విజయనగరం

వల్లంపూడి పోలీసు స్టేషన్‌లో డిఎస్పీ తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేపాడ, జూలై 3: మండలంలోని వల్లంపూడి పోలీసు స్టేషన్‌లో విజయనగరం డి ఎస్పీ రమణ ఆదివారం వార్షిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఫిర్యాదులు, కేసు లు నమోదు, లైసెన్సులు కలిగిన తుపాకులు, గ్రామాల చరిత్ర రికార్డులను డిఎస్పీ పరిశీలించారు. పలు రికార్డుల నిర్వహణపై తప్పులను ఎత్తిచూపుతూ ఎస్సై కృష్ణమూర్తిని సున్నితంగా మందలించారు. ఉద్యోగంలో చేరి రెండున్నర సంవత్సరాలు జరుగుతున్నందున రికార్డుల నిర్వహణను తెలుసుకోవాలని డిఎస్పీ సూచించారు. అన్ని రికార్డులను ఎప్పుడు ఎవరు వచ్చి తనిఖీ చేసినా సక్రమంగా ఉండేలా చూసుకోవాలన్నారు. సెక్షన్-336 కేసులను ఎఎస్సైతో చర్చించాలే తప్ప ఎస్సైగా జోక్యం చేసుకోరాదని అన్నారు. ఈ సందర్భంగా తనను కలసిన విలేఖరులతో డిఎస్పీ రమణ మాట్లాడుతూ ప్రశాంతమైన మండలంలో ఎటువంటి హైరాన పడకుండా ఉద్యోగం చేసుకోవచ్చనని చెప్పారు. పోలీసు శాఖ అప్రమత్తంగా వ్యవహరించడంతో విజయనగరం డివిజన్‌లో నేరాలు తగ్గుముఖం పట్టాయని డిఎస్పీ చెప్పా రు. ఈ తనిఖీలో సిఐ లక్ష్మణమూర్తి, ట్రైనీ ఎస్సై రమేష్, సిబ్బంది ఉన్నారు.