విజయనగరం

ప్రైవేట్ వాహనాల అక్రమ రవాణాపై చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), జూలై 19: చట్ట వ్యతిరేకంగా తిరుగుతున్న ప్రైవేటు వాహనాల అక్రమ రవాణాపై నిర్థిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎంయు) జోనల్ చైర్మన్ పివి కుమార్, రీజనల్ చైర్మన్ కెవిఎల్ నరసింగరావుకోరారు. ఈ మేరకు ప్రాంతీయ రవాణాశాఖ ఉప కమిషనర్, జిల్లా ఎస్పీ, ఆర్టీసీ రీజనల్ మేనేజర్‌కు మంగళవారం వినతిపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ నగర పరిధిలో కాంప్లెక్స్, డిపోనకు మూడు కిలో మీటర్లు, జిల్లా ప్రాంతంలో రెండు కిలోమీటర్ల పరిధిలో ప్రైవేటు వాహనాలను నిలుపురాదనే నిబంధనలు అమలు చేసి ప్రైవేటు వాహనాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రైవేటు వాహనాల యజమానులు కాంట్రాక్ట్ పర్మిట్ తీసుకుని చట్ట వ్యతిరేకంగా స్టేజి క్యారియర్‌గా సర్వీసు చేయడం, గ్రూపు పాసింజర్లు కాకుండా డైరెక్ట్‌గా బుకింగ్ కౌంటర్స్ పెట్టి టిక్కెట్స్ అమ్మడం, ఆన్‌లైన్‌లో కూడా టిక్కెట్లను విక్రయించడం వంటి చర్యలు అటు ప్రభుత్వానికి, ఇటు సంస్థకు నష్టం కలిగించేవిధంగా ఉంటున్నాయని, వీటిని అరికట్టే ప్రయత్నాలు చేయాలని తెలిపారు. హైవేలపై ఆటోలు తిరగరాదని ప్రభుత్వం జిఒ జారీ చేసినా ఎక్కడా అమలు కావడం లేదని అన్నారు. ఆటోలు, మ్యాక్సిక్యాబ్‌లు, జీపులు తదితర వాహనాలపై పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడం జరుగుతుందని, ఇలాంటి వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఏ ప్రాంతంలో రిజిస్ట్రేషన్ జరిగిన వాహనాలను ఆ ప్రాంతంలో తిరిగే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వివిధ కళాశాలలకు, పాఠశాలలకు ఫిట్‌నెస్ లేని వాహనాలను నడపటం అరికట్టాలని అన్నారు. ఆర్టీసీ బస్టాండ్‌లు, డిపోలు, బస్టాపుల వద్ద ప్రైవేటు వాహనాలను ఆపి సర్వీసు చేస్తున్నవారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. చట్ట వ్యతిరేకంగా నడుపుతున్న ప్రైవేటువాహనాల అక్రమ రవాణాపై నిర్థిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.