్ బాక్సులను బహిరంగా మార్కెట్‌లో గాని, డీలర్లనుంచి కాని వినియోగదారులు కొనుగోలు చేసుకోవచ్చని చెప్పారు. కేబుల్‌టివి అపరేటర్లు కనెక్షన్లు ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి సెటాప్ బాక్సులపై వినియోగదారులకు అవగాహన కల్పించాలని చెప్పారు. సెటాప్ బాక్సుల ఏర్పాటుకు ప్రతివారం సమావేశాలు నిర్వహించాలని, కంట్రోల్ రూం ఏర్పాటు చేసుకుని టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని అన్నారు. సెటాప్ బాక్సుల ఏర్పాటుపై ప్రతి రెండురోజులకు ఒకసారి నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు.కొత్తగా కేబుల్ టివి కనెక్షన్లు తీసుకునే వారికి సెటాప్ బాక్సుతో కలిపి కనెక్షన్ ఇవ్వాలని, పాత వినియోగదారులు డిసెంబర్ 31లోగా సెటాప్ బాక్సులు తప్పని సరిగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసారు. సెటాప్ బాక్సులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సెటాప్ బాక్సుల ఏర్పాటు, విక్రయాల విషయంలో రెవెన్యూ, పోలీస్, వాణిజ్య పన్నులశాఖ అధికారులు తనిఖీలు నిర్వాహిస్తారని, పొరపాట్లు జరిగినట్లు తెలితే కఠిన చర్యలు తీసుకంటారని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జితేంద్ర, విజయనగరం వెంకటరత్నం, వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ రామారావు, సమాచార శాఖ డిప్యూటీ ఇంజనీర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

660 హెక్టార్లలో వరి పంట నష్టం
* జిల్లా అధికారులకు నివేదికలు అందించిన వ్యవసాయశాఖ
బొబ్బిలి (రూరల్), నవంబర్ 28: మండలంలో ఈ ఏడాది 6వేల 215 హెక్టార్లలో రైతులు వరినాట్లు వేయగా ఇందులో 660 హెక్టార్లలో పూర్తిగా వరిపంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ సర్వే ద్వారా గుర్తించింది. ఈ మేరకు నష్టానికి సంబంధించిన వివరాలను జిల్లా అధికారులకు పంపించామని వ్యవసాయశాఖాధికారి శ్యాంసుందరరావు తెలిపారు. శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ 660 హెక్టార్లలో 2వేల 210 మంది రైతులు వరిపంట నష్టపోయినట్టు తెలిపారు. చింతాడ, గొంగాడవలస, సిహెచ్.బొడ్డవలస, ఎ.వెలగవలస, కమ్మవలస, శివడవలస, రాముడువలస, కాశిందొరవలస, కృష్ణాపురం గ్రామాలకు చెందిన రైతులు అధికంగా పంట నష్టపోయారన్నారు. మండలానికి 20 క్వింటాళ్ల మినుములు, 15 క్వింటాళ్ల పెసలు వచ్చాయన్నారు. 33 శాతం రాయితీపై మినుములు కేజి 102 రూపాయలకు, కేజి 72 రూపాయలకు పెస లు రైతులకు అందించ డం జరుగుతుందన్నా రు. అవసరమైన రైతులు పాసుపుస్తకం తీసుకొని రావాలన్నారు. అదే విధంగా 1010 రకం వరి విత్తనాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అవగాహనతోనే అన్యోన్య దాంపత్యం
విజయనగరం(టౌన్), నవంబర్ 28: భార్యాభర్తల మధ్య నెలకొనే చిన్నచిన్న తగవులకు పరిష్కారం తెలుసుకుంటే అన్యోన్య దంపతులుగా జీవించ వచ్చ ని పోలీస్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ కేంద్రం సైకాలజిస్టు గోటేటి హిమబిందు చెప్పారు. మహిళా పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫ్యామిలీ కౌన్సిలింగ్ స్టేషన్‌కు శనివారం ఆరుజంటలకు సంబంధించిన కుటుంబ తగాదాలు వచ్చాయి. వాటిని ఆసాంతం విన్న తరువాత ఫ్యామిలీ కౌన్సిలింగ్ సైకాలజిస్టు గోటేటి హిమబిందు మాట్లాడుతూ భార్యాభర్తల మధ్య నెలకొనే తగాదాలను కుటుంబంలోని పెద్దలు కూర్చుని సమస్య పరిష్కరించుకోవాలని, అనవసర జోక్యం తల్లిదండ్రులకు కూడదని చెప్పారు. నిదానంగా ఆలోచిస్తే దాంపత్యం కలకాలం సఖ్యతగా ఉంటుందని వారికి నచ్చచెప్పారు. చిన్న కారణాలతో తగవులు పడటం మంచిది కాదని ఆయా జంటలకు హితవు పలికారు. ఇద్దరి మధ్య పరస్పర అవగాహన అవసరమని స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ కేంద్రం డిఎస్పీ కుమారస్వామి, సైకాలజిస్టు సూర్యనారాయణ, సామాజిక కార్యకర్తలు జగన్నాథం, హైమావతి, న్యాయ సలహాదారు రజని తదితరులు పాల్గొన్నారు.

