విజయనగరం

‘పరిశుభ్రతపై ప్రజల ఆలోచనలో మార్పు రావాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొండపల్లి, జూలై 3: పరిసరాల పరిశుభ్రతపై ప్రజల ఆలోచనలలో మార్పు రావాల్సిన అవసరం ఉందని జెడ్పీటిసి బం డారు బాలాజీ అన్నారు. మండలంలోని బి.రాజేరు గ్రా మంలో సర్పంచ్ అధ్యక్షతన మండల బిజెపిశాఖ ఆధ్వర్యం లో స్వచ్ఛ్భారత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెలలో ప్రజలు మారుతున్న కాలాన్ని బట్టి ఆలోచనలలో మార్పు రావాలన్నారు. బిజెపి చేపట్టిన స్వచ్ఛ భారత్ పట్ల ప్రజలు అర్థం చేసుకుని ఆచరించాలన్నారు. జ నాభా పెరుగుతున్న దృష్ట్యా అవసరాలు పెరుగుతాయని, ప్ర తి అడుగు పరిశుభ్రత వైపు వేయాలని బాలాజీ పిలుపునిచ్చారు. మానవ మనుగడకు ప్రధానంగా పరిశుభ్రతతోనే ము డిపడి ఉందన్నారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.వి. వి.గోపాలరాజు మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపుమేరకు ఇప్పటివరకు గజపతినగరం నియోజకవర్గం లో 90 గ్రామాలలో స్వచ్ఛ్భారత్ నిర్వహించామని చెప్పారు. సామాజిక రుగ్మతలవైపు యువత పయనించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన వీధులలో అవగాహన ర్యాలీ నిర్వహించడంతోపాటు ప్రజల చేత స్వచ్ఛ్భారత్‌పై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా మోర్చ అధ్యక్షురాలు రెడ్డి పావని, ఎంపిటిసి పాశల సీతారామ్మూర్తి, బిజెపి నాయకులు కందుల గుప్త, బూడి మన్మధరావు, సామాజిక కా ర్యకర్త తిరుమలరాజు రామలింగరాజు పాల్గొన్నారు.