విజయనగరం

‘సిపిఎస్ విధానం రద్దు చేయాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), జూలై 3: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు అమలులోకి తెచ్చిన 2004 కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను రద్దుచేయాలని యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శేషగిరి డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా పరిషత్ ఆవరణలోని యుటిఎఫ్ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంట్రిబ్యూటరీ పింఛన్ వల్ల ఉద్యోగులకు ఎటువంటి భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాత పింఛన్ విధానం అమలుచేయాలని కోరారు. 2004లో అప్పటి ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టిందని చెబుతూ, ఈ విధానం వల్ల ఉద్యోగులు రిటైర్‌మెంట్ తరువాత ఎటువంటి బెనిఫిట్స్ ఉండవన్నారు. సర్వీసులో ఉండగా ఏ ఉద్యోగైనా చనిపోతే ఆ కుటుంబానికి భద్రత లేదన్నారు. గతంలో ఈ స్కీమ్‌పట్ల ఉద్యోగుల్లో నెలకొన్న భ్రమలు ఇటీవల తొలగిపోయాయని చెప్పారు. సిపిఎస్ విధానాన్ని రద్దుచేయాలని ఎపి అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు. ఈ విధానం రద్దు కోరుతూ పది లక్షల సంతకాలను సేకరించే ఉద్యమం చేపట్టి ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళతామని చెప్పారు. భవిష్యత్‌లో ఛలో పార్లమెంట్ ఉద్యమానికి సిద్ధమవుతామని అన్నారు. సిపిఎస్‌విధానంలో నెలకొన్న లోపాలను ఉద్యోగులకు అవగాహన కల్పించేందుకు 6వ తేదీన కలెక్టరేట్‌లో ఉద్యోగులు, ఎన్‌జిఓలు, ఉపాధ్యాయులతో సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు, గౌరవాధ్యక్షుడు అల్లూరి శివవర్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.