విజయనగరం

సహకార సంఘాలతో రైతులకు ప్రయోజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూలై 19: ఉద్యాన పంటలు పండించే రైతులు సహకార సంఘాలు ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం కల్పించే సదుపాయాలు, రాయితీలు ఉపయోగించుకోవాలని కలెక్టర్ ఎం ఎం నాయక్ సూచించారు. ఉద్యాన రైతులు సహకార సంఘాలుగా ఏర్పడితే రైతులకు, ప్రభుత్వానికి చాలా సమస్యలు తగ్గుతాయని చెప్పారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉద్యానశాఖ, ఆత్మా ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యాన పంటల రైతులతో పరస్పర సహాయ సహకార సంఘాలకు సంబంధించిన అంశాలపై అధ్యక్ష, కార్యదర్శులకు నిర్వహించే రెండురోజుల శిక్షణా కార్యక్రమాన్ని కలెక్టర్ నాయక్ మంగళవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యాన పంటలు పండించే రైతులు మంచి దిగుబడులు సాధిస్తున్నా గిట్టుబాటు ధరలు, మార్కెటింగ్ సదుపాయాలు లేక నష్టపోతున్నారని చెప్పారు. ఉద్యాన పంటలకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధరలకు కొనుగోలు చేయవలసి వస్తుందని చెప్పారు. దీనివల్ల ఉత్పత్తి వ్యయం భారీగా పెరుగుతోందని అన్నారు. ఈ కారణంగా ఉద్యాన పంటల రైతులకు ప్రభుత్వం ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తున్నా ఉపయోగం లేకుండా పోతోందని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రెండు, మూడు గ్రామాలలోని ఉద్యాన రైతులతో పరస్పర సహాయ సహకార సంఘాలు ఏర్పాటుకు ప్రభుత్వాలు నిర్ణయించాయని చెప్పారు. జిల్లాలో 88వేల హెక్టార్లలో మామిడి, జీడిమామిడి, ఆయిల్‌ఫాం, అరటి ఇతర కూరగాయాల పంటలు పండిస్తున్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1142 మంది ఉద్యాన పంటల రైతులతో 63 సహకార సంఘాలను ఏర్పాటు చేసామని, ఈ సంఘాల ద్వారా రైతులకు వౌలిక సదుపాయాలు, వివిధ రాయితీలు కల్పించడంతోపాటు సంఘం ద్వారా మార్కెటింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ఉద్యాన రైతుల పరస్పర సహకార సంఘాల ఏర్పాటుతో చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, ఆత్మా ప్రాజెక్టు డైరెక్టర్ రామారావు, జిల్లా సహకార అధికారి వెంకటరావు, ఎపిఎంఐపి ప్రాజెక్టు డైరెక్టర్ పాండురంగ, నాబార్డ్ ఎజి ఎం శ్రీనివాస్ పాల్గొన్నారు.