విజయనగరం

మొక్కల నాటి సంరక్షించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), జూలై 3: మొక్కలను సంరక్షించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఎమ్మెల్యే గీత కోరారు. పట్టణంలో పూల్‌బాగ్‌లో ఆదివారం మొక్కలను నాటే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా గీత మాట్లాడుతూ మొక్కలను నాటితే సరిపోదని, వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని తెలిపారు. పెరుగుతున్న వాతావరణ కాలుష్యానికి కళ్లెం వేయాలం టే మొక్కలను నాటాలని కోరారు. వాటి పెంపకంపై కూడా దృష్టి సారించాలని తెలిపారు. విజయనగరం పట్టణంతోపాటు రూరల్ మండలంలో కూడా మొక్కలను నాటేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. మున్సిపల్ పార్కులు, పాఠశాలలు, ఇతర స్థలాలతోపాటు గ్రామాలలో చెరువు గట్లుపై కూడా విరివిగా మొక్కలను నా టేందుకు ఏర్పాట్లు చేశామని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆమె కోరారు. పచ్చదనం-పరిశుభ్రతకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇచ్చినందున కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ కనకల మురళీమోహనరావు, కమిషనర్ జి.నాగరాజు, మూడవ వార్డు కౌన్సిలర్ కిల్లాన పార్వతీ పాల్గొన్నారు.