విజయనగరం

క్వారీ పేలుళ్లతో ప్రజల్లో భయాందోళనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, జూలై 3: మ ండలంలోని కొణిసి గ్రామంలోగల గ్రానైట్ క్వారీ నిర్వాహకు లు పేలుస్తున్న పేలుళ్లతో కొణి సతోపాటు సమీప చిట్టాయవలస గ్రామస్థులు భయబ్రాంతులకు గురవుతూ ఆందోళన వ్య క్తం చేస్తున్నారు. రాళ్లను పేల్చడానికి పేలుళ్లు నిర్వహించడంతో ఆ శబ్దాలు చెవులకు చిల్లులు పడేలా ఉంటున్నాయని, దీనివలన శారీరక సమస్యలు తలెత్తుతున్నాయని వాపోతున్నారు. బోడిమెట్టలో గెలాక్సీ, నటరాజ్, ఎస్.కె. చిన్నమ్మలు నాలుగు కంపెనీల నిర్వాహకులు క్వారీలు నిర్వహిస్తున్నారు. గ్రానైట్ రాయికోసం వీరు ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా అనధికారికంగా పేలుళ్లు నిర్వహిస్తున్నారని, దీనివలన ప్రతిరోజూ చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా శబ్దాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ పేలుళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.