విజయనగరం

‘ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల మూసివేత తగదు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), జూలై 3: సం క్షేమ హాస్టళ్లను ప్రభుత్వం మూసివేయ డం సరైన చర్య కాదని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశం తీర్మానించింది. బా లాజీ కూడలిలోని అంబేద్కర్ భవనం లో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లాకార్యదర్శి కె.సురేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇటీవల ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్ల మూసివేత, విలీనం, పాఠశాలల రేషనలైజేషన్ అంశాలపై చర్చించారు. ఈ సమావేశం లో దళిత హక్కుల పోరాట సమితి జి ల్లా ప్రధాన కార్యదర్శి రమేష్‌బాబు, వి శ్రాంత ఎయు ప్రొఫెసర్ రామకృష్ణారా వు, ఎఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కోట అప్పన్న, ప్రచార కార్యదర్శి బోడసింగి ఆనందరావు, పట్టణ కన్వీనర్ కో రాడ సత్యనారాయణలు మాట్లాడుతూ విజయనగరం జిల్లా వెనుకబడి ఉందని దళి త, బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు సంక్షేమ హాస్టళ్లు ఎంతో అవసరమన్నారు. ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్ల ను బలోపేతం చేయకుండా, ఎస్సీ సం క్షేమ, బిసి సంక్షేమ వసతి గృహాలను మూసివేయడం వలన పేద విద్యార్థులు విద్యకు దూరమవుతారని ఆందోళన వ్య క్తం చేశారు. ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్ల ను మూసివేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సమావేశం డిమాండ్ చేసింది. హాస్టళ్ల మూసివేతకు నిరసనగా 4వతేదీ న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దశలవారీగా పోరాట కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రాంబాబు, కార్యదర్శి చింత య్య, రామ్మోహన్ పాల్గొన్నారు.