విజయనగరం

‘దొడ్డిదారి ఒప్పందాలు కార్మికులు సహించరు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లిమర్ల, జూలై 3: నెల్లిమర్ల జూట్‌మిల్లు యాజమాన్యం దొడ్డిదారి ఒప్పందాలు చేస్తే కార్మికులు సహించరని జూట్‌మిల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి కిల్లంపల్లి రామారావు అన్నారు. ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 800 గ్రాట్యూటీ బకాయిలు చెల్లించాల్సి ఉన్నా యాజమాన్యం ఇంతవరకు చర్య లు చేపట్టలేదని అన్నారు. 5,10,18 రూపాయలు కోత బకాయిలు కార్మికులకు చెల్లించకుండా మరోసారి 18రూపాయలు కోతకు యాజమాన్యం సిద్ధపడుతుందని అన్నారు. ఒప్పందం ప్రకారం 2014కి 18రూపాయల కోత బకాయిలు చె ల్లించాల్సి ఉన్నా ఒప్పందాన్ని అమలు చేయలేదని అన్నారు. జూట్‌మిల్లు క్వార్టర్సులో నివాసం ఉంటున్న కార్మికులకు పిఎఫ్ క్లియరెన్స్ ఇవ్వడం లేదని అన్నా రు. గ్రాట్యూటీ బకాయిలు నిలిపివేయడం దారుణమని అన్నారు. కాంట్రాక్టు కార్మికులకు పిఎఫ్, ఇఎస్‌ఐ సౌకర్యం లేకుండా పనిచేస్తున్నారని, వారికి భద్రత కల్పించాలని కోరారు. మరోసారి కార్మికులపై భారంమోపే ఒప్పందాలు చేస్తే సహించబోమని చెప్పారు. యాజమాన్యం మొండికేసి చీకటి ఒప్పందాలు చేస్తే తిప్పికొడతామని అన్నారు.