విజయనగరం

‘బడి బయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), జూలై 3: పట్టణంలో బడిబయట ఉన్న పిల్లలను పాఠశాలలలో చేర్పించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ తెలిపారు. 13వ వార్డు పరిధిలో కాటవీధి మున్సిపల్ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, పుస్తకాలను ఆదివారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ బడిఈడు వయస్సు కలిగిన పిల్లలను గుర్తించి పాఠశాలలలో చేర్పించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. ప్రతి ఒక్కరికి విద్యను అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చేందుకు ఉపాధ్యాయులు తగిన శ్రద్ద వహించాలని అన్నారు. మున్సిపల్ పాఠశాలలలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పారు. అన్ని పాఠశాలలలో వౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాఠశాలలలో మంచినీటి సౌకర్యంతోపాటు మరుగుదొడ్లను కూడా నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ కనకల మురళీమోహనరావు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.