అరెస్టులతో ఉద్యమాలను అణచలేరు
మా నాయకుడిని విడుదల చేయకుంటే ఆందోళన: సిపిఐ
విజయనగరం(టౌన్),నవంబర్ 28: అరెస్ట్‌లతోఉద్యమాలను అణచివేయలేరని అక్రమంగా పోలీసులు నిర్బంధించిన భూపరిరక్షణకమిటీ జిల్లాకోకన్వీనర్ ఎ.జగన్మోహన్‌రావును వెంటనే విడుదల చేయాలని అఖిలపక్ష పార్టీలనాయకులుప్రభుత్వాన్నిడిమాండ్‌చేసారు. శనివారం సిపిఎం పార్టీ కార్యాలయం ఎల్‌బిజి భవన్లోనిర్వహించిన అఖిలపక్ష సమావేశంలోఅక్రమ అరెస్టులను తీవ్రంగాఖండించారు.పోలీసుల నిర్భంధంలోఉన్న జగన్‌నువెంటనే విడుదల చేయాలని అఖిలపక్ష సమావేశం డిమాండ్ చేసింది. భోగాపురం మండలం బైరెడ్డిపాలెం సమీపంలోశుక్రవారం సాయంత్రం ఎస్సై దీనబంధు భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి వ్యతిరేఖంగా పోరాడుతున్న భూపరిరక్షణ కమిటీ కోకన్వీనర్ జగన్‌నుఎటువంటి కారణం లేకుం డా అక్రమంగానిర్బంధించిన చర్య అప్రజాస్వామికమని సమావేశం ఖండించింది. తక్షణం జగన్‌నువిడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈసమావేశంలోసిపిఎం జిల్లా కార్యదర్శితమ్మినేనిసూర్యనారాయణ, సిపిఐ జిల్లాకార్యవర్గ సభ్య డు బుగతసూరిబాబు, ఎఐఎఫ్‌టియు నాయకుడురెడి నారాయణరావు, కాం గ్రెస్ పార్టీ ఎస్సీసెల్ అధ్యక్షుడుబుంగభానుమూర్తి, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీనాయకుడు అంబళ్లశ్రీరాములునాయుడు, భోగాపురం ఎయిర్ పోర్టు వ్యతిరేక కమిటీ నాయకుడు దాట్ల శ్రీనివాసరాజు, లోక్‌సత్తా పట్టణ ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు, సిపిఐఎంఎల్ న్యూడెమాక్రసీ నాయకుడు ధవళ లక్ష్మణరావు పాల్గొన్నారు. జగన్ విడుదల చేయాలని కోరు తూ ఎస్పీకి వినతి అందచేసారు.

‘సమాజ సేవపై దృష్టి సారించాలి’
విజయనగరం (్ఫర్టు), నవంబర్ 28: చదువుతోపాటు సమాజ సేవపై కూడా ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు దృష్టి సారించాలని మహారాజా కళాశాల ప్రిన్సిపాల్ ఎల్.రవికుమార్ అన్నారు. మహారాజా కళాశాలలో జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) జిల్లాస్థాయి యువజనోత్సవాలు శనివారం ముగిసాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీలలో నాలుగు జోన్‌లకు చెందిన ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్, దేశభక్తి గీతాలు, ముగ్గుల పోటీలు, సంప్రదాయ నృత్యం, జానపదం తదితర పోటీలను నిర్వహించారు. అనంతరం విజేతలకు కళాశాల ప్రిన్సిపాల్ రవికుమార్ బహుమతులను అందజేశారు.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు సామాజిక సేవపై కూడా దృష్టి సారించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని, నైపుణ్యాలను పెం పొందించుకోవాలని ఆయన కోరారు. ఈ విధంగా చేస్తే భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ సేవాపథకం జిల్లా సమన్వయకర్త డాక్టర్ చప్ప సూర్యనారాయణ, ఎన్‌ఎస్‌ఎస్ సమన్వయకర్తలు డి.ఎరుకనాయుడు, డి.సన్యాసిరావు,చంద్రశేఖర్, సత్యనారాయణ, రామారావు, కల్యాణ అశోక్, సామాజిక కార్యకర్త అబ్దుల్ రవూఫ్ పాల్గొన్నారు.

వైసిపి నేత దుర్మరణం
* గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి
బొండపల్లి, నవంబర్ 28: మండలంలోని నెలివాడ రాతి చెరువు వంతన వద్ద శనివారం ఉదయం జాతీయ రహదారిపై లోగిస గ్రామానికి చెందిన వైసిపి నాయకుడు లోగిస బంగారు నాయుడు (43) మృతి చెం దాడు. విజయనగరంలో వ్యక్తిగత పనులపై ద్విచక్ర వాహనంపై వెళుతుండగా గుర్తుతెలియని వాహనం బంగారునాయుడు తలపై నుండి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బంగారునాయుడుకు చెందిన ద్విచక్ర వాహనం వంతెన చివరి గట్టుపై పడి ఉండగా మృతదేహం సుమారు 30 అడుగుల దూరంలో రహదారి మధ్యలో పడి ఉంది. గుర్తు తెలియని వాహనం ఢీ కొన్నందునే తన భర్త మృతి చెంది ఉండవచ్చు అతని భార్య అమ్మనమ్మ బొండపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృత దేహాన్ని శవపరీక్షకు గజపతినగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి ఎస్సై తారకేశ్వరరావు తరలించారు. వైకాపా నాయకులు, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు వచ్చి మృతిని భార్య అమ్మనమ్మను పరామర్శించారు. శవ పరీక్ష అనంతరం మృతదేహాన్ని గజపతినగరంమండలంలోని లోగిస గ్రామానికి తరలించారు. బంగారునాయుడు మృతి పట్ల వైసీపి నాయకులు మండల సురేష్, గార తౌడు, సంజీవరావు, ఆదినారాయణ తదితరులు సంతాపం వ్యక్తం చేసారు. బొండపల్లి ఎస్సై తారకేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంగారునాయుడు మృతి పై గ్రామస్థులు అనుమానాలు వ్యక్తం చేసి సమగ్రంగా దర్యాప్తు జరపాలని కోరుతున్నారు